Begin typing your search above and press return to search.

విశ్వంభ‌ర‌లో హిట్ల‌ర్ సెంటిమెంట్!

ఇందులో బ‌ల‌మైన సిస్ట‌ర్ సెంట్ మెంట్ వ‌ర్కౌట్ చేస్తున్నారుట‌. అదీ ఒక‌రిద్ద‌రు కాదు. ఏకంగా ఐదుగురు అక్కా చెల్లెళ్ల‌తో ఆ సెంటిమెంట్ హైలైట్ కాబోతుంద‌ని స‌మాచారం.

By:  Tupaki Desk   |   17 May 2024 7:27 AM GMT
విశ్వంభ‌ర‌లో హిట్ల‌ర్ సెంటిమెంట్!
X

'విశ్వంభ‌ర‌'లో మెగాసెంట్ మెంట్ వ‌ర్కౌట్ చేస్తున్నారా? అన్న‌య్య మాస్ ఇమేజ్ ని మ‌రోసారి సెంటిమెంట్ గా హైలైట్ చేస్తున్నారా? అంటే అవుననే వినిపిస్తుంది. చిరంజీవి క‌థానాయ‌కుడిగా వ‌శిష్ట ద‌ర్శ‌క‌త్వంలో 'విశ్వంభ‌ర' భారీ అంచ‌నాల మ‌ధ్య తెర‌కెక్కుతోన్న సంగ‌తి తెలిసిందే. చాలా కాలం త‌ర్వాత చిరంజీవి న‌టిస్తోన్న సోషియో ఫాంట‌సీ చిత్ర‌మిది. ఇప్ప‌టికే షూటింగ్ కూడా ముగింపు ద‌శ‌కు చేరుకుంటుంది. జూన్ క‌ల్లా షూటింగ్ పూర్త‌వుతుంద‌ని చిత్ర వ‌ర్గాలు అంచ‌నా వేస్తున్నాయి. ఈ నేప‌థ్యంలో సినిమాకి సంబంధించి ఇంట్రెస్టింగ్ అప్ డేట్ అందుతోంది.

ఇందులో బ‌ల‌మైన సిస్ట‌ర్ సెంట్ మెంట్ వ‌ర్కౌట్ చేస్తున్నారుట‌. అదీ ఒక‌రిద్ద‌రు కాదు. ఏకంగా ఐదుగురు అక్కా చెల్లెళ్ల‌తో ఆ సెంటిమెంట్ హైలైట్ కాబోతుంద‌ని స‌మాచారం. ఇప్ప‌టికే చెల్లెళ్లు పాత్ర‌ల‌కు సంబంధించి కొంత మంది యువ నాయిక‌ల్ని తీసుకున్నారుట‌. అలాగే సినిమాలో ఖుష్బూ కూడా న‌టిస్తుందిట‌. ఆమె చిరంజీవి అక్క పాత్ర పోషిస్తున్న‌ట్లు స‌మాచారం. ఐదుగురు అక్కా చెల్లెళ్లు అన‌గానే అంద‌రికీ 'హిట్ల‌ర్' సినిమా గుర్తొస్తుంది.

అందులో అక్క పాత్ర‌లు లేవు గానీ....చిరంజీవికి అంతా చెల్లెళ్లే. సిస్ట‌ర్ సెంటిమెట్ తో ముత్యాల సుబ్బ‌య్య తెర‌కెక్కించిన ఆ సినిమా అప్ప‌ట్లో ఎంత పెద్ద విజ‌యం సాధించిందో తెలిసిందే. సిస్ట‌ర్ సెంటిమెంట్ బ‌లంగా ప‌డ‌టంతోనే ఆ రేంజ్ స‌క్సెస్ వ‌చ్చింది. అంత‌కు ముందు 'అల్లుడా మ‌జాకా'లో కూడా సిస్ట‌ర్ సెంటిమెంట్ వ‌ర్కౌట్ అయింది. ఆ సినిమా చిరు కెరీర్ లోనే బ్లాక్ బ‌స్ట‌ర్ గా నిలిచింది. అలాగే 'అన్న‌య్య' సినిమాలో కూడా అన్న‌ద‌మ్ముల మ‌ధ్య అనుబంధాన్నే బేస్ చేసుకుని తీసారు.

ఆ సినిమా కూడా సూప‌ర్ హిట్ అయింది. మ‌ళ్లీ 'విశ్వంభ‌ర'లో ఓ పార్ట్ గా సిస్ట‌ర్ సెంటిమెంట్ ని మేళ‌వించిన‌ట్లు తెలుస్తోంది. సిస్ట‌ర్ సెంటిమెంట్ లో ఏహీరో న‌టించినా అది హిట్టే. అందులోనూ మెగా ఇమేజ్ ఉన్న హీరో న‌టిస్తే ఆ హిట్ గురించి చెప్పాల్సిన ప‌నిలేదు. స‌రిగ్గా ఇదే అంశాన్ని వ‌శిష్ట 'విశ్వంభ‌ర‌'తో మ‌రోసారి స‌క్సెస్ కి ద‌గ్గ‌ర్లో క‌నిపిస్తున్నాడు. సోషియా ఫాంట‌సీ సినిమా కావ‌డంతో గ్రాఫిక్స్ వ‌ర్క్ ఎక్కువ‌గా ఉంటుంది. షూటింగ్ ముగింపు ద‌శ‌లో ఉన్నా నెల‌ల స‌మ‌యం సీజీకే ప‌డుతుంది. అందుకే చిత్రాన్ని సంక్రాంతికి రిలీజ్ చేస్తున్నారు.