Begin typing your search above and press return to search.

ఫోటో స్టోరి: బికినీ బీచ్‌లో మ‌ళ్లీ చెల‌రేగిన వైర‌స్

ఈ బ్యూటీ చివరిసారిగా సిద్ధార్థ్ మల్హోత్రా నటించిన 'యోధా' లో కనిపించింది. ఇందులో తన అద్భుత‌ నటనతో ప్రేక్షకులను ఆశ్చర్యపరిచింది.

By:  Tupaki Desk   |   15 May 2024 5:10 PM GMT
ఫోటో స్టోరి: బికినీ బీచ్‌లో మ‌ళ్లీ చెల‌రేగిన వైర‌స్
X

యూత్‌లో తనకంటూ ఓ ప్ర‌త్యేక‌ స్థానం సంపాదించుకున్న నటి దిశా పటాని. దిశా అంద‌మైన చిరున‌వ్వు.. వేడెక్కించే దేహ‌శిరులు.. న‌ట ప్ర‌తిభ ఇలా అన్ని కోణాల్లోను దిశా నిజంగా హృదయాన్ని కదిలించే ప్ర‌తిభావ‌ని. ఈ బ్యూటీ చివరిసారిగా సిద్ధార్థ్ మల్హోత్రా నటించిన `యోధా` లో కనిపించింది. ఇందులో తన అద్భుత‌ నటనతో ప్రేక్షకులను ఆశ్చర్యపరిచింది.

యోధాకు సాగర్ అంబ్రే - పుష్కర్ ఓజా దర్శకత్వం వహించారు. విమానం హైజాకింగ్ ఆధారంగా రూపొందిన ఈ చిత్రంలో సిద్ధార్థ్ మల్హోత్రా ఆర్మీ ఆఫీసర్‌గా నటించారు. యాక్ష‌న్ ఎంట‌ర్ టైన‌ర్ లో అత‌డి మెస్మ‌రైజింగ్ న‌ట‌న క‌ట్టి ప‌డేసింది. ఈ చిత్రంలో సిద్ధార్థ్ మల్హోత్రాకు ప్రియురాలిగా దిశా ప‌టానీ న‌టించింది. ఇదే చిత్రంలో రాశి ఖన్నా మ‌రో క‌థానాయిక‌గా న‌టించింది.

దిశా పటాని న‌ట‌న‌తోనే కాదు.. కిల్ చేసే అందమైన ఫోటోషూట్ల‌తోను మురిపిస్తోంది. దిశాకు ప్రస్తుతం 61 మిలియన్ల ఇన్‌స్టాగ్రామ్ ఫాలోవర్లు ఉన్నారు. త‌న నుంచి ఒక చిన్న క్లిప్ షేర్ అయినా..ల‌క్ష‌లాది అభిమానుల్లో వైర‌ల్ గా మారుతుంటుంది. తాజాగా దిశా పటానీ బీచ్ వెకేష‌న్ నుంచి అద్భుత‌మైన ఫోటోలు వీడియోలు వైర‌ల్ అవుతున్నాయి. బీచ్ ఇసుక‌లో ఎండ‌లో దిశా సెల‌బ్రేష‌న్ మైమ‌రిపిస్తోంది. త‌న స్నేహితురాళ్ల‌తో క‌లిసి దిశా ఒక రేంజులో బీచ్ వెకేష‌న్ ని ఎంజాయ్ చేసింద‌ని తాజాగా రిలీజైన ఫోటోలు వీడియోల‌ను బ‌ట్టి అర్థ‌మ‌వుతోంది. ప్ర‌స్తుతం బీచ్‌లో ఎలా గడిపిందో చూపించే ఫోటోలు, వీడియోలు వైర‌ల్ గా మారాయి.

బీచ్ వెకేష‌న్ లో తనకు అత్యంత ఇష్ట‌మైనవారితో నాణ్యమైన సమయాన్ని గడపడం .. హాట్ బికినీలో ఫోజులివ్వ‌డం క‌నిపిస్తోంది. దిశా పటానీ తనదైన‌ హాట్‌నెస్.. ఫ్యాషన్ సెన్స్.. అంద‌మైన‌ చిరునవ్వుతో నిజంగానే తనదైన ముద్ర వేసింది.