Begin typing your search above and press return to search.

ప్రభాస్ కంటే ముందే ఆ హీరోయిన్ ట్విస్టు.. మళ్ళీ కొత్త గోల

ఇక ప్రభాస్ మరీ ఈ తరహాలో కన్ఫ్యూజన్ అయితే క్రియేట్ చేయడు అని మరికొందరు వారి అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

By:  Tupaki Desk   |   17 May 2024 8:30 AM GMT
ప్రభాస్ కంటే ముందే ఆ హీరోయిన్ ట్విస్టు.. మళ్ళీ కొత్త గోల
X

ప్రభాస్ ఏం ఆలోచించి పోస్ట్ చేశాడో గాని ఉదయం నుంచి సోషల్ మీడియాలో ఒకటే మోత. ప్రభాస్ కు పెళ్లి ఫిక్స్ అయ్యిందని త్వరలోనే తన జీవితంలోకి రాబోయే అమ్మాయిని పరిచయం చేయనున్నట్లు అనేక రకాల గాసిప్స్ అయితే వైరల్ గా మారుతున్నాయి. ఇక ప్రభాస్ మరీ ఈ తరహాలో కన్ఫ్యూజన్ అయితే క్రియేట్ చేయడు అని మరికొందరు వారి అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

కల్కి సినిమా హడావుడి క్రియేట్ చేయాల్సిన టైమ్ లో ఈ విధంగా ఎందుకు చేస్తాడనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. బహుశా కల్కి కి సంబంధించిన ఎదో ఒక అప్డేట్ అయ్యి ఉంటుందని మరికొందరు చెబుతున్నారు. ఇక ఈ తరుణంలో నిన్ననే ఒక హీరోయిన్ ప్రభాస్ పోస్ట్ కు మ్యాచ్ అయ్యేలా ఒక పోస్ట్ పెట్టడం మరింత చర్చకు దారి తీస్తోంది.

నేను ఒకరి డార్లింగ్ కాంబోతున్నాను.. అంటూ ఆమె సెల్ఫీ వీడియో పోస్ట్ చేసింది. దీంతో ఫ్యాన్స్ లో పెద్ద కన్ఫ్యూజన్ అయితే క్రియేట్ అయ్యింది.

డార్లింగ్స్.. ఫైనల్ గా మన జీవితంలోకి ఒక ప్రత్యేకమైన వ్యక్తి ప్రవేశించబోతున్నారు.. వెయిట్ చేయండి.. అంటూ ప్రభాస్ ఇన్స్టాగ్రామ్ స్టోరీలో రాసుకొచ్చాడు. అయితే ప్రభాస్ ఇలా చెప్పడాని కంటే ఒక రోజు ముందే గ్లామరస్ హీరోయిన్ కూడా ఒక పోస్ట్ పెట్టింది.

ఆమె మరెవరో కాదు పాయల్ రాజ్ పూత్. నేను కూడా ఒకరి డార్లింగ్ అవుతాను.. తప్పకుండా అంటూ ముందురోజే ఆమె సోషల్ మీడియాలో ఒక ట్వీట్ వేయడం మరో పెద్ద ట్విస్ట్. ప్రభాస్ కామెంట్ కు ఆమెకు అనుకోకుండా చేసిందా? లేదంటే దీని వెనుక ఏదైనా సర్ ప్రైజ్ కారణం ఏదైనా ఉందా అనేది తెలియాల్సి ఉంది.

పాయల్ రాజ్ పూత్ కు ఇదివరకే బాయ్ ఫ్రెండ్ ఉన్నట్లు అనేక రకాల కథనాలు వచ్చాయి. ఇక ఇప్పుడు సోషల్ మీడియాలో ఈ విషయంలో అనేక రకాల కామెంట్స్ వైరల్ గా మారుతున్నాయి. ఏది ఏమైనా ప్రభాస్ - పాయల్ సోషల్ మీడియా పోస్టులు చర్చనీయాంశంగా మారాయి. ఇక కల్కి లో ఆమె ఏదైనా సర్ ప్రైజ్ ఇస్తుందేమో చూడాలి. ప్రస్తుతం కల్కి ప్రమోషన్స్ కు మేకర్స్ రెడీ అవుతున్నారు. మొదట ఒక సాంగ్ విడుదల చేసే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. అలాగే ఒక స్పెషల్ టీజర్ కూడా ప్లాన్ చేస్తున్నారు. ఇక కల్కి సినిమాను జూన్ 27న రిలీజ్ కాబోతున్న విషయం తెలిసిందే.