Begin typing your search above and press return to search.

ఈ సిటీకి టూర్ అంటే తడిసి మోపెడు కావటమే

By:  Tupaki Desk   |   4 Aug 2015 6:59 AM GMT
ఈ సిటీకి టూర్ అంటే తడిసి మోపెడు కావటమే
X
మారిన జీవనశైలిలో భాగంగా ప్రయాణాలు బాగానే పెరిగాయి. ఏడాది రెండు.. మూడు టూర్లు వేయటం.. ఖాళీగా ఉంటే కొత్త ప్రదేశాలు చూడాలన్న తపన ఈ మధ్య కాలంలో బాగానే పెరిగింది. అయితే.. దేశంలో ఒక మహా నగరానికి వెళితే మాత్రం తడిచి మోపెడు అవుతుందని చెబుతున్నారు.

దేశంలో పర్యాటకు ప్రాంతాలకు కొదవ లేకున్నా.. అత్యంత ఖరీదైన నగరం ఏమిటన్న అంశంపై ఒక సర్వే నిర్వహించారు. దీని ప్రకారం.. ఆయా నగరాల్లో హోటల్ బస ఖర్చులు.. రవాణా ఖర్చులు ఇలా అన్నింటిని కలిపి లెక్కేశారు. అలా వేసిన లెక్కలు చివరికి తేల్చిందేమంటే..

దేశ ఆర్థికరాజధాని ముంబయి పర్యటన చాలా కాస్ల్టీ గురూ అని చెబుతున్నారు. దేశంలోని తొమ్మిది ప్రముఖ నగరాలతో పోల్చినప్పుడు అత్యంత ఖరీదైన నగరంగా ముంబయి నిలిస్తే.. చౌక నగరంగా చంఢీగడ్ నిలిచింది.

ట్రిప్ ఎడ్వైజన్ సంస్థ జరిపిన సర్వేలో ఈ విషయం బయటకు వచ్చింది. ఢిల్లీ.. ముంబయి.. బెంగళూరు.. హైదరాబాద్.. చెన్నై.. పుణె.. జైపూర్.. కోల్ కతా.. చండీగఢ్ నగరాల్లో లెక్కలు తీసినప్పుడు.. ముంబయిలో మూడు రోజులు బస చేయటానికి రూ.39,956 ఖర్చు అవుతుందని లెక్క తేల్చారు. అదే సమయంలో తక్కువ ఖర్చు అయితే చండీగఢ్ అని తేల్చారు. ఈ ప్లాన్డ్ సిటీలో మూడు రోజులకు రూ.21,849 ఖర్చు అవుతుందని తేల్చారు.

ఈ మొత్తం ఖర్చులో హోటల్ అద్దెకే భారీగా ఖర్చు అవుతుందని తేల్చారు. మొత్తం ఖర్చులో యాభై శాతం హోటల్ అద్దెకే సరిపోతుందని వారు చెబుతున్నారు. దేశంలో ఖరీదైన పర్యాటక నగరంగా ముంబయి అగ్రస్థానంలో నిలిస్తే.. ప్రపంచ వ్యాప్తంగా ఖరీదైన పర్యాటక ప్రదేశాల జాబితాలో.. మొదటి స్థానం మెక్సికో కాన్ కున్.. స్విట్జర్లాండ్ లోని జ్యూరిచ్ రెండో స్థానంలో.. న్యూయార్క్ సిటీ మూడో స్థానంలో.. లండన్ నాలుగో స్థానంలో నిలిచాయి. ఈ నగరాలకు జర్నీ అంటే మాత్రం కాస్త.. జేబులో దండిగా పైసలు సెట్ చేసుకున్నాకే.. టూర్ ఫ్లాన్ చేసుకోండి.