Begin typing your search above and press return to search.

సత్యదేవ్.. ఈసారి బాక్సాఫీస్ టార్గెట్ ఎంతంటే?

అయితే సత్యదేవ్ థియేటర్స్ లో ఇప్పటి వరకు ఆశించిన స్థాయిలో కమర్షియల్ సక్సెస్ అందుకోలేదు.

By:  Tupaki Desk   |   11 May 2024 4:32 AM GMT
సత్యదేవ్.. ఈసారి బాక్సాఫీస్ టార్గెట్ ఎంతంటే?
X

మంచి యాక్టర్ గా తనకంటూ ఒక స్పెషల్ ఇమేజ్ సొంతం చేసుకున్నాడు నటుడు సత్యదేవ్. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కెరియర్ స్టార్ట్ చేసి తన విలక్షణ నటనతో, ఇంటెన్సివ్ పెర్ఫార్మెన్స్ తో ప్రేక్షకులకి చేరువ అయ్యాడు. సత్యదేవ్ ని చూడగానే తెలియకుండానే ఒక పాజిటివ్ ఒపీనియన్ వస్తుంది. కచ్చితంగా అతని సినిమాలలో ఏదో ఇంటరెస్టింగ్ విషయం ఉంటుందని ఆడియన్స్ భావిస్తారు.

అయితే సత్యదేవ్ థియేటర్స్ లో ఇప్పటి వరకు ఆశించిన స్థాయిలో కమర్షియల్ సక్సెస్ అందుకోలేదు. విభిన్న కథలతో నటుడిగా ప్రూవ్ చేసుకున్నాడు. అవకాశాలు విరివిగా అందుకుంటున్నాడు. విమర్శకుల ప్రశంసలు సొంతం చేసుకున్నాడు. అయితే కమర్షియల్ సక్సెస్ మాత్రం ఇప్పటి వరకు రాలేదు. తాజాగా సత్యదేవ్ కృష్ణమ్మ మూవీతో ప్రేక్షకుల ముందుకి వచ్చాడు.

ఈ సినిమాతో ఎలా అయిన కమర్షియల్ హిట్ కొట్టాలనే కసితో సత్యదేవ్ ఉన్నాడు. వివి గోపాలకృష్ణ దర్శకత్వంలో ఈ మూవీ తెరకెక్కింది. స్టార్ డైరెక్టర్ కొరటాల శివ ఈ సినిమాకి నిర్మాణ భాగస్వామిగా మారాడు. ఆయన సమర్పకుడిగా వ్యవహరిస్తున్నారు. కృష్ణ కొమ్మలపాటి కృష్ణమ్మ చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమాని కొరటాల శివ దగ్గరుండి ప్రమోట్ చేశారు. మూవీ ట్రైలర్ కి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది.

దీంతో సినిమాపై వరల్డ్ వైడ్ గా 3 కోట్ల బిజినెస్ జరిగిందంట. అంటే ఈ మూవీ బ్రేక్ ఈవెన్ అందుకోవాలంటే 3.50 కోట్ల షేర్ రాబట్టాల్సి ఉంటుంది. తెలుగు రాష్ట్రాలలో 2.50 కోట్ల బిజినెస్ కృష్ణమ్మ చిత్రంపై జరిగింది. యాక్షన్ బ్యాక్ డ్రాప్ స్టోరీతో ఈ చిత్రం తెరకెక్కింది. శుక్రవారం ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ సినిమా పెద్ద చాలెంజ్ ను ఎదుర్కొంటోంది. ఒకవైపు ఎలక్షన్స్ హడావుడి, ఐపీఎల్ హంగామా బాక్సాఫీస్ వద్ద ఇంపాక్ట్ చూపిస్తున్నాయి.

సినిమాలో సత్యదేవ్ పెర్ఫార్మెన్స్ అద్భుతంగా ఉందనే మాట వినిపిస్తోంది. రివేంజ్ డ్రామా అయిన కూడా దర్శకుడు కథని కొత్తగా ప్రెజెంట్ చేసాడనే అభిప్రాయం వస్తోంది. ఇదే ఫీడ్ బ్యాక్ తో ప్రేక్షకాదరణ కొనసాగితే బ్రేక్ ఈవెన్ కలెక్షన్స్ ని కృష్ణమ్మ ఈజీగా అందుకునే ఛాన్స్ ఉంటుంది. ఈ మూవీతో సత్యదేవ్ కమర్షియల్ సక్సెస్ అందుకుంటాడా లేదా అనేది తెలియాలంటే వీకెండ్ వరకు వెయిట్ చేయాల్సిందే. సినిమాలో మీసాల లక్ష్మణ్, కృష్ణ బూరుగుల, అర్చన ఇతర పాత్రలలో నటించారు. అనిత రాజ్ హీరోయిన్ గా పరిచయం అయ్యింది. కాల భైరవ కృష్ణమ్మ చిత్రానికి మ్యూజిక్ అంధించాడు.