Begin typing your search above and press return to search.

ఊర మాస్ లుక్ లో నవదీప్.. ఎటు వైపో పరుగు?

తాజాగా లవ్ మౌళి మేకర్స్ మరో క్రేజీ అప్డేట్ ఇచ్చారు. నవదీప్ మోషన్ పోస్టర్ ను రిలీజ్ చేశారు. నవదీప్ మౌళిగా మారడమనేది చూడవలసిన అసాధారణ దృశ్యం అంటూ క్యాప్షన్ ఇచ్చి హైప్ క్రియేట్ చేశారు.

By:  Tupaki Desk   |   1 May 2024 9:38 AM GMT
ఊర మాస్ లుక్ లో నవదీప్.. ఎటు వైపో పరుగు?
X

టాలెంటెడ్ యాక్టర్ నవదీప్ కొంత బ్రేక్ తర్వాత హీరోగా, స‌రికొత్త‌గా, న‌వ‌దీప్ 2.0గా క‌నిపించ‌బోతున్న చిత్రం 'లవ్ మౌళి'. విభిన్న‌మైన జోనర్ లో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి దర్శకుడిగా అవ‌నీంద్ర వ్యవహరిస్తున్నారు. నైరా క్రియేషన్స్, సీ స్పేస్ గ్లోబల్ బ్యానర్లపై ప్రశాంత్ రెడ్డి నిర్మిస్తున్నారు. నవదీప్‌ కు జోడీగా పంఖురి గిద్వానీ నటిస్తోంది. రీసెంట్ గా రిలీజైన ట్రైలర్ చూస్తుంటే.. ఈ మూవీ ఒక పెయింటర్ ప్రేమకథగా తెలుస్తోంది.

అయితే ఈ సినిమా ఇప్పటికే రిలీజ్ కావాల్సి ఉన్నా.. కొన్ని కారణాల వల్ల వాయిదా పడింది. పోస్ట్ ప్రొడక్షన్ వల్ల ఈ మూవీ రిలీజ్ పోస్ట్ పోన్ అయిందని అంతా అనుకున్నారు. కానీ సెన్సార్ పూర్తవ్వకపోవడం వల్లే వాయిదా పడిందని టాక్ వినిపిస్తోంది. త్వరలోనే కొత్త రిలీజ్ డేట్ ను మేకర్స్ ప్రకటించనున్నారు. ఈ చిత్రం నుంచి ఇప్పటి వరకు వ‌చ్చిన ప్ర‌తి అప్డేట్ కూడా వినూత్నంగా ఉండి అంద‌రినీ ఆక‌ట్టుకుంటున్న సంగ‌తి తెలిసిందే.

తాజాగా లవ్ మౌళి మేకర్స్ మరో క్రేజీ అప్డేట్ ఇచ్చారు. నవదీప్ మోషన్ పోస్టర్ ను రిలీజ్ చేశారు. నవదీప్ మౌళిగా మారడమనేది చూడవలసిన అసాధారణ దృశ్యం అంటూ క్యాప్షన్ ఇచ్చి హైప్ క్రియేట్ చేశారు. మాస్ అవతార్ త్వరలో థియేటర్లలో మిమ్మల్ని అలరిస్తుందని తెలిపారు. మోషన్ పోస్టర్ పై ఊర మాస్ మౌళి అంటూ రైటప్ ఇచ్చారు. ఇక నవదీప్.. సిక్స్ ప్యాక్ బాడీతో షర్ట్ లేకుండా కోపంతో పరిగెత్తుతున్నట్లు చూపించారు మేకర్స్.

జులపాల జుట్టు, ఎక్కువ గెడ్డంతో రగ్డ్ లుక్ లో వేరే లెవెల్ లో ఉన్నారు నవదీప్. మొత్తానికి ఈ పోస్టర్ తో మూవీపై మంచి బజ్ క్రియేట్ చేశారు మేకర్స్. ఈ సినిమా కోసం నవదీప్ చాలా హార్డ్ వర్కౌట్ చేసినట్లు కనిపిస్తోంది. అదిరిపోయే ఫిజిక్ తో సినిమాలో ఆయన అలరించనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ మోషన్ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. నవదీప్ లుక్ అదిరిపోయిందని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.

ఇక నవదీప్ ఈ సినిమాతో తన సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేస్తున్నట్టు ప్రమోట్ చేస్తున్నారు. తన జీవితంలో జరిగిన ప్రేమ కథల ఫలితమే లవ్ మౌళి సినిమా అంటూ చెప్పుకొస్తున్నారు. తాను పాన్ ఇండియా లెవెల్ లో ప్రేమించేవాడినని, లవ్ అనే టాపిక్‌లో చాలా వెరియేష‌న్స్ ఉన్నాయని అంటున్నారు. అయితే ఈ సినిమాతో నవదీప్ కొత్త ట్రెండ్ సృష్టిస్తారని అంతా జోస్యం చెబుతున్నారు. మరి ఈ మూవీ ఎలా ఉంటుందో చూడాలి.