Begin typing your search above and press return to search.

బిగ్ సినిమాలు లేవు కానీ.. అప్డేట్స్ తో అడ్జస్ట్ అవ్వండి

షెడ్యూల్ ఆలస్యం కావడం, అలాగే ఎన్నికల హడావిడి కారణంగా స్టార్ హీరోలు తమ సినిమాలు సమ్మర్ లో విడుదల చేసే ధైర్యం చేయలేదు.

By:  Tupaki Desk   |   30 April 2024 4:42 PM GMT
బిగ్ సినిమాలు లేవు కానీ.. అప్డేట్స్ తో అడ్జస్ట్ అవ్వండి
X

ఈ ఏడాది సమ్మర్ సీజన్ లో టాలీవుడ్ బిగ్ స్టార్స్ నుంచి ఎలాంటి సినిమాలు ప్రేక్షకుల ముందుకి రావడం లేదు. సమ్మర్ సీజన్ తర్వాత జూన్ నుంచి స్టార్ హీరో సినిమాల సందడి మొదలు కాబోతోంది. అయితే హీరోలు తమ సినిమాలకి సంబందించిన అప్డేట్స్ తో ఫ్యాన్స్ ని ఈ సమ్మర్ కి కాస్తా సంతృప్తి పరిచే ప్రయత్నం చేస్తున్నారు. షెడ్యూల్ ఆలస్యం కావడం, అలాగే ఎన్నికల హడావిడి కారణంగా స్టార్ హీరోలు తమ సినిమాలు సమ్మర్ లో విడుదల చేసే ధైర్యం చేయలేదు.

మే నెలలో స్టార్ హీరోల సినిమాల నుంచి కీలక అప్డేట్స్ రాబోతున్నాయి. అవేంటో ఓ సారి చూసుకుంటే మే 1న పుష్ప ది రూల్ నుంచి ఫస్ట్ సింగిల్ ని చిత్ర యూనిట్ రిలీజ్ చేయబోతోంది. ఈ సాంగ్ గురించి బన్నీ ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కచ్చితంగా సాంగ్ ట్రెండ్ సెట్ చేస్తుందని భావిస్తున్నారు. ఈ మూవీ ఆగష్టు 15న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అవుతోంది. దీంతో మే1 నుంచి ప్రమోషన్ యాక్టివిటీస్ షురూ చేస్తున్నారు.

నెక్స్ట్ కల్కి 2898 ఏడీ నుంచి ఫస్ట్ సింగిల్ ఈ నెలలోనే రిలీజ్ కాబోతోందని తెలుస్తోంది. ఇండియన్ ఫస్ట్ ఫ్యూచరిస్టిక్ కాన్సెప్ట్ మూవీతో ఈ చిత్రం జూన్ 27న రిలీజ్ కాబోతోంది. దేశ వ్యాప్తంగా సినిమాపై భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. ప్రభాస్ ఈ మూవీలో కల్కి పాత్రలో కనిపించబోతున్నాడు. అలాగే బాలీవుడ్ స్టార్స్ అమితాబచ్చన్, దీపికా పదుకునే, దిశా పటాని మూవీలో కీలక పాత్రలలో నటిస్తున్నారు. కమల్ హాసన్ ప్రతినాయకుడిగా కనిపించబోతున్నారు.

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న హరిహరవీరమల్లు టీజర్ మే 2న రిలీజ్ చేయబోతున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. కాకతీయుల కాలం నాటి కథాంశంతో ఈ మూవీ ఉండబోతోంది. పవన్ కళ్యాణ్ కెరియర్ లో భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా చిత్రంగా ఈ మూవీ రాబోతోంది. టీజర్ రిలీజ్ డేట్ ప్రకటించడంతో పవర్ స్టార్ అభిమానులకి ఊపొచ్చింది.

యంగ్ టైగర్ ఎన్టీఆర్ దేవర చిత్ర నుంచి ఫస్ట్ సింగిల్ ని ఈ నెలలోనే రిలీజ్ చేయనున్నట్లు తెలుస్తోంది. జూనియర్ ఎన్టీఆర్ బర్త్ డే సందర్భంగా మే 20న ఫస్ట్ సింగిల్ ని ప్రేక్షకుల ముందుకి తీసుకురానున్నట్లు టాక్ వినిపిస్తోంది. అనిరుద్ ఈ చిత్రానికి మ్యూజిక్ అందిస్తున్న నేపథ్యంలో అంచనాలు భారీగానే ఉన్నాయి. కొరటాల శివ ఈ చిత్రాన్ని ఫుల్ యాక్షన్ ప్యాక్డ్ కథాంశంతో సిల్వర్ స్క్రీన్ పై ఆవిష్కరించే ప్రయత్నం చేస్తున్నారు. దసరా కానుకగా ఈ మూవీ రిలీజ్ కానుంది. అలాగే సలార్ పార్ట్ 2 షూటింగ్ అప్డేట్ కూడా ఈ నెలలోనే రానున్నట్లు టాక్ వినిపిస్తోంది.