Begin typing your search above and press return to search.

వాలంటీర్లకు హుకుం జారీ... వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్ధి వ్యాఖ్యలు వైరల్!

ఈ సమయంలో... వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి వాలంటీర్లకు డెడ్ లైన్ విధించడం ఇప్పుడు తీవ్ర వివాదాస్పదమవుతుంది!

By:  Tupaki Desk   |   2 May 2024 3:54 AM GMT
వాలంటీర్లకు హుకుం జారీ... వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్ధి వ్యాఖ్యలు వైరల్!
X

ఏపీలో ఎన్నికల సీజన్ ప్రారంభమైనప్పటినుంచీ వాలంటీర్ల గురించిన చర్చ ఏదో విధంగా జరుగుతూ నిత్యం లైవ్ లో ఉంటున్న సంగతి తెలిసిందే. ప్రధానంగా... పెన్షన్ల పంపిణీకి వాలంటీర్లను దూరం పెడుతూ ఈసీ నిర్ణయం తీసుకోవడం, అనూహ్యంగా వీరికి 10వేలు జీతం అని చంద్రబాబు ప్రకటించడం, మరోపక్క రాష్ట్రవ్యాప్తంగా వాలంటీర్లు రాజీనామాల బాట పట్టడం తీవ్ర చర్చనీయాంశం అవుతున్న సంగతి తెలిసిందే. ఈ సమయంలో... వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి వాలంటీర్లకు డెడ్ లైన్ విధించడం ఇప్పుడు తీవ్ర వివాదాస్పదమవుతుంది!

అవును... పెన్షన్, రేషన్ మొదలైన సంక్షేమ పథకాల పంపిణీలో తమను దూరం పెట్టడంతో హర్ట్ అయిన పలువురు వాలంటీర్లు రాజీనామాలు చేసిన సంగతి తెలిసిందే. ఇందులో కొంతమంది స్వచ్చందంగా చేయగా.. మరికొంతమంది వైసీపీ ఒత్తిడితో చేశారనే కామెంట్లు వినిపించాయి! వాటికి బలం చేకూరుస్తూ అన్నట్లుగా తాజాగా వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్ధి వాలంటీర్లకు వార్నింగ్ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదాస్పదమవుతున్నాయి.

వివరాళ్లోకి వెళ్తే... శ్రీకాకుళం జిల్లా టెక్కలిలో నియోజకవర్గస్థాయి వైసీపీ కార్యకర్తల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా మైకందుకున్న వైసీపీ ఎమ్మెల్సీ, టెక్కలి అసెంబ్లీ నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి దువ్వాడ శ్రీనివాస్.. వాలంటీర్లపై బెదిరింపు వ్యాఖ్యలు చేశారు. అంతా తక్షణమే రాజీనామా చేసి, పార్టీ కండువాలతో ఎన్నికల్లో విస్తృతంగా ప్రచారం చేయాలని హుకుం జారీచేశారు.

ఇంకా రాజీనామా చేయని, వైసీపీ కండువాను వైసుకోని వాలంటీర్లు తమకు పనిచేయరని.. అలాంటివారు జూన్‌ 5 నుంచి కొనసాగరని ఈ సందర్భంగా దువ్వాడ శ్రీనివాస్ స్పష్టంచేశారు. ఎవరైతే రాజీనామా చేసి తాను చెప్పిన పద్ధతుల్లో తిరుగుతున్నారో.. వారే వాలంటీర్లుగా కొనసాగుతారని ఆయన తేల్చి చెప్పడం గమనార్హం. అదేవిధంగా... ఇప్పటివరకు రాజీనామాలు చేయనివారు.. ఈనెల 3లోగా రాజీమానా చేయకుంటే.. వారు తమకు అక్కర్లేదని వెల్లడించారు.

దీంతో... ఈయన వ్యాఖ్యలు తీవ్ర వివాదాస్పదమవుతున్నాయి. ఎంత అజ్ఞానం, ఎంత అవివేకం.. ఒక పక్క వాలంటీర్లు వైసీపీ జనాలని బలమైన ఆరోపణలు, ఫిర్యాదులు అందుతున్న వేళ... పబ్లిక్ గా మైకుల్లో ఒక ఎమ్మెల్యే అభ్యర్థి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఏమిటి అంటూ పలువురు ఈ వ్యాఖ్యలను తప్పుబడుతున్నారు. ఇలాంటి ఒక్క అభ్యర్థి చాలు పార్టీని డ్యామేజ్ చేయడానికి అని వైసీపీ కార్యకర్తలు పలువురు కామెంట్స్ చేస్తుండటం గమనార్హం!