Begin typing your search above and press return to search.

పవన్ 'తగ్గేదేలే' మేనరిజం.. ఎన్నికల్లో ఫస్ట్ టైమ్ అలా!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కొద్ది నెలల క్రితం సినిమాలకు తాత్కాలిక బ్రేక్ ఇచ్చి రాజకీయాల్లో బిజీ అయిన విషయం తెలిసిందే

By:  Tupaki Desk   |   2 May 2024 6:07 AM GMT
పవన్ తగ్గేదేలే మేనరిజం.. ఎన్నికల్లో ఫస్ట్ టైమ్ అలా!
X

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కొద్ది నెలల క్రితం సినిమాలకు తాత్కాలిక బ్రేక్ ఇచ్చి రాజకీయాల్లో బిజీ అయిన విషయం తెలిసిందే. ఎన్నికలకు మరో 10 రోజులే ఉండటంతో జోరుగా ప్రచారం నిర్వహిస్తున్నారు జనసేనాని. మండే ఎండలను అస్సలు లెక్క చేయకుండా వరుస సభలు, ర్యాలీల్లో పాల్గొంటున్నారు. తమ టీడీపీ- బీజేపీ-జనసేన కూటమి అభ్యర్థులను గెలిపించాలని వేడుకుంటున్నారు.

అయితే పవన్ కు మద్దతుగా పిఠాపురంలో పలువురు సెలబ్రిటీలు ప్రచారం చేస్తున్నారు. యంగ్ హీరోలు వరుణ్ తేజ్, వైష్ణవ్ తేజ్ రోడ్ షోల్లో పాల్గొంటున్నారు. నిహారిక కూడా ప్రచారం చేయనున్నట్లు తెలుస్తోంది. ఇక పవన్ కళ్యాణ్ కూడా పలు సందర్భాల్లో మహేష్ బాబు, ప్రభాస్, రామ్ చరణ్, ఎన్టీఆర్ తో పాటు మరికొందరు సెలబ్రిటీల పేర్లు ప్రస్తావించారు. ప్రభాస్, మహేష్ లను పెద్ద స్టార్స్ గా కొనియాడారు. చరణ్, తారక్ ను గ్లోబల్ ఐకాన్స్ అంటూ ప్రశంసించారు.

ఇప్పటివరకు మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పేరును ప్రస్తావించని పవన్.. తాజాగా బన్నీ డైలాగ్ తగ్గేదేలేను వాడారు. ఎన్నికల రోజు వైసీపీకి తగ్గేదేలే అంటూ ఆ ప్రభుత్వాన్ని కిందకు దించుతామని యువత చెప్పాలని అన్నారు. అప్పుడు గడ్డం మీద చేయి పెట్టి తగ్గేదేలే అనండని తెలిపారు. ఆ సమయంలో పవన్ తగ్గేదేలే మేనరిజం కూడా చేసి చూపించారు. అసలేం జరిగిందంటే?

మండపేటలో జరిగిన వారాహి విజయభేరి బహిరంగ సభలో అల్లు అర్జున్ ఫోటోలు, పుష్ప రాజ్ స్వాగ్ ప్లకార్డులు పట్టుకుని కొందరు యువకులు హంగామా చేశారు. ఆ విషయాన్ని అచ్యుతాపురం సభలో పవన్ కళ్యాణ్ ప్రస్తావించారు. యువత తగ్గేదే లేదంటే చాలా సంతోషమని పేర్కొన్న పవన్, అయితే ఆ విషయాన్ని తనకు చెప్పాల్సిన అవసరం లేదని అన్నారు. పోలింగ్ రోజు వైసీపీకి చెప్పాలంటూ వ్యాఖ్యలు చేశారు.

ప్రస్తుతం పవన్ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. అయితే సభలకు వస్తున్న యువత, ఓటు రూపంలో తనపై ఉన్న ప్రేమను చూపించాలనే ఉద్దేశ్యంతో అలా వ్యాఖ్యలు చేసినట్లు అర్ధమవుతోంది. ఇక ఈసారి అసెంబ్లీలో అడుగు పెట్టాలని చాలా ట్రై చేస్తున్నారు పవన్. పిఠాపురంలో భారీ మెజార్టీతో గెలవాలని పట్టుదలతో ఉన్నారు. మరేం జరుగుతుందో తెలియాలంటే జూన్ 4 వరకు వెయిట్ చేయాల్సిందే.