Begin typing your search above and press return to search.

క్రిష్‌ 4... ఆయన ఎందుకు స్పందించాడు?

కరోనా ముందు నుంచే క్రిష్ 4 కి సంబంధించిన ప్రచారం మొదలు అయ్యింది. కానీ ఇప్పటి వరకు కూడా ఫైనల్‌ అవ్వలేదు

By:  Tupaki Desk   |   2 May 2024 9:30 AM GMT
క్రిష్‌ 4... ఆయన ఎందుకు స్పందించాడు?
X

ఇండియన్‌ సినిమా ఒక మూస పద్దతిలో వెళ్తున్న సమయంలో హాలీవుడ్‌ సినిమాలకు మన ఇండియన్ సినిమాలు తక్కువేం కాదు అంటూ నిరూపించిన సినిమా 'క్రిష్‌'. ఎన్నో సూపర్‌ మేన్‌ సినిమాలకు ఆజ్యం పోసిన క్రిష్ సినిమా ప్రాంచైజీ లో క్రిష్ 4 రాబోతుంది అంటూ చాలా ఏళ్లుగా వార్తలు వస్తున్నాయి.

కరోనా ముందు నుంచే క్రిష్ 4 కి సంబంధించిన ప్రచారం మొదలు అయ్యింది. కానీ ఇప్పటి వరకు కూడా ఫైనల్‌ అవ్వలేదు. దర్శకుడు రాకేష్ రోషన్ కి క్రిష్ 4 పై ఆసక్తి ఉన్నప్పటికీ కథ విషయంలో ఆయన సంతృప్తి చెందడం లేదు. హృతిక్ రోషన్‌ కి ఈసారి హాలీవుడ్‌ రేంజ్ గుర్తింపు తీసుకు రావాలనే ఉద్దేశ్యంతో క్రిష్ 4 కథ కోసం అన్వేషణ జరుగుతోంది.

గత కొన్ని సంవత్సరాలుగా క్రిష్ 4 సినిమాకు సంబంధించిన ఎలాంటి అప్‌డేట్‌ కానీ, కనీసం చిన్న ప్రకటన కానీ లేకపోవడంతో మళ్లీ వెండి తెరపై క్రిష్ ను చూడమేమో అని ఫ్యాన్స్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎట్టకేలకు క్రిష్ 4 కి సంబంధించిన అప్డేట్‌ ను ప్రముఖ దర్శకుడు సిద్దార్థ్‌ ఆనంద్‌ ఇవ్వడం అందరికి షాకింగ్‌ గా ఉంది.

ఇటీవల ట్విట్టర్ లో సిద్దార్థ్‌ ఆనంద్‌ ఒకానొక సమయంలో క్రిష్‌ 4 సినిమా ఉంటుంది అని కన్ఫర్మ్‌ చేశాడు. మళ్లీ అందరి కోసం క్రిష్ రాబోతున్నాడు అంటూ సిద్దార్థ్‌ ఆనంద్‌ ఫ్యాన్స్ కి మరియు సినీ ప్రేమికులకు ఆనందాన్ని కలిగించే ప్రకటన చేశాడు.

హృతిక్‌ రోషన్ తో కలిసి ఫైటర్‌ ను చేసిన సిద్దార్థ్ ఆనంద్‌ సూపర్‌ హిట్‌ ను దక్కించుకున్నాడు. అలాంటి సిద్దార్థ్ ఆనంద్‌ ఇప్పుడు ఎందుకు క్రిష్ 4 గురించి స్పందించాడు, అసలు ఆయనకు క్రిష్ 4 కి సంబంధం ఏంటి అనేది ప్రస్తుతం బాలీవుడ్ వర్గాల్లో మరియు హిందీ మీడియా సర్కిల్స్ లో జరుగుతున్న చర్చ.