Begin typing your search above and press return to search.

పిక్‌ టాక్‌ : కూల్‌ అండ్ స్టైలిష్‌ నాన్న

కూల్‌ అండ్ స్టైలిష్ లుక్ లో నాని అదరగొట్టాడు అంటూ నెటిజన్స్ మరియు ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

By:  Tupaki Desk   |   1 May 2024 11:30 AM GMT
పిక్‌ టాక్‌ : కూల్‌ అండ్ స్టైలిష్‌ నాన్న
X

నేచురల్‌ స్టార్‌ నాని గత ఏడాది దసరా మరియు హాయ్ నాన్న సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. దసరా సినిమా హిట్ అవ్వడం తో పాటు నటుడిగా నాని మంచి మార్కులు దక్కించుకున్నాడు. ఇక హాయ్ నాన్న సినిమా కమర్షియల్‌ గా మంచి ఫలితాన్ని దక్కించుకుంది.

హీరోగా నాని ప్రస్తుతం సరిపోదా శనివారం సినిమాను చేస్తున్న విషయం తెల్సిందే. విభిన్నమైన కాన్సెప్ట్‌ తో రూపొందుతున్న ఈ సినిమా షూటింగ్‌ చకచక జరుగుతోంది. ఇప్పటికే విడుదల అయిన టీజర్‌ సినిమా పై అంచనాలను అమాంతం పెంచిన విషయం తెల్సిందే. అందుకే సినిమా ఎప్పుడెప్పుడు విడుదల అవుతుందా అంటూ అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

సరిపోదా శనివారం సినిమా కోసం నాని ఇప్పటి వరకు కనిపించని పాత్రలో నటిస్తున్నాడు. ఇక నాని ఇన్‌ స్టా లో అప్పుడప్పుడు మాత్రమే ఫోటోలు షేర్‌ చేస్తూ ఉంటాడు. తాజాగా ఈ ఫోటోలను షేర్‌ చేయడం ద్వారా అందరి దృష్టిని ఆకర్షించాడు.

కూల్‌ అండ్ స్టైలిష్ లుక్ లో నాని అదరగొట్టాడు అంటూ నెటిజన్స్ మరియు ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. నానిని ఎప్పుడు ఇలాగే చూడాలని కోరుకుంటామని, ఇంతటి కూల్‌ లుక్ లో ఉండే నాని మాస్ లుక్ లో చూడాలి అంటే కాస్త కష్టమే అనేది నెటిజన్స్‌ కామెంట్స్.

ప్రస్తుతం చేస్తున్న సరిపోదా శనివారం సినిమా తర్వాత బలగం వేణు దర్శకత్వంలో నాని ఒక సినిమాను చేయబోతున్నాడు. సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్‌ వర్క్‌ ఇప్పటికే ప్రారంభం అయ్యిందని సమాచారం అందుతోంది. నాని తో ఒక మంచి పల్లెటూరు నేపథ్యంలో సినిమాను వేణు చేసేందుకు రెడీ అవుతున్నాడట.