Begin typing your search above and press return to search.

కల్కి ప్రమోషన్స్.. మళ్ళీ అదే రూట్లో..

సైన్స్ ఫిక్షన్ డిస్టోపియన్ జోనర్ లో రూపొందుతున్న ఈ సినిమా నుంచి ఇప్పటికే రిలీజ్ అయిన పోస్టర్లు భారీ హైప్ క్రియేట్ చేశాయి.

By:  Tupaki Desk   |   17 May 2024 7:55 AM GMT
కల్కి ప్రమోషన్స్.. మళ్ళీ అదే రూట్లో..
X

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, యంగ్ టాలెంటెడ్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ కాంబోలో తెరకెక్కుతున్న కల్కి 2898 ఏడీ మూవీపై ఎలాంటి అంచనాలు ఉన్నాయో అందరికీ తెలిసిందే. హాలీవుడ్ రేంజ్ లో నాగ్ అశ్విన్.. కల్కి ప్రపంచాన్ని క్రియేట్ చేశారని తెలుస్తోంది. సైన్స్ ఫిక్షన్ డిస్టోపియన్ జోనర్ లో రూపొందుతున్న ఈ సినిమా నుంచి ఇప్పటికే రిలీజ్ అయిన పోస్టర్లు భారీ హైప్ క్రియేట్ చేశాయి.

మరో 40 రోజుల్లో విడుదల కానున్న కల్కి సినిమా నుంచి రీసెంట్ గా అమితాబ్, ప్రభాస్ గ్లింప్స్ రిలీజ్ చేసిన మేకర్స్.. ఇప్పుడు పూర్తిస్థాయిలో ప్రమోషన్స్ స్టార్ట్ చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఓవైపు పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తి చేస్తూనే.. మరోవైపు ప్రమోషన్స్ కోసం పక్కా ప్రణాళిక రచిస్తున్నారు నాగ్ అశ్విన్. అందులో భాగంగా ఓ యానిమేటెడ్ వీడియోను రిలీజ్ చేయనున్నారు. త్వరలోనే ఓటీటీ ద్వారా ఆ వీడియో విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది.

ఆ వీడియోలోని ఆయా పాత్రలకు గాను ప్రభాస్ సహా కీలక పాత్రధారులే డబ్బింగ్ చెబుతున్నట్లు సమాచారం. దీంతో పాటు కల్కి మేకర్స్.. గ్రాండ్ ప్రమోషనల్ టూర్ ను ప్లాన్ చేస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలతో సహా దేశమంతా టీమ్ తిరిగి సినిమాను ప్రమోట్ చేయనుంది. ఎస్ ఎస్ రాజమౌళి తెరకెక్కించిన బాహుబలి సిరీస్ టైమ్ లో ఆ సినిమా మేకర్స్ అలాగే చేశారు. ఇప్పుడు కల్కి మేకర్స్ కూడా అదే ప్లాన్ ను ఫాలో అవుతున్నారు.

అందులో భాగంగా తొలుత హైదరాబాద్ లో ఫస్ట్ ప్రమోషనల్ ఈవెంట్ నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. రామోజీ ఫిల్మ్ సిటీలో రెండు భారీ సెట్స్ ను మేకర్స్ నిర్మిస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఆ వర్క్స్ చివరి దశకు చేరుకున్నాయి. ఈ వేడుకలో ప్రభాస్, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపికా పదుకొణె, దిశా పటానీ సహా క్యాస్టింగ్ అంతా పాల్గొనున్నారని తెలుస్తోంది. కాబట్టి ఫస్ట్ వేడుకతో సినీ ప్రియుల్లో భారీ బజ్ క్రియేట్ చేసేలా ప్లాన్ చేస్తున్నారు మేకర్స్.

అత్యంత భారీ బడ్జెట్ తో నిర్మితమవుతున్న కల్కి సినిమా ఓపెనింగ్స్ రికార్డు లెవల్ లో ఉండాలంటే దేశవ్యాప్తంగా ప్రమోషన్లు చాలా అవసరం. అందుకే మేకర్స్ కూడా పక్కా ప్రణాళికతో ముందుకెళ్లనున్నట్లు తెలుస్తోంది. ప్రముఖ నిర్మాణ సంస్థ వైజయంతీ మూవీస్ బ్యానర్ పై అశ్వనీదత్ రూ.600 కోట్లకు పైగా వ్యయంతో రూపొందిస్తున్నారు. జూన్ 27వ తేదీన గ్రాండ్ గా విడుదల కానున్న ఈ సినిమా.. బాక్సాఫీస్ వద్ద ఎలాంటి రికార్డులు సృష్టిస్తుందో వేచి చూడాలి.