Begin typing your search above and press return to search.

గుండెల్లో గుచ్చుకునేలా ఆ నవ్వెంటి మీనాక్షి..

ఇటీవల కాలంలో బాగా పాపులర్ అయిన బ్యూటీలలో మీనాక్షి చౌదరి టాప్ లిస్టులో ఉంటుంది అని చెప్పవచ్చు.

By:  Tupaki Desk   |   30 April 2024 5:30 PM GMT
గుండెల్లో గుచ్చుకునేలా ఆ నవ్వెంటి మీనాక్షి..
X

ఇటీవల కాలంలో బాగా పాపులర్ అయిన బ్యూటీలలో మీనాక్షి చౌదరి టాప్ లిస్టులో ఉంటుంది అని చెప్పవచ్చు. ఈ బ్యూటీ ఎలాంటి డ్రెస్ లో కనిపించినా కూడా కుర్రాళ్ళ మనసును ఇట్టే దోచేస్తూ ఉంటుంది. సినిమాల కంటే ఆమె సోషల్ మీడియాలోనే తన గ్లామరస్ ఫోటోలతో ఎక్కువగా తన ఫ్యాన్ ఫాలోవర్స్ ను పెంచుకుందని చెప్పవచ్చు. మిస్ ఇండియా హర్యానా లో కూడా అమ్మడు కిరీటం అందుకున్న విషయం తెలిసిందే.


మోడల్ గా మంచి గుర్తింపును అందుకున్న తర్వాత సినిమా ఇండస్ట్రీలో చాలా తొందరగానే అడుగుపెట్టింది. 2019లో హిందీలో అప్ స్టార్ట్స్ అనే సినిమా ద్వారా వెండితెరకు పరిచయమైంది. ఇక ఆ తర్వాత టాలీవుడ్ వైపు యు టర్న్ తీసుకున్న ఈ బ్యూటీ సక్సెస్ ఫెయిల్యూర్ తో సంబంధం లేకుండా అవకాశాలను సొంతం చేసుకుంది. తెలుగులో ఆమె చేసిన మొదటి సినిమా ఇచ్చట వాహనములు నిలుపరాదు.


ఆ తర్వాత రవితేజ ఖిలాడి సినిమాలో కూడా నటించింది. ఇక హిట్ 2, గుంటూరు కారం సినిమాలలో కూడా మెరిసిన మీనాక్షి ఓ వర్గం ప్రేక్షకులను ఎంతగానో ఎట్రాక్ట్ చేసింది. ఇక సోషల్ మీడియాలో అప్పుడప్పుడు పోస్ట్ చేస్తున్న ఫోటోలు చూస్తే ఎవరైనా సరే షాక్ అవ్వాల్సిందే. అమ్మడు తన నవ్వుతోనే కుర్రాళ్ళ గుండెలను మాయ చేస్తోంది అని చెప్పవచ్చు.


రీసెంట్ గా ఆమె పోస్ట్ చేసిన ఫోటోలలో పెద్దగా గ్లామర్ హైలెట్ కాకపోయినప్పటికి కూడా తన నవ్వుతూనే మైమరిపించింది. దీంతో ఫాలోవర్స్ చాలా పాజిటివ్ గా రియాక్ట్ అవుతూ ఉన్నారు. నీ నవ్వుతూనే గుండెల్లో గుచ్చేస్తున్నావు అంటూ మరికొందరు కామెంట్ చేస్తున్నారు. ఇక ఈ బ్యూటీ సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం చాలా బిజీగా కనిపిస్తోంది.

మట్కా సినిమాతో పాటు లక్కీ భాస్కర్ సినిమా కూడా లిస్టులో ఉంది. ఇక విజయ్ GOAT సినిమాలో కూడా ఒక స్పెషల్ పాత్రలో కనిపించబోతోంది. టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి విశ్వంభర సినిమాలో కూడా ఒక క్యారెక్టర్ చేయబోతున్నట్లు రీసెంట్ గా వివరణ ఇచ్చింది. మొత్తానికి అమ్మడు ఇండస్ట్రీలో అయితే చాలా బిజీగా కనిపిస్తోంది. ఇక రాబోయే సినిమాలలో ఏ ఒక్కటి సక్సెస్ అయినా కూడా ఆమె రేంజ్ అమాంతంగా పెరిగిపోతుంది అని చెప్పవచ్చు. మరి ఈ బ్యూటీ లక్కు ఎలా ఉందో తెలియాలి అంటే మరి కొంత కాలం ఆగాల్సిందే.