Begin typing your search above and press return to search.

'ప్రసన్నవదనం'.. సుహాస్ బాక్సాఫీస్ టార్గెట్ ఎంత?

థీయాట్రికల్ బిజినెస్ పరంగా చూసుకుంటే 2.5 కోట్ల వేల్యూ ఉంటుందని భావిస్తున్నారు. అంటే దాదాపు 3 కోట్ల షేర్ రాబట్టాల్సి ఉంటుంది.

By:  Tupaki Desk   |   1 May 2024 3:51 AM GMT
ప్రసన్నవదనం.. సుహాస్ బాక్సాఫీస్ టార్గెట్ ఎంత?
X

ప్రస్తుతం టాలీవుడ్ లో నేచురల్ యాక్టింగ్ తో దూసుకుపోతున్న యువ హీరో సుహాస్. కమెడియన్ గా కెరియర్ స్టార్ట్ చేసిన సుహాస్ కి కలర్ ఫోటో మూవీ హీరోగా బ్రేక్ ఇచ్చింది. అందులో కన్నీళ్లు పెట్టించే పెర్ఫార్మెన్స్ తో ఆకట్టుకున్నాడు. ఆ మూవీ తర్వాత కూడా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా పలు సినిమాలలో నటించాడు. గత ఏడాది రైటర్ పద్మభూషణ్ సినిమాతో సుహాస్ హీరోగా మరో హిట్ ఖాతాలో వేసుకున్నాడు.

ఈ సినిమా తర్వాత అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ మూవీతో డీసెంట్ హిట్ సొంతం చేసుకున్నాడు. ఇది విలేజ్ బ్యాక్ డ్రాప్ లో లవ్ అండ్ కామెడీ జోనర్ లో వచ్చి సక్సెస్ అందుకుంది. ఈ ఏడాది శ్రీరంగ నీతులు అనే మూవీతో ప్రేక్షకుల ముందుకి వచ్చాడు. ఈ సినిమాకి పర్వాలేదనే టాక్ వచ్చింది. అయితే కమర్షియల్ సక్సెస్ అందుకోలేదు. అంథాలజీ స్టోరీస్ తో శ్రీరంగ నీతులు తెరకెక్కింది. సోలో హీరోగా ప్రస్తుతం ప్రసన్నవదనం అనే మూవీ రిలీజ్ కి సిద్ధం అవుతోంది.

మే3న ఈ సినిమాని గ్రాండ్ గా రిలీజ్ చేస్తున్నారు. రీసెంట్ గా ప్రేక్షకుల ముందుకొచ్చిన ట్రైలర్ కి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. కామెడీ అండ్ థ్రిల్లర్ జోనర్ లో ప్రసన్నవదనం మూవీ ఉండబోతోందని తెలుస్తోంది. ఫేస్ బ్లైండ్ ఉండే యువకుడు ఓ హత్యానేరంలో సాక్షిగా మారి హంతకులని ఎలా పట్టించాడు అనేది ఈ మూవీ కథాంశం అని ట్రైలర్ బట్టి తెలుస్తోంది. ఇలాంటి కథలకి ఈ మధ్యకాలంలో ఆదరణ పెరిగిన నేపథ్యంలో ప్రసన్నవదనం మూవీ కూడా క్లిక్ అవుతుందని భావిస్తున్నారు.

అర్జున్ వైకె ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. ఈ సినిమా మీద పాజిటివ్ వైబ్ ఉన్న నేపథ్యంలో హ్యాట్రిక్ హిట్ ని సుహాస్ తన ఖాతాలో వేసుకుంటాడనే మాట వినిపిస్తోంది. ఈ సినిమా నాన్ థీయాట్రికల్ రైట్స్ ఇప్పటికే అమ్ముడైపోయాయి. దీని ద్వారానే సినిమాకి టేబుల్ ప్రాఫిట్ వచ్చినట్లు తెలుస్తోంది. థీయాట్రికల్ బిజినెస్ పరంగా చూసుకుంటే 2.5 కోట్ల వేల్యూ ఉంటుందని భావిస్తున్నారు. అంటే దాదాపు 3 కోట్ల షేర్ రాబట్టాల్సి ఉంటుంది.

ఇదేమీ పెద్ద టార్గెట్ అయితే కాదు. ఏ మాత్రం పాజిటివ్ టాక్ సొంతం చేసుకున్న కూడా వీకెండ్ లోనే మూవీ బ్రేక్ ఈవెన్ టార్గెట్ అందుకుంటుంది. మే 3న సుహాస్ ప్రసన్నవదనంకి పోటీగా అల్లరి నరేష్ ఆ ఒక్కటి అడక్కు మూవీ రిలీజ్ అవుతోంది. హీరోల పరంగా తేడా ఉన్న రెండు కూడా కామెడీ టచ్ ఉన్న కథలే కావడంతో ప్రేక్షకులకి ఈ వారం కావాల్సినంత వినోదం దొరుకుతుందని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు.