కందనవోలు (కర్నూలు) ప్రాంత పర్యాటక ప్రదేశాలు!

Tue Jul 21 2015 16:18:47 GMT+0530 (IST)

1953 - 56 మధ్య ఆంధ్రప్రదేశ్ రాజధాని. భిన్న సంస్కృతి సంప్రదాయాలకు నెలవైన నగరం. తుంగభద్ర నది ఒడ్డున ఉన్న విశాలమైన నగరం. ఇవన్నీ చెప్పేది కందనవోలు గురించి! అదే నేటి కర్నూలు గురించి! రాయలసీమకు ముఖద్వారంగా పిలవబడే కర్నూలు పర్యాటకంగా ఎంతో ప్రాముఖ్యతను సంతరించుకుంది! కొండారెడ్డి బురుజు దగ్గర నుండీ ఎన్నో సందర్శన ప్రదేశాలు సుందర ప్రదేశాలు కర్నూలు సొంతం! చరిత్రలోకి చూస్తే... నేటి కర్నూలు పేరు ఒకప్పుడు కందనవోలుగా ఉండేది! ఎన్నోవేల సంవత్సరాల చరిత్ర కర్నూలు సొంతం! ఏడవ శతాబ్ధంలో కర్నూలును బీజాపూర్ సుల్తానులు పరిపాలించారు... అప్పటి పాలన పెద్దగా పేరుపొందకపోయినా... అనంతరం పరిపాలించిన శ్రీకృష్ణదేవరాయుల కాలంలో కర్నూలు చారిత్రకంగా చిరస్థాయిగా నిలిచింది!

కొండా రెడ్డి బురుజు:

కర్నూలులో ముఖ్యంగా చెప్పుకోవలసింది కొండా రెడ్డి బురుజు! ఇది కర్నూలు నగరం నడిబొడ్డూన పాత బస్టాండ్ దగ్గర్లో ఉంటుంది. ఈ కోటను విజయనగర రాజు అచుత దేవరాయులు నిర్మించారు! రాయలసీమ పర్యటను వెళ్లినవారెవరైనా కర్నూలు వెళ్లి కొండారెడ్డి బురుజును చూసి రావల్సిందే! ప్రస్తుతం కోటలో కొత మేర శీధిలావస్థలో ఉన్నా... ఎన్నో అద్ద్భుత శాసనాలకు ఈ కోట నెలవనే చెప్పాలి!

జగన్నాథ గుట్ట:

కర్నూలులో చెప్పుకోదగ్గవాటిలో మరొక ప్రదేశం జగన్నాథ గుట్ట! కర్నూల్ నగరంలో ఉన్న అత్యంత ప్రసిద్ధ పర్యాటక పుణ్యక్షేత్రం! ఈ ఆలయంలో శీవలింగం సుమారు 6 మీటర్ల ఎత్తు 2 మీటర్ల వెడల్పు ఉండి పూర్తిగా గ్రానైట్ తో చేయబడింది. అయితే ఈ ఆలయంలోని శివలింగం భూముడు ప్రతిష్టించాడని చెబుతుంటారు. ఇదే గుట్టమీద వినాయకుడూ ఆంజనేయుడి విగ్రాహాలు కూడా ఉన్నాయి!

దక్షిణకాశీగా పిలవబడే ఆలంపూర్:

ఇక కృష్ణా తుంగభద్ర నదుల సంగమ ప్రదేశం ఆలంపూర్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. దక్షిణకాశీగా పిలవబడే ఈ ప్రదేశం కర్నూలుకు 27 కి.మీ. దూరంలో ఉంది. అష్టాదశ శక్తి పీఠాలలో 5వదిగా చెప్పబడే ఈ ఆలంపూర్ క్షేత్రంలో నవబ్రహ్మలు కొలువై ఉన్నారు! ఎంతో ప్రతిష్టాత్మకమైన చారిత్రాత్మకమైన ఈ ఆలయాలను క్రీ.శ. ఏడవ శతాబదంలో బాదామి చాళుక్యులు నిర్మించారు!

గోల్ గుమ్మజ్:

ఇక హంద్రీ నది ఒడ్డున ఉన్న ఉస్మానియా కాలేజ్ సమీపంలో ఉన్న అబ్దుల్ వహాబ్ సమాధి ఒక పర్యాటక స్థలం. గోల్ గుమ్మజ్ గా పిలవబడే ఈ సమాధి సుమారు 400 ఏళ్ల క్రితంది! 1648 సంవత్సరంలో కర్నూలు ప్రాంతాన్ని పరిపాలించిన అబ్దుల్ వహాబ్ సమాది ఇది!

విజయ భాస్కర రెడ్డి స్మారక కట్టడం:

రాజకీయ నాయకుడికి కట్టిన స్మారక స్థూపం కూడా కర్నూలు లో ఒక వహార కేంద్రంగా బాసిల్లుతుంది. ఏపీ దివంగత మాజీ ముఖ్యమంత్రి కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్మృతిగా ఈ కట్టడం నిర్మించారు. ఈ ప్రాంతంలో అనుచరులు అభిమానులు ఈయనను పెద్దాయన్ గా పిలుచుకునే వారు. హంద్రినీవా నది ఒడ్డున ఈ స్మారక కట్టడం నిర్మించారు!