Begin typing your search above and press return to search.

పిక్ టాక్‌ : ఈమె వయసు పెరుగుతుందా? తగ్గుతుందా?

సన్నని నడుము అందం చూపిస్తూ క్లీవేజ్ షో తో మతి పోగొడుతున్న శ్రియా సరన్ అందాల ఆరబోత ఫోటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్‌ అవుతున్నాయి.

By:  Tupaki Desk   |   2 May 2024 7:30 AM GMT
పిక్ టాక్‌ : ఈమె వయసు పెరుగుతుందా? తగ్గుతుందా?
X

ఇష్టం సినిమాతో 2001 లో తెలుగు సినీ ప్రేక్షకులకు పరిచయం అయిన ముద్దుగుమ్మ శ్రియా సరన్‌. ఈ అమ్మడు ఇండస్ట్రీలో అడుగు పెట్టి 23 ఏళ్లు అవుతున్నా కూడా ఇంకా కూడా ఏదో ఒక భాషలో సినిమాలు చేస్తూ సందడి చేస్తూనే ఉంది. ఆ మధ్య తెలుగు లో కూడా వరుసగా సినిమాలు చేసింది.

సాధారణంగా హీరోయిన్స్ వయసు పెరుగుతున్న కొద్దీ అందం తగ్గి కొందరు కనిపించకుండా కనుమరుగు అవుతారు. కానీ ముద్దుగుమ్మ శ్రియా సరన్‌ మాత్రం నాలుగు పదుల వయసు దాటినా కూడా ఇంకా మునుపటి కంటే ఎక్కువ ఉత్సాహంతో అందాల ఆరబోత చేస్తూ సోషల్‌ మీడియాలో కొత్త వారికి ధీటుగా పోటీగా నిలుస్తోంది.

ఆకట్టుకునే అందంతో పాటు శ్రియా సరన్ మంచి ఫిజిక్‌ ఆమె అందంను మరింతగా పెంచుతుంది అనడంలో సందేహం లేదు. తాజాగా ఫాబ్‌ లుక్ కవర్‌ పేజీ ఎక్కిన శ్రియా ని చూస్తే ఆ విషయం నిజమే అనిపించకుండా ఉండదు. నాలుగు పదుల వయసులో ఇంతటి అందం ఎలా సాధ్యం అని అంతా ముక్కున వేలేసుకుంటున్నారు.

సన్నని నడుము అందం చూపిస్తూ క్లీవేజ్ షో తో మతి పోగొడుతున్న శ్రియా సరన్ అందాల ఆరబోత ఫోటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్‌ అవుతున్నాయి. ఆకట్టుకునే అందం తో పాటు ఫోటోకు తగ్గట్లుగా, కాస్ట్యూమ్స్ కి తగ్గట్లుగా అందంగా ఫోటోలకు ఫోజ్ ఇవ్వడంలో శ్రియా సరన్‌ ముందు ఉంటుంది. అందుకే ఈ అమ్మడి జోరుకు నెటిజన్స్ ఫిదా అవుతున్నారు.

గత ఏడాది రెండు మూడు సినిమాలతో వచ్చిన శ్రియా ఈ ఏడాది ఒక టీవీ షో తో ప్రేక్షకులకు వినోదాన్ని పంచబోతుంది. మరో వైపు ఈ అమ్మడిని వెతుక్కుంటూ వెబ్‌ సిరీస్ లు కూడా వస్తున్నాయట. ముందు ముందు మరింత బిజీ అవ్వడం కోసం ఇలాంటి అందాల ఆరబోత ఫోటోలను శ్రియా షేర్ చేస్తుంది అనేది కొందరి అభిప్రాయం.