Begin typing your search above and press return to search.

ఆ బాలీవుడ్ స్టార్ సౌత్ ఎంట్రీకి రెడీనా..?

రీసెంట్ గా క్రూతో ప్రేక్షకుల ముందుకు వచ్చి మరోసారి తన సత్తా చాటింది కరీనా.

By:  Tupaki Desk   |   1 May 2024 3:30 AM GMT
ఆ బాలీవుడ్ స్టార్ సౌత్ ఎంట్రీకి రెడీనా..?
X

బాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ లో ఇప్పటికీ తన పేరు ఉండేలా చేసుకున్న భామ కరీనా కపూర్. రెండు దశాబ్దాల పైన కెరీర్ కొనసాగించిన కరీనా కపూర్ సైఫ్ అలీ ఖాన్ తో పెళ్లి తర్వాత కొన్నాళ్లు గ్యాప్ తీసుకున్నా మళ్లీ వరుస సినిమాలు చేస్తూ అలరిస్తుంది. అయితే హీరోయిన్ గా కమర్షియల్ సినిమాల్లో నటించడం మానేసి డిఫరెంట్ సినిమాలు.. వెరైటీ రోల్స్ చేస్తూ వస్తుంది కరీనా కపూర్ ఖాన్. రీసెంట్ గా క్రూతో ప్రేక్షకుల ముందుకు వచ్చి మరోసారి తన సత్తా చాటింది కరీనా.


ప్రస్తుతం పాన్ ఇండియా సినిమాలతో ఇండియన్ బాక్సాఫీస్ కళకళలాడుతుంది. హిందీ బాక్సాఫీస్ దగ్గర సౌత్ సినిమాల సందడి ఎక్కువైంది. అందుకే ఒకప్పుడు తెలుగు సినిమాల్లో నటించే ఆఫర్ వస్తే చిన్నచూపు చూసిన వాళ్లే ఇప్పుడు ఇక్కడ ఒక ఛాన్స్ వస్తే చేయాలని అనుకుంటున్నారు. ఈ క్రమంలో కరీనా కపూర్ ఖాన్ కూడా అలాంటి అవకాశం కోసం ఎదురుచూస్తుందని తెలుస్తుంది.

క్రూ హిట్ తో ఆమె బాలీవుడ్ సినిమాలపై సౌత్ సినిమాల ప్రభావం గురించి ప్రస్తావించగా మంచి కథలు ఎప్పుడైనా ఎక్కడైనా ప్రేక్షకులను అలరిస్తాయని అన్నారు. అంతేకాదు ఛాన్స్ వస్తే సౌత్ సినిమాల్లో నటించడానికి రెడీ అనేస్తుంది అమ్మడు. కరీనా ఓకే అనాలే కానీ ఆమె కోసం మన దర్శక నిర్మాతలు మంచి కథలు సిద్ధం చేసే ఛాన్స్ ఉంటుంది. ఇప్పటికే బాలీవుడ్ భామలు అలియా భట్, దీపికా, జాన్వి, దిశా పటాని, కియరా వీళ్లంతా తెలుగు సినిమాల్లో నటిస్తున్నారు.

సీనియర్ హీరోయిన్స్ లో కరీనా కూడా తెలుగులో నటిస్తే ఆమె కెరీర్ మళ్లీ ఊపందుకునే ఛాన్స్ ఉంటుంది. కరీనాకు స్ట్రైట్ తెలుగు ఫ్యాన్స్ లేకపోయినా ఆమె చేసిన హిందీ సినిమాలు చూసి అభిమానించిన వారు ఉండే ఉంటారు. సో అలాంటి వారు కరీనా స్ట్రైట్ తెలుగు సినిమాలు చేస్తే తప్పకుండా పండుగ చేసుకుంటారు. కరీనా కపూర్ తెలుగు సినిమా చేస్తే చూడాలని సౌత్ ఆడియన్స్ కూడా ఎదురుచూస్తున్నారు. ఒకప్పుడు అంటే వేరు కానీ ఇప్పుడు తెలుగు సినిమాల స్థాయి పెరిగింది. ఫలానా పాత్రకు ఫలానా స్టార్ హీరోయిన్ అయితే బాగుంటుంది అని అనిపిస్తే చాలు ఆమెను తీసుకొచ్చేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. మరి కరీనా కపూర్ ఖాన్ తెలుగులో ఎలాంటి సినిమాతో వస్తుంది అన్నది చూడాలి.