Begin typing your search above and press return to search.

చీరలో అయేషా అందం.. ఈ స్టిల్ మామూలుగా లేదు

ఈ ఏడాది శ్రీవిష్ణు హీరోగా వచ్చిన ఓం భీమ్ బుష్ మూవీలో ఓ కీలక పాత్రలో అయేషా ఖాన్ నటించింది.

By:  Tupaki Desk   |   16 May 2024 4:41 AM GMT
చీరలో అయేషా అందం.. ఈ స్టిల్ మామూలుగా లేదు
X

ఇప్పుడు టాలీవుడ్ లో గట్టిగా వినిపిస్తోన్న పేరు అయేషా ఖాన్. ఒక్క ఐటెం సాంగ్ తో టాలీవుడ్ లో విపరీతమైన క్రేజ్ ని ఈ బ్యూటీ సొంతం చేసుకుంది. మోడల్ గా, సోషల్ మీడియా ఇన్ ఫ్ల్యూన్సర్ గా కెరియర్ స్టార్ట్ చేసిన అయేషా ఖాన్ హిందీలో ఓ ఆల్బం సాంగ్ లో నటించింది. ముఖచిత్రం మూవీతో టాలీవుడ్ లోకి హీరోయిన్ గా అడుగుపెట్టింది.


ఈ ఏడాది శ్రీవిష్ణు హీరోగా వచ్చిన ఓం భీమ్ బుష్ మూవీలో ఓ కీలక పాత్రలో అయేషా ఖాన్ నటించింది. ఈ పాత్రకి మంచి గుర్తింపు వచ్చింది. విశ్వక్ సేన్ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి మూవీలో ఐటెం సాంగ్ తో ఒక్కసారిగా అయేషా ఖాన్ అందరి కళ్ళు తనవైపు తిరిగేలా చేసుకుంది. ఆ సాంగ్ లో ప్రస్తుతం సోషల్ లో విపరీతంగా ట్రెండింగ్ అవుతోంది.


శర్వానంద్ మనమే మూవీలో కూడా అయేషా ఖాన్ నటిస్తోంది. ఈ బ్యూటీ గ్లామర్ షో, ఎక్స్ ప్రెసివ్ లుక్స్ చూసిన తర్వాత టాలీవుడ్ లో చాలా కాలం సౌండ్ చేస్తుందనే మాట సినీ విశ్లేషకుల నుంచి వినిపిస్తోంది. ఇప్పటికే ఇన్ స్టాగ్రామ్ లో అయేషా ఖాన్ కి 4 మిలియన్స్ కి పైగా ఫాలోవర్స్ ఉన్నారు. రెగ్యులర్ గా గ్లామర్ ఫోటోషూట్ లతో ఇన్ స్టాగ్రామ్ లో అమ్మడు సందడి చేస్తూ ఉంటుంది.


అయేషా ఖాన్ ఫోటోలకి లక్షల్లో లైక్స్ వస్తూ ఉంటాయి. ప్రస్తుతం టాలీవుడ్ లో ట్రెండింగ్ లో దూసుకుపోతున్న ఈ నార్త్ ఇండియన్ బ్యూటీకి ఐటెం సాంగ్స్ అవకాశాలు ఎక్కువగా వస్తున్నట్లు తెలుస్తోంది. హీరోయిన్ గా కూడా ఒకటి, రెండు సినిమాలు చర్చల దశలో ఉన్నాయంట. ఇదిలా ఉంటే తాజాగా చీరకట్టులో అయేషా ఖాన్ షేర్ చేసిన ఫోటోలు ఇన్ స్టాగ్రామ్ లో వైరల్ గా మారుతున్నాయి. బ్లాక్ అండ్ వైట్ ఫోటోలో చీరకట్టులో అయేషా ఖాన్ అందం చందమామల మెరిసిపోతుంది.

చేతిలో అక్టోబర్ జంక్షన్ అనే పుస్తకం పెట్టుకొని చీరలో ఫోటోలకి ఫోజులిచ్చింది. ఒక గులాబీని పుస్తకంలో పెట్టి ఆ ఫోటోలకి ఇంటరెస్టింగ్ కొటేషన్ ని అయేషా ఖాన్ ఇవ్వడం విశేషం. నువ్వు ఇచ్చిన గులాబీ ఇప్పటికీ పుస్తకంలో ఉంది. నువ్వు తిరిగొచ్చాక నా ప్రేమ నీలా లేదని చెబుతా! అంటూ కవితాత్మకంగా కొటేషన్ ని అయేషా ఖాన్ రాసుకొచ్చింది. ఈ ఫోటోలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. వీటిని ఏకంగా 2.49 లక్షల మంది లైక్ చేయడం విశేషం.