Begin typing your search above and press return to search.

సూపర్ హీరోయిన్ ఇప్పుడు ఎలా ఉందో చూశారా..?

బాలీవుడ్ లో కెరీర్ షార్ట్ టైం లోనే ముగించినా ఆడియన్స్ మనసుల్లో స్థానం సంపాదించుకున్న బ్యూటీ అయేషా టకియా

By:  Tupaki Desk   |   1 May 2024 4:00 AM GMT
సూపర్ హీరోయిన్ ఇప్పుడు ఎలా ఉందో చూశారా..?
X

సినీ పరిశ్రమలో కొందరు హీరోయిన్స్ తమ వారి కెరీర్ ను తక్కువ టైం లోనే ముగించినా వారు చేసిన సినిమాల ఇంపాక్ట్ వల్ల ఆడియన్స్ మనసుల్లో సుస్థిర స్థానం సంపాదించుకుంటారు. ఒకటి రెండు సినిమాలు చేసి వెళ్లిన హీరోయిన్స్ గురించి చెప్పలేం కానీ పదుల సంఖ్యలో సినిమాలు చేసిన హీరోయిన్స్ ఫాం లో లేకపోయినా, ఫేడవుట్ అయినా వారికి ఒక గుర్తింపు ఉంటుంది. ఇక హీరోయిన్స్ కు పెళ్లైనా కూడా వారి అప్ డేట్స్ తెలుసుకుంటూ ఉంటారు.

బాలీవుడ్ లో కెరీర్ షార్ట్ టైం లోనే ముగించినా ఆడియన్స్ మనసుల్లో స్థానం సంపాదించుకున్న బ్యూటీ అయేషా టకియా. ఉన్నంతకాలం బాలీవుడ్ లో హడావిడి చేసిన అమ్మడు సౌత్ లో అదే మన తెలుగులో కింగ్ నాగార్జునతో సినిమా చేసింది. పూరీ జగన్నాథ్ డైరెక్షన్ లో నాగార్జున హీరోగా నటించిన సూపర్ సినిమాలో అయేషా టకియా నటించింది. సినిమాలో ఆమెది చిన్న పాత్రే అయినా ఇంపాక్ట్ బాగా ఉంటుంది.

ఆ తర్వాత పూరీ జగన్నాథ్ మహేష్ కాంబోలో వచ్చిన పోకిరి సినిమా కూడా అయేషా టకియా చేయాల్సి ఉన్నా కుదరలేదు. బాలీవుడ్ లో తన మార్క్ సినిమాలతో అలరించిన అయేషా టకియా 2011 లోనే కెరీర్ కు ఫుల్ స్టాప్ పెట్టేసింది. కెరీర్ పీక్స్ లో ఉన్న టైం లోనే 2009 లో పెళ్లాడిన అయేషా పెళ్లి తర్వాత 3 ఏళ్లు సినిమాలు చేసింది. ఆ తర్వాత సినిమాలు ఆపేసింది.

సినిమాలకు బై బై చెప్పింది కదా అని అయేషా తన లుక్ ని మార్చేసింది అనుకుంటే పొరపడినట్టే. హీరోయిన్ గా చేస్తున్న టైం లో ఎలా ఉందో దాదాపు పదేళ్ల తర్వాత ఇప్పటికీ అలాంటి చార్మింగ్ తోనే కనిపిస్తుంది అమ్మడు. సోషల్ మీడియా వల్ల ఒకప్పటి హీరోయిన్స్ ను తిరిగి సోషల్ మీడియాలో హైలెట్ చేస్తున్నారు. ఈ క్రమంలో సూపర్ హీరోయిన్ అయేషా టకియా గురించి వెతకడం మొదలు పెట్టారు.

పెళ్లి తర్వాత ఎంచక్కా తన ఫ్యామిలీ లైఫ్ ని ఎంజాయ్ చేస్తున్న అయేషా ఇప్పటికీ హీరోయిన్ రేంజ్ గ్లామర్ ని మెయింటైన్ చేస్తుంది. అయితే సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చే ఉద్దేశం ఏమైనా ఉందా అన్నది తెలియాల్సి ఉంది. అయేషా ప్రెజంట్ లుక్ చూసిన ఆడియన్స్ అంతా కూడా ఆమె లుక్ చూసి అవాక్కవుతున్నారు. మరి అయేషా తిరిగి సినిమాలు చేసే ఛాన్స్ ఉందా లేదా అన్నది చూడాలి.