Begin typing your search above and press return to search.

ఐపీఎల్.. అనిల్ రావిపూడి అంత మాట అనేశాడేంటి

కావాలంటే క్రికెట్ స్కోర్‌ ను ఫోన్లలో కూడా చూసుకోవచ్చని చెప్పుకొచ్చారు. అనిల్ రావిపూడి వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారడంతో కొందరు క్రికెట్ అభిమానులు, సోషల్ మీడియా యూజర్స్ మండిపడుతున్నారు.

By:  Tupaki Desk   |   2 May 2024 8:20 AM GMT
ఐపీఎల్.. అనిల్ రావిపూడి అంత మాట అనేశాడేంటి
X

పది జట్లు.. ఒకే కప్పు.. ఐపీఎల్-17 సీజన్ ఫుల్ జోష్ లో జరుగుతున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం అన్ని జట్లు ప్లే ఆఫ్ బెర్త్ లు కన్ఫామ్ చేసుకోవడానికి ట్రై చేస్తున్నాయి. అయితే మంచి టైమింగ్ లో కొంతమంది సినీ తారలు ఐపీఎల్ పై చేస్తున్న కామెంట్స్ హాట్ టాపిక్ గా మారుతున్నాయి. ఇటీవల ఐపీఎల్ విషయంలో హీరోయిన్ చాందిని చౌదరి వ్యాఖ్యలు చేసి తీవ్రంగా ట్రోలింగ్ ఎదుర్కొంది.

ఆ తర్వాత తన వ్యాఖ్యలపై క్లారిటీ ఇచ్చినా.. సన్ రైజర్స్ టీమ్ అభిమానులు విమర్శలు చేస్తూనే ఉన్నారు. ఇప్పుడు టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ అనిల్ రావిపూడి.. సత్యదేవ్ కృష్ణమ్మ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఐపీఎల్ పై చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. దీంతో పలువురు నెటిజన్లు అనిల్ రావిపూడిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఇతరుల ఇష్టాయిష్టాలను కించపరచడం అసలు కరెక్ట్ కాదని ఫైర్ అవుతున్నారు. అసలేం జరిగిందంటే? కృష్ణమ్మ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌లో అనిల్ రావిపూడి మాట్లాడుతూ.. సినిమా గురించి, అందులోని యాక్టర్లు, డైరెక్టర్ గురించి అనేక విషయాలు షేర్ చేసుకున్నారు. సత్యదేవ్‌ చిన్న చిన్న పాత్రలతో తన సినీ కెరీర్‌ ను ప్రారంభించి.. హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారని కొనియాడారు.

ఎలాంటి జోనర్ కథకైనా, రోల్ కు అయినా సత్యదేవ్ కటౌట్ బాగా సెట్ అవుతుందని అనిల్ రావిపూడి తెలిపారు. ఇక కృష్ణమ్మ సినిమా చాలా బాగుంటుందని, ఫ్యామిలీతో కలిసి థియేటర్ కు వెళ్లి మూవీ చూడాలని అనిల్ రావిపూడి కోరారు. అదే సమయంలో క్రికెట్ గురించి కామెంట్స్ చేశారు. ఐపీఎల్ మ్యాచ్‌లు 2-3 రోజులు చూడకుంటే ఎక్కడేం కొంపలు మునిగిపోవని అన్నారు. ఫస్ట్ షో, సెకండ్ షోలకు థియేటర్లకు వచ్చి సినిమా చూడాలని రిక్వెస్ట్ చేశారు.

కావాలంటే క్రికెట్ స్కోర్‌ ను ఫోన్లలో కూడా చూసుకోవచ్చని చెప్పుకొచ్చారు. అనిల్ రావిపూడి వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారడంతో కొందరు క్రికెట్ అభిమానులు, సోషల్ మీడియా యూజర్స్ మండిపడుతున్నారు. డైరెక్టర్ కామెంట్స్ కు రివర్స్ కౌంటర్ ఇస్తున్నారు. సినిమాలు కూడా నెల రోజుల తర్వాత ఓటీటీల్లో, టీవీల్లో వస్తున్నాయి కదా అని కామెంట్లు పెడుతున్నారు.

ఇప్పుడు నెట్టింట ఈ పోస్టులు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇక అనిల్ రావిపూడి మళ్లీ స్పందిస్తారా లేదో చూడాలి. ఇక అనిల్ ప్రస్తుతం వెంకటేష్ తో ఒక సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. దిల్ రాజు ప్రొడక్షన్ లో రూపొందుతున్న ఆ సినిమాను 2025 సంక్రాంతికి విడుదల చేయాలని అనుకుంటున్నారు. ఆ సినిమా పోలీస్ క్రైమ్ డ్రామాగా రూపొందనున్నట్లు సమాచారం.