Begin typing your search above and press return to search.

కల్కి 2898AD.. హీరోయిన్ సడన్ ట్విస్ట్!

రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న పాన్ వరల్డ్ మూవీ కల్కి 2898ఏడీ

By:  Tupaki Desk   |   2 May 2024 4:32 AM GMT
కల్కి 2898AD.. హీరోయిన్ సడన్ ట్విస్ట్!
X

రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న పాన్ వరల్డ్ మూవీ కల్కి 2898ఏడీ. ఈ మూవీస్ షూటింగ్ కంప్లీట్ చేసుకుని ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది. జూన్ 27న ప్రపంచ వ్యాప్తంగా 22 భాషలలో ఈ చిత్రాన్ని రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. 600 కోట్ల బడ్జెట్ తో అశ్వినీ దత్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో ప్రభాస్ కి జోడిగా బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొనే నటించింది.

ఇండియన్ ఫస్ట్ ఫ్యూచర్స్టిక్ కాన్సెప్ట్ మూవీగా కల్కి 2898ఏడీ సినిమా రాబోతోంది. దీనిపై దేశ వ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. ఇదిలా ఉంటే జూన్ నెల ఆరంభం నుంచి ఈ మూవీ ప్రమోషన్స్ స్టార్ట్ చేయాలని చిత్ర యూనిట్ భావిస్తోంది. అయితే హీరోయిన్ దీపికా పదుకొనే జూన్ నెల నుంచి అందుబాటులో ఉండే అవకాశం లేదని తెలుస్తోంది. ఆమె ప్రస్తుతం గర్భవతిగా ఉంది. ప్రెగ్నెన్సీ తోనే ఆమె సింగం అగైన్ సినిమా షూటింగ్ లో పాల్గొంటుంది. ఈ చిత్రీకరణ త్వరలో కంప్లీట్ కానుందంట.

అయితే డాక్టర్ల సూచన మేరకు జూన్ నుంచి ఆమె పూర్తిగా విశ్రాంతి తీసుకోనుందంట. అయితే కల్కి సినిమా ప్రమోషన్స్ జూన్ నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో దీపికా పదుకొనే స్వప్న దత్, ప్రియాంక దత్ కి ఫోన్ చేసి తనకు సంబంధించిన ప్రమోషనల్ ఇంటర్వ్యూలు ఈ నెలలోనే ప్లాన్ చేసుకోవాలని సూచించిందంట. జూన్ నెలలో అంటే కష్టం అవుతుందని చెప్పిందంట. ఇక దీపికా కండిషన్ ని అర్ధం చేసుకొని ఈ నెలలోనే ఆమెకి సంబందించిన ప్రమోషనల్ ఇంటర్వ్యూలు చిత్ర యూనిట్ త్వరగా ఫినిష్ చేయాలని ఫిక్స్ అయ్యారు.

అయితే ప్రమోషనల్ ఇంటర్వ్యూలు ముందుగా తీసేసుకున్న వాటిని ఈ నెల ఆఖరులోనే రిలీజ్ చేసేలా నాగ్ అశ్విన్ టీమ్ ప్లాన్ చేస్తుందని తెలుస్తోంది. ఒక వేళ దీపికా పదుకునే కంప్లీట్ బెడ్ రెస్ట్ తీసుకుంటే కల్కి రిలీజ్ కి ముందు జరిగే ప్రీరిలీజ్ ఈవెంట్ లో కూడా పాల్గొనే అవకాశం ఉండకపోవచ్చని మాట వినిపిస్తోంది. కల్కి సినిమాని భారీ బడ్జెట్ తో నిర్మించిన నేపథ్యంలో కచ్చితంగా హిందీ మార్కెట్ లో సాలిడ్ రిపోర్ట్ సొంతం చేసుకోవాల్సి ఉంటుంది.

అలాగే ఓవర్సీస్ లో కూడా ఈ మూవీ స్ట్రాంగ్ ఇంపాక్ట్ క్రియేట్ చేయాలి. దీపికా పదుకునే ఇప్పటికే హాలీవుడ్ లో సినిమాలు చేసింది. ఈ నేపథ్యంలో ఆమె ప్రమోషన్స్ ఓవర్సీస్ మార్కెట్ లో కొంత ఉపయోగపడతాయని చిత్ర యూనిట్ భావిస్తోంది. ఆ దిశగానే ప్రమోషనల్ ఇంటర్వ్యూలు వరల్డ్ వైడ్ గా రీచ్ అయ్యేలా ప్లాన్ చేస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది.