Begin typing your search above and press return to search.

స్టార్ హీరో కోసం అవ‌తార్ బృంద‌మే దిగుతోందా!

ఈ సినిమా విఎఫ్ ఎక్స్ కోసం ఏకంగా హాలీవుడ్ టెక్నిష‌న్ల‌నే రంగంలోకి దించుతున్నారు.

By:  Tupaki Desk   |   17 May 2024 6:59 AM GMT
స్టార్ హీరో కోసం అవ‌తార్ బృంద‌మే దిగుతోందా!
X

త‌ల‌ప‌తి విజ‌య్ కథానాయ‌కుడిగా వెంక‌ట్ ప్ర‌భు ద‌ర్శ‌క‌త్వంలో 'గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్' తెరకెక్కుతోన్న సంగ‌తి తెలిసిందే. విజ‌య్ పొలిటిక‌ల్ ఎంట్రీ ముందు రూపొందుతున్న చిత్రం కావ‌డంతో అభిమానుల్లో అంచ‌నాలు అంత‌కంత‌కు రెట్టింపు అవుతున్నాయి. ఇప్ప‌టికే షూటింగ్ కూడా పూర్త‌యింది. ప్ర‌స్తుతం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు జ‌రుగుతున్నాయి. తాజాగా ఈ సినిమా గురించి ఇంట్రెస్టింగ్ విష‌యం వెలుగులోకి వ‌చ్చింది. ఈ సినిమా విఎఫ్ ఎక్స్ కోసం ఏకంగా హాలీవుడ్ టెక్నిష‌న్ల‌నే రంగంలోకి దించుతున్నారు.

'అవ‌తార్'.. 'అవెంజెర్స్' లాంటి సినిమాల‌కు ప‌నిచేసిన వీఎఫ్ ఎక్స్ బృందం దిగుతుంది. ఈ విష‌యాన్ని క్రియేటివ్ ప్రొడ్యూస‌ర్ అర్చ‌నా క‌ళ్ప‌తి సోష‌ల్ మీడియా ద్వారా ధృవీక‌రించారు. 'సినిమా లో గ్రాఫిక్స్ కి అధిక ప్రాధ‌న్య‌త ఉంటుంది. హీరో విజ‌య్ కోసం ప్రత్యేకంగా డీ-ఏజింగ్ టెక్నాల‌జీ వాడి పాతికేళ్ల కుర్రాడిగా చూపించాల్సి రావ‌డంతో లాస్ ఏంజెల్స్ లోని స్టూడియో నిపుణుల‌కు ఆ ప‌నులు అప్ప‌గించాం' అని అన్నారు. దీంతో సినిమాలో గ్రాఫిక్స్ కూడా ఎక్కువ‌గానే ఉంటాయ‌ని తెలుస్తోంది.

ఇప్ప‌టికే ప్ర‌చార చిత్రాల్లో విజ‌య్ ద్విపాత్రాభిన‌యం రివీల్ చేసిన సంగ‌తి తెలిసిందే. అయితే అవి అంత‌గా ప్రేక్ష‌కుల‌కు క‌నెక్ట్ కాలేదు. వ‌య‌సు మ‌ళ్లిన విజ‌య్...వ‌య‌సులో ఉన్న విజ‌య్ ని చూపించే క్ర‌మంలో యువ విజ‌య్ పాత్ర విష‌యంలో విమ‌ర్శ‌లు వెల్లువెత్తాయి. ఆ పాత్ర‌కి సంబంధించి గ్రాఫిక్స్ నాసిర‌కంగా ఉన్నాయ‌నే విమ‌ర్శ తెర‌పైకి వ‌చ్చింది. మ‌రి తాజాగా హాలీవుడ్ టెక్నీషియ‌న్ల‌ను రంగంలోకి దించిన నేప‌థ్యంలో ఆ పాత్ర‌కు సంబంధించి మార్పులేమైనా చేస్తున్నారా? అన్న‌ది చూడాలి.

ఇప్ప‌టికే ఏఐ టెక్నాల‌జీని కూడా ఈ సినిమా కోసం వినియోగిస్తున్న‌ట్లు ప్ర‌చారంలో ఉంది. తొలుత విజ‌య్ యంగ్ రోల్ కోసం అదే టెక్నాల‌జీ వాడిన‌ట్లు ప్ర‌చారంలోకి వ‌చ్చింది. మ‌రి ఇందులో నిజ‌మెంతో తెలియాల్సి ఉంది. ఈ చిత్రానికి యువ‌న్ శంక‌ర్ రాజా సంగీతం అందిస్తున్నారు. అన్ని ప‌నులు పూర్తి చేసి సెప్టెంబ‌ర్ 5న ప్రేక్ష‌కుల ముందుకు తీసుకురావాల‌ని స‌న్నాహాలు చేస్తున్నారు.