Begin typing your search above and press return to search.

చైతూ 'ధూత 2' రెండో అప్‌డేట్‌..!

ఇప్పటికే ధూత 2 కి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుందని అమెజాన్ ప్రైమ్‌ ప్రతినిధులు అప్డేట్‌ ఇచ్చారు.

By:  Tupaki Desk   |   2 May 2024 10:45 AM GMT
చైతూ ధూత 2 రెండో అప్‌డేట్‌..!
X

నాగ చైతన్య ప్రధాన పాత్రలో విక్రమ్‌ కే కుమార్ దర్శకత్వంలో రూపొంది అమెజాన్ ప్రైమ్‌ ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చిన 'ధూత' వెబ్‌ సిరీస్ కు సీజన్ 2 రాబోతున్నట్లుగా ఇప్పటికే అధికారిక ప్రకటన వచ్చింది. ఇప్పటికే ధూత 2 కి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుందని అమెజాన్ ప్రైమ్‌ ప్రతినిధులు అప్డేట్‌ ఇచ్చారు.

తాజాగా ఈ వెబ్‌ సిరీస్ కి సంబంధించిన మరో అప్డేట్‌ వచ్చింది. దర్శకుడు విక్రమ్‌ కే కుమార్‌ రూపొందించిన సీజన్ 2 కథ లో కామాక్షి భాస్కర్ల పాత్ర ప్రధానంగా ఉండబోతుందట. ధూత 1 లో కూడా ఈ అమ్మడు నటించింది. అయితే ధూత 2 లో ఈమె పాత్ర పరిధి మరింత ఎక్కువ ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి.

ధూత వెబ్‌ సిరీస్ ను రూపొందించే సమయంలో దర్శకుడు విక్రమ్‌ ఒక పాత్ర కోసం నటిని వెతుకుతూ ఉండగా కామాక్షి భాస్కర్ల ను షార్ట్‌ ఫిల్మ్‌ లో చూసి ఇంప్రెస్ అయ్యాడట. అలా ధూత లో కామాక్షి ఎంట్రీ ఇచ్చింది. మొదటి ఛాన్స్ ను సద్వినియోగం చేసుకున్న కామాక్షి ధూత 2 లో కచ్చితంగా మరింతగా ఆకట్టుకునే అవకాశాలు ఉన్నాయి.

ధూత తర్వాత పలు ఆఫర్లు కామాక్షి తలుపు తట్టాయట. కానీ మంచి పాత్రల్లో నటించాలనే ఉద్దేశ్యంతో, ప్రముఖ హీరోలతో నటించాలనే ఉద్దేశ్యంతో కొన్నింటికి ఓకే చెప్పి మిగిలిన ప్రాజెక్ట్‌ లను సున్నితంగా తిరస్కరించినట్లుగా ఆమె సన్నిహితులు చెబుతున్నారు.

ఫెమినా మిస్ ఇండియా ఫైనలిస్ట్‌ అయిన కామాక్షి భాస్కర్‌ ఎంబీబీఎస్ ను పూర్తి చేసింది. డాక్టర్‌ నుంచి నటి అయిన కామాక్షి అందాల ఆరబోత విషయంలో ఏమాత్రం మొహమాట పడదు. అందుకే భవిష్యత్తులో ఈ లేడీ డాక్టర్ సినిమా ఇండస్ట్రీలో బిజీ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.