Begin typing your search above and press return to search.

పుష్పరాజ్ షూ స్టెప్ కంపోజర్ ఎవరో తెలుసా?

అందులో భాగంగా రీసెంట్ గా మేకర్స్.. పుష్ప పుష్ప.. అంటూ సాగే టైటిల్ సాంగ్ ను రిలీజ్ చేశారు.

By:  Tupaki Desk   |   2 May 2024 12:13 PM GMT
పుష్పరాజ్ షూ స్టెప్ కంపోజర్ ఎవరో తెలుసా?
X

టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప-2 మూవీపై పాన్ ఇండియా లెవెల్ లో భారీ అంచనాలు ఉన్న సంగతి తెలిసిందే. అందుకు తగ్గట్టు మేకర్స్ కూడా పక్కా ప్లాన్ తో దూసుకుపోతున్నారు. సినిమాపై ఇంకా హైప్ క్రియేట్ చేసేలా గ్లింప్స్, పోస్టర్లు రిలీజ్ చేస్తున్నారు. అందరి దృష్టి తమ మూవీ వైపు తిప్పుకుంటున్నారు. అందులో భాగంగా రీసెంట్ గా మేకర్స్.. పుష్ప పుష్ప.. అంటూ సాగే టైటిల్ సాంగ్ ను రిలీజ్ చేశారు.

అయితే ఈ లిరికల్ సాంగ్ లో అల్లు అర్జున్ వేసిన హుక్ స్టెప్ ను కూడా యాడ్ చేశారు. పుష్ప మూవీలోని శ్రీవల్లి సాంగ్ లో నడుస్తూ చెప్పు వదిలేసే స్టెప్.. ఎంత పాపులర్ అయిందో తెలిసిందే. ఇప్పుడు పుష్ప-2 టైటిల్ సాంగ్ లోని షూ వదిలేసే స్టెప్ కూడా ఫుల్ వైరల్ అవుతోంది. సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఆ స్టెప్పే కనిపిస్తోంది. బన్నీ కూడా ఆ స్టెప్ ను ఫుల్ గ్రేస్ తో వేసి అదరగొట్టేశారని చెప్పడంలో ఎలాంటి డౌట్ అక్కర్లేదు.

ఇక పుష్ప-2 మూవీకి డ్యాన్స్ మాస్టర్లుగా ప్రేమ్ రక్షిత్, శ్రేష్టి వర్మ, గణేష్, ఆచార్య, విజయ్ పోలాకి వ్యవహరిస్తున్నారు. అయితే టైటిల్ సాంగ్ లోని షూ హుక్ స్టెప్ ను మాత్రం విజయ్ పోలాకి కంపోజ్ చేశారు. ఈ విషయాన్ని ఆయనే సోషల్ మీడియాలో తెలిపారు. పుష్ప ది రూల్ కోసం నా సిగ్నేచర్ హుక్ స్టెప్‌ ను చూడండంటూ విజయ్ ఇన్ స్టాలో రీల్ ను పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఆయన పోస్ట్ నెట్టింట వైరల్ గా మారింది.

ఈ వీడియోను చూసిన బన్నీ ఫ్యాన్స్.. సూపర్ అన్న స్టెప్ అదరగొట్టేశావని కామెంట్లు పెడుతున్నారు. అల్లు అర్జున్ తో అదిరిపోయే స్టెప్ వేయించావని అంటున్నారు. కెరీర్ విషయంలో ఆల్ ది బెస్ట్ కూడా చెబుతున్నారు. అస్సలు తగ్గొద్దు అంటూ రచ్చ రచ్చ చేస్తున్నారు. ఇప్పటికే పలు సినిమాలకు డ్యాన్స్ మాస్టర్ గా చేసి మంచి పేరు సంపాదించుకున్నారు విజయ్ పోలాకి. పుష్ప-2తో ఆయన క్రేజ్ మరింత పెరిగిపోవడం పక్కా.

ఇక ఈ టైటిల్ సాంగ్ కు స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ ఫుల్ మాస్ బీట్ ఇచ్చారు. తెలుగులో నకాష్ అజీజ్, దీపక్ బ్లూ అద్భుతంగా పాడారు. ఆస్కార్ విన్నింగ్ చంద్రబోస్ లిరిక్స్ అందించారు. తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళం భాషల్లో ఈ సాంగ్ రిలీజ్ అయింది. బెంగాలీలో కూడా ఈ పాట తీసుకొస్తామని పుష్ప-2 టీం చెప్పింది. మరి ఈ సినిమా నుంచి నెక్స్ట్ క్రేజీ అప్డేట్ ఎప్పుడు వస్తుందో వేచి చూడాలి.