Begin typing your search above and press return to search.

ప్ర‌తిభావంతుల‌కు ప్ర‌శాంత వ‌ర్మ అవ‌కాశం!

`హ‌నుమాన్` విజ‌యంతో యువ ద‌ర్శ‌కుడు ప్ర‌శాంత్ వ‌ర్మ పేరిప్పుడు పాన్ ఇండియాలో మారు మ్రోగిపోతుంది.

By:  Tupaki Desk   |   2 May 2024 8:04 AM GMT
ప్ర‌తిభావంతుల‌కు ప్ర‌శాంత వ‌ర్మ అవ‌కాశం!
X

`హ‌నుమాన్` విజ‌యంతో యువ ద‌ర్శ‌కుడు ప్ర‌శాంత్ వ‌ర్మ పేరిప్పుడు పాన్ ఇండియాలో మారు మ్రోగిపోతుంది. ఆ సినిమా 300 కోట్ల వ‌సూళ్లు సాధించ‌డంతో స్టార్ హీరోలంతా పిలిచి మ‌రీ అవ‌కాశం ఇస్తున్నారు. కానీ ప్ర‌శాంత్ వ‌ర్మ త‌న‌కంటూ ఓయూనివ‌ర్శ్ ని క్రియేట్ చేసుకుని ఓ ప్లానింగ్ ప్రకారం ముందుకెళ్తున్నాడు. ఇప్ప‌టికే `హ‌నుమాన్` కి సీక్వెల్ కూడా ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. ఇందులో న‌టించే `హ‌నుమాన్` ఎవ‌రు? ఎలాంటి న‌టులు కీల‌క పాత్ర‌లు పోషిస్తారు? అన్న‌ది ఆస‌క్తిక‌రంగా మారింది.


శ్రీరామ న‌వ‌మి సంద‌ర్భంగా రిలీజ్ చేసిన పోస్ట‌ర్ కి మంచి రెస్పాన్స్ వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే. మొద‌టి భాగాన్ని ప్రీక్వెల్ గా తీసుకొస్తే రెండ‌వ భాగాన్నీ సీక్వెల్ గా రిలీజ్ చేయ‌బోతున్నారు. ఇందులో ఓ స్టార్ హీరో నటించే అవ‌కాశం ఉంది. చిరంజీవి కూడా న‌టిస్తాన‌ని స్వ‌యంగా ఆయ‌నే వెల్ల‌డించారు. ఈ నేప‌థ్యంలో సీక్వెల్ మ‌రింత ప్ర‌త్యేకంగా ఉంటుంద‌ని చెప్పాల్సిన ప‌నిలేదు. ఆ స్టార్ చిరంజీవి అవుతారా? మ‌రోక‌రా? అన్న‌ది త‌ర్వాత సంగ‌తి.

తాజాగా పీవీసీయూలోకి ప్ర‌శాంత్ వ‌ర్మ ఔత్సాహికుల్ని ఆహ్వానిస్తున్నాడు. ప్ర‌తిభ ఉండి నిరూపించుకునే వారికి ఇది మంచి అవ‌కాశం అంటూ ఓ ఎంట్రీ కార్య‌క్ర‌మం షురూ చేసాడు. ప్రతిభావంతులందరినీ తన పీవీసీయూలో చేరాల్సిందిగా ఆహ్వానించాడు. సినిమాలంటే ఇష్టమున్న న‌టులు...సాంకేతిక నిపుణులు..ఎడిటిట‌ర్లు.. గ్రాఫిక్స్ పై అవ‌గాహ‌న ఉన్న‌వారు అంతా పీవీసీయూలోకి రావొచ్చ‌ని పిలుపునిచ్చాడు. రైటింగ్ పై అవ‌గాహన ఉన్నారు..ఫ్యాష‌న్ ఉన్న వారు కూడా ప్రశాంత్ యూనివ‌ర్శ్ లోకి వెళ్లొచ్చు.

ఎవ‌రి సూప‌ర్ ప‌వ‌ర్ ని వారు అక్క‌డ నిరూపించుకోవ‌చ్చు. మిమ్మ‌ల్ని ప్ర‌త్యేకంగా నిల‌బెట్టే ఈవెంట్ అంటూ పిలుపునిచ్చాడు. అందుకు వాళ్లంతా చేయాల్సింద‌ల్లా త‌మ వివ‌రాలు..ట్యాలెట్ కి సంబంధించిన డేటాని `talent@thepvcu.com`కి మెయిల్ చేయ‌డ‌మే. ఔత్సాహికుల‌కు ఇది మంచి అవ‌కాశం. ట్యాలెంట్ ఉంటే ప్ర‌శాంత్ మంచి అవ‌కాశాలు క‌ల్పించ‌డానికి ఛాన్స్ ఉంది. ప్రశాంత్ వ‌ర్మ కూడా ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఇండ‌స్ట్రీకి వెళ్లిన వాడే. ఒక్క అవ‌కాశం అంటూ ఎన్నో ఆఫీస్ లు చుట్టూ తిరిగిన వాడే. అందుకే ట్యాలెంట్ ఉన్న వారికి తానొక మంచి వేదిక క‌ల్పించాడు.