Begin typing your search above and press return to search.

100 కోట్లు పెద్ద మ్యాటర్ కావట్లేదు..!

చిన్న సినిమాల్లో ఒకటి రెండు తప్ప మిగతావన్నీ ఎప్పుడు వచ్చాయి ఎప్పుడు వెళ్లాయి అనేలా పరిస్థితి ఉండేది.

By:  Tupaki Desk   |   30 April 2024 3:30 AM GMT
100 కోట్లు పెద్ద మ్యాటర్ కావట్లేదు..!
X

ఇదివరకు తో పోల్చితే తెలుగు సినిమా కొంతలో కొంత బెటర్ అని చెప్పొచ్చు. ఒకప్పుడు ఏడాదికి వందల కొద్దీ సినిమాలు రిలీజ్ అవుతుంటే వాటిలో బ్లాక్ బస్టర్ సినిమాలు, సూపర్ హిట్ లు, హిట్లు అంటూ ఇలా వేళ్ల మీద లెక్కేసుకునేలా ఉండేవి. చిన్న సినిమాల్లో ఒకటి రెండు తప్ప మిగతావన్నీ ఎప్పుడు వచ్చాయి ఎప్పుడు వెళ్లాయి అనేలా పరిస్థితి ఉండేది. అయితే ఇప్పుడు పరిస్థితి మారింది. యువ హీరోలు, చిన్న సినిమాలు కూడా ఆడియన్స్ అంచనాలను రీచ్ అవుతూ హిట్లు, సూపర్ హిట్లు, బంపర్ హిట్లు కొడుతున్నారు.

ఒకప్పుడు స్టార్ హీరోలకు మాత్రమే సాధ్యమయ్యే 100 కోట్లు ఇప్పుడు యువ హీరోలు కూడా కొట్టేస్తున్నారు. అఫ్కోర్స్ మన స్టార్స్ అంతా కూడా ఇప్పుడు పాన్ ఇండియా సినిమాలతో 500, 1000 కోట్ల టార్గెట్ ని ఫిక్స్ చేసుకున్నారనుకోండి. అయితే యువ హీరోల సినిమాలు మాత్రం మంచి సక్సెస్ ఫాం కొనసాగిస్తున్నారు. ఈ ఇయర్ లో లిమిటెడ్ బడ్జెట్ తో వచ్చి 100 కోట్లు చెప్పి మరీ కొట్టాడు స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ.

రెండేళ్ల క్రితం వచ్చిన డీజే టిల్లు సినిమాకు సీక్వెల్ గా వచ్చిన టిల్లు స్క్వేర్ ఆడియన్స్ ను ఎంటర్టైన్ చేయడంలో సక్సెస్ అయ్యింది. ఫలితంగా సిద్ధుకు 100 కోట్లు కానుకగా ఇచ్చేశారు ఆడియన్స్. యువ హీరోల్లో ఇప్పటివరకు విజయ్ దేవరకొండ గీతా గోవిందం, తేజా సజ్జా హనుమాన్, విరూపాక్షతో సాయి దుర్గ తేజ్, తొలి సినిమా ఉప్పెనతో వైష్ణవ్ తేజ్ 100 కోట్లు కలెక్ట్ చేశారు.

ఈ లిస్ట్ లో మాస్ రాజా రవితేజ ధమాకా కూడా ఉంది. అయితే ఆయన యువ హీరోలతో జత కట్టలేం కాబట్టి వదిలేద్దాం. సో యువ హీరోల సినిమాలు కూడా సరైన కథ కథనాలతో వస్తే 100 కోట్లు పెద్ద మ్యాటర్ ఏమి కాదని ప్రూవ్ చేశారు. సినిమా మొదలు పెట్టిన దగ్గర నుంచి రిలీజ్ అయ్యే వరకు ఆడియన్స్ లో బజ్ పెంచడమే కాకుండా థియేటర్ కు వచ్చిన ప్రేక్షకుడిని మెప్పించేలా సినిమాలు చేస్తున్నారు.

అందుకే యువ హీరోల సినిమాల వసూళ్లతో కూడా బాక్సాఫీస్ కళకళలాడుతుంది. ఇందులోనే కొందరు ప్రయోగాలు చేస్తుంటే కొందరు రెగ్యులర్ కంటెంట్ తోనే ఎంటర్టైనింగ్ గా వస్తున్నారు. జోనర్ ఏదైనా సరే టార్గెట్ మాత్రం ప్రేక్షకుల హృదయాలను గెలవడమే అని పెట్టుకున్నారు. అందుకే యువ హీరోల సక్సెస్ రేటు బాగుంటుంది. ఇదే ఫాం కొనసాగిస్తే వారిని చూసి మరికొందరు ఆ సక్సెస్ బాటలో నడిచే ఛాన్స్ ఉంటుందని చెప్పొచ్చు.