Begin typing your search above and press return to search.

ఆ గ్రామాలలో వంద శాతం పోలింగ్

ఇలా వంద శాతం ఓటింగ్‌కు కృషి చేసిన ఆధికారులను కలెక్టర్‌ షేక్ యాస్మిన్‌ బాషా ప్ర‌త్యేకంగా అభినందించారు.

By:  Tupaki Desk   |   14 May 2024 5:32 AM GMT
ఆ గ్రామాలలో వంద శాతం పోలింగ్
X

తెలంగాణలోని జగిత్యాల జిల్లా బీర్‌పూర్‌ మండలం చిన్నకొల్వాయిలో నాలుగో దశ లోక్ సభ ఎన్నికలలో భాగంగా వంద‌ శాతం పోలింగ్‌ నమోదైంది. అక్కడి ఓటర్లు అందరూ తమ ఓటు హక్కును వినియోగించుకుని చైతన్యాన్ని చాటడం విశేషం.

గ్రామంలో 110 మంది ఓటర్లు ఉండగా అందరూ త‌మ ఓటు హ‌క్కును వినియోగించుకున్నారు. ఇలా వంద శాతం ఓటింగ్‌కు కృషి చేసిన ఆధికారులను కలెక్టర్‌ షేక్ యాస్మిన్‌ బాషా ప్ర‌త్యేకంగా అభినందించారు.

దీంతో పాటు మెదక్‌ జిల్లా కొల్చారం మండలం సంగాయిపేట తండాలో కూడా ఏకంగా 100 శాతం పోలింగ్ న‌మోదైంది. ఈ తండాలో ఏర్పాటు చేసిన‌ 62ఏ అదనపు పోలింగ్‌ కేంద్రం పరిధిలో 210 మంది ఓటర్లు ఉండగా.. అంద‌రూ ఓటు వేశారు. 95 మంది పురుషులు, 115 మంది మహిళా ఓట‌ర్లు త‌మ ఓటు హ‌క్కు వినియోగించుకున్న‌ట్లు పోలింగ్ సిబ్బంది వెల్ల‌డించారు. దీంతో సంగాయిపేట తండా వాసుల‌ను మెద‌క్ క‌లెక్ట‌ర్ అభినందించారు.