పొల్లాచి: వేల సినిమాల షూటింగ్‌స్పాట్!

Wed Jul 08 2015 13:19:34 GMT+0530 (IST)

ఔట్‌డోర్ షూటింగ్‌ల యుగం మొదలయ్యాకా.. భారతీయ సినిమా ప్రపంచాన్ని అంతటినీ చుట్టేసి వచ్చింది. సినిమాల బడ్జెట్ పదుల వందల కోట్ల రూపాయలకు రీచ్ అయిన తరుణంలో ప్రపంచంలోని అన్ని మూలలా భారతీ సినిమాల షూటింగ్‌ల జాడ కనిపిస్తుంది. తెలుగు సినిమా తెరపైనే ప్రపంచంలోని అందాలన్నీ ఆవిష్క-తం అయ్యాయి. మరి ఇలాంటి పరిస్థితుల్లోకూడా ఒక ప్రాంతం మాత్రం దక్షిణ భారత చిత్రపరిశ్రమకు ఫేవరెట్ షూటింగ్ స్పాట్‌గా నిలిచింది. గత దశాబ్దం దశాబ్దంన్నర సమయాన్ని తీసుకొంటేనే ఇక్కడ కొన్ని వేల సినిమాలు షూటింగ్‌ను జరుపుకొన్నాయి! అంతటి అందాలను ఇముడ్చుకొన్న ప్రాంతమే 'పొల్లాచి'. తమిళనాడులోని కోయంబత్తూర్ జిల్లాలో రెండో పెద్ద టౌన్ మాత్రమే అయినా.. ప్రకృతి అందాల విషయంలో మాత్రం పొల్లాచిది అంతర్జాతీయ స్థాయి.

నేషనల్‌పార్కే ప్రధాన ఆకర్షణ: సముద్రమట్టానికి 1400 మీటర్ల ఎత్తులో.. దాదాపు వెయ్యి చదరపు కిలోమీటర్ల పరిధిలో విస్తరించి ఉన్న ఇక్కడి ఇందిరాగాంధీ లైల్డ్‌లైఫ్ శాంక్చురి అండ్ నేషనల్‌పార్క్ ప్రధాన ఆకర్షణ. ఎన్నో రకాల వన్యజీవులకు ఆవాసమైన ఈ వనం ప్రకృతి రమణీయతకు తార్కాణం అని చెప్పాలి. ఇక్కడ పులులు చిరుతల జింకలు. ఏనుగులు.. విభిన్న జాతుల పక్షలు ఉంటాయి. ఇలా జంతువృక్షజాలంతో కూడుకొన్న ప్రకృతి రమణీయతను దర్శించుకోవడానికి ప్రతియేటా వేల మంది పర్యాటకులు వస్తుంటారు. సినిమాల చిత్రీకరణకు కూడా ఈ పరసిరాలు అత్యంత అనువైనవి. అందమైనవి. అందుకే కోలీవుడ్ టాలీవుడ్ శాండల్‌వుడ్ మల్లూవుడ్ పరిశ్రమల వారు పొల్లాచిపై పడిపోతుంటారు!

    ప్రకృతి రమణీయమైన స్థలంలోనే మన దగ్గర గొప్ప దేవాలయాలు కొలువై ఉండటం కూడా సహజమే. పొల్లాచి సమీపంలోనే పదహార శతాబ్దం నాటి అలగునాచి దేవాలయం ఉంది. ఈ దేవాలయ స్థలపురాణం కూడా చాలా ఆసక్తికరంగా ఉంటుంది. కొన్ని శతాబ్దాల క్రితం కొంతమంది అమ్మవారి విగ్రహాన్ని తమ వెంట తీసుకెళుతూ ఈ ప్రాంతంలో విశ్రమించారని.. రాత్రివేళ ఉన్నట్టుండి వారి వద్దనున్న అమ్మవారి విగ్రహం అదృశ్యమైందని.. ఈ స్థల ప్రశస్తాన్ని గుర్తించి అక్కడ దేవాలయ నిర్మాణం జరిగిందని స్థలపురాణం చెబుతుంది.    పొలాచ్చికి సమీపంలోనే అజియర్ ఇరిగేషన్ డ్యామ్ మరో ప్రధానకర్షణ.

    సినిమా షూటింగులు విస్త-తంగా జరిగే ప్రాంతం కాబట్టి ఇక్కడికి రవాణా సౌకర్యాలు కూడా బాగానే ఉన్నాయి. కోయంబత్తూర్ నుంచి బస్సుల ద్వారా లేదా.. ఇతర వాహనాలను అద్దెకు తీసుకొని కూడా ఈ ప్రాంతాన్ని సందర్శించవచ్చు.