Begin typing your search above and press return to search.

దేవర బిజినెస్.. న్యూ స్ట్రాటజీతో డీల్స్ క్లోజ్..?

ఓ వైపు పెండింగ్ సీక్వెన్స్ షూట్ కంప్లీట్ చేయడానికి కొరటాల శివ ప్లాన్ చేసుకుంటూనే పోస్ట్ ప్రొడక్షన్ మీద ప్రత్యేక దృష్టి పెట్టారు.

By:  Tupaki Desk   |   30 April 2024 4:56 PM GMT
దేవర బిజినెస్.. న్యూ స్ట్రాటజీతో డీల్స్ క్లోజ్..?
X

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో దేవర మూవీ చేస్తోన్న సంగతి తెలిసిందే. ఈ మూవీ షూటింగ్ చివరి దశలో ఉంది. తారక్ ఓ వైపు వార్ 2 మూవీ షూటింగ్ చేస్తూనే దేవరకి కూడా కాల్ షీట్స్ ఇచ్చాడు. ఈ సినిమా రెండు భాగాలుగా తెరకెక్కుతోంది. అందులో పార్ట్ 1 షూటింగ్ చివరి దశకి వచ్చేసింది. ఓ వైపు పెండింగ్ సీక్వెన్స్ షూట్ కంప్లీట్ చేయడానికి కొరటాల శివ ప్లాన్ చేసుకుంటూనే పోస్ట్ ప్రొడక్షన్ మీద ప్రత్యేక దృష్టి పెట్టారు.

ఈ సినిమాతో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ తెలుగులోకి గ్రాండ్ ఎంట్రీ ఇస్తోంది. సైఫ్ ఆలీఖాన్ ప్రతినాయకుడిగా కనిపించబోతున్నారు. కంప్లీట్ యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో ఈ మూవీ ఉండబోతోందని ఇప్పటికే కొరటాల క్లారిటీ ఇచ్చేశారు. అలాగే మూవీ కథ సముద్ర తీరప్రాంతంలో జరిగేదిగా ఉంటుందంట. ఈ సినిమా కోసం తారక్ చాలా ఎఫర్ట్ పెట్టారు. ఆర్ఆర్ఆర్ లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత తారక్ నుంచి రాబోతున్న సినిమా దేవర.

దీంతో ఈ సినిమాపై ఆడియన్స్ లో అంచనాలు గట్టిగానే ఉన్నాయి. అలాగే ఆర్ఆర్ఆర్ సినిమాతో కంపారిజన్ ఉంటుంది. ఈ కారణంగా పెర్ఫార్మెన్స్ ఆర్ఆర్ఆర్ కి మించి ఉండేలా తారక్ చూసుకుంటున్నాడు. అలాగే యాక్షన్ ఎపిసోడ్స్ విషయంలో కూడా ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. కొరటాల శివకి ఈ సినిమా సక్సెస్ కొట్టడం చాలా అవసరం. అందుకే ఆయన కూడా దేవర సినిమాని ప్రాణం పెట్టి తీస్తున్నారంట. జాన్వీ కపూర్ పెర్ఫార్మెన్స్ కి కావాల్సినంత స్కోప్ మూవీలో ఉన్నట్లు తెలుస్తోంది.

ఈ చిత్రాన్ని ఎన్టీఆర్ ఆర్ట్స్, యువసుదా ఆర్ట్స్ సంయుక్తంగా 300 కోట్ల బడ్జెట్ తో నిర్మిస్తున్నాయి. కళ్యాణ్ రామ్ సినిమా కోసం 150 కోట్ల వరకు పెట్టుబడి పెట్టారంట. అలాగే మరో భాగస్వామిగా ఉన్న మిక్కిలినేని సుధాకర్ కూడా అంతే మొత్తంలో పెట్టుబడి పెట్టినట్లు తెలుస్తోంది. బడ్జెట్ ఎక్కువైన ఈ సినిమా రైట్స్ కోసం బయ్యర్ల నుంచి చిత్ర నిర్మాతలు మరీ ఎక్కువ మొత్తంలో డిమాండ్ చేయడం లేదంట. అసలే కొరటాల సక్సెస్ ట్రాక్ మిస్సయ్యాడు కాబట్టి కాస్త రిస్క్ తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.

మూవీకి బలంగా మార్కెట్ లోకి తీసుకెళ్ళాలంటే రీజనబుల్ రేట్స్ లోనే రైట్స్ ని బయ్యర్లకి ఇస్తున్నట్లు టాక్. అయితే ప్రాఫిట్ షేర్ పద్దతిలో రైట్స్ ని అమ్ముతున్నారు. తద్వారా మూవీకి హిట్ టాక్ వస్తే భారీ లాభాలు వచ్చే అవకాశం ఉంటుందని భావిస్తున్నారు. సినిమా మీద ఉన్న ఎక్స్ పెక్టేషన్స్ నేపథ్యంలో స్ట్రాంగ్ ఓపెనింగ్స్ అయితే వస్తాయి.

అయితే లాంగ్ రన్ లో మూవీ నిలబడాలంటే మాత్రం కచ్చితంగా బ్లాక్ బస్టర్ హిట్ టాక్ రావాలి. చిత్ర యూనిట్ అయితే అవుట్ మీద చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నట్లు తెలుస్తోంది. ఇక లాంగ్ రన్ లో లాభాలు వస్తే అటు బయ్యర్ల తో పాటు నిర్మాతలకు కూడా మంచి ప్రాఫిట్స్ వచ్చే అవకాశం ఉంటుంది. ఒకవేళ టాక్ తేడా వస్తే మాత్రం తక్కువ రేట్లకు అమ్ముతున్నారు కాబట్టి నిర్మాతలు కూడా నష్టపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది.