అఖండ గోదావరి మధ్య పాపికొండల్లో బోటు ప్రయాణం...

Thu Jul 23 2015 12:13:48 GMT+0530 (IST)

అఖండ గోదావరి తూర్పు కనుమలను ఛేదించే ప్రాంతమే పాపికొండలు! దీనిపేరు వినని పర్యాటకులు ఉండరు అన్నా అతిశయోక్తి కాదేమో! ఈ పాపికొండల టూర్ ప్రతి పర్యాటకుడికి రసానుభుతిని కలిగిస్తుంది ఆశించినదానికంటే అధిక ఆనందాన్ని అందిస్తుంది!రాజమడ్రి నగరానికి సుమారు 60 కి.మీ. దూరంలో ఉన్న ఈ పాపికొండల ప్రాంతం జాతీయ పార్కుగా గుర్తించబడింది. ఇక్కడి పరిశరాలు కొండలమధ్య ప్రయాణం జలపాతాలు ఒక్కసారి అత్యంట అందంగా ఉంటాయి! రాజంఅండ్రి నుండి గోదావరి మధ్యన ఉన్న పాపికొండల వద్దకు బోట్ లో ప్రయాణించి వెళ్లాలి! నది మధ్యలో బోటులో ప్రయాణిస్తూ... ఇరువైపులా ఉన్న ప్రకృతి అందలను చూసి తీరాల్సిందే! ఈ బోటు ప్రయాణం సాగుతున్నంత సేపూ... ఎక్కువగా కనిపించేవి... పోలవరం ప్రజెక్టు ప్రాంతం కొల్లూరు వెదురు గుడారాలు బొరుటూరు బేంబూహట్స్!

ఊ బోటు ప్రయాణం చేయాలంటే... ప్రతీరోజూ ఉదయం 7:30 సమయానికి రాజమండ్రి నుండి రోడ్డు మార్గంద్వారా పట్టిసీమ రేవు పోలవరం రేవు పురుషోత్తపట్టణం రేవుల్లో ఏదో ఒక రేవుకి చేరుకుంటారు... అక్కడి నుండి బోట్లపై అసలు సిసలు మజా మొదలవుతుంది! ఈ ప్రయాణం మొదలైనప్పటి నుండి... ఉదయం 9 గంటలకు బ్రేక్ ఫాస్ట్ అనంతరం బోటు కదులుతుంది!

అనంతరం ముందుగా 10:30 ప్రాంతానికి గండిపోచమ్మ ఆలయానికి చేరుకుంటుంది. ఆలయ దర్శనం అనంతరం తిరిగి ప్రయాణం మొదలవుతుంది. ప్రయాణంలోనే మధ్యాహ్నం ఒంటిగంటకు శాఖాహార బోజనం అందిస్తారు. అది కూడా బోటులో షికారు చేస్తూనే లాగించెయ్యొచ్చు! మధ్యాహ్నం రెండు గంటలకెళ్లా పాపికొండల మధ్యకు చేరుకుంటారు! ఆ సమయంలో పొందే ఆనందం బోటులో జనాల ఉరకలెత్తే ఉత్సాహం చూసి తీరాల్సిందే!

ఇక మధ్యహ్నం మూడు గంటల ప్రాంతానికి ఖమ్మం జిల్లాలోని పేరంటపల్లి గ్రామానికి చేరుకుంటారు! అక్కడున్న విశ్వేశ్వర ఆలయాన్ని రామకృష్ణ మునివాటాన్ని సందర్శిస్తారు! అదికాస్త ఒక 30 నిమిషాల్లో పూర్తవుతుంది! అనంతరం మధ్యాహ్నం మూడున్నర ప్రాంతంలో జ్ఞాపకాల ఆనందాలతో తిరుగుప్రయాణం మొదలవుతుంది!  అక్కడి నుంది ఏ రేవునుండి బోటు షికారు మొదలైందో అదే రేవు దగ్గరకి రాత్రి 7 - 7:30 ప్రాంతానికి వచ్చి చేరతారు. అనంతరం రోడ్డు మార్గం ద్వారా రాత్రి 8 - 8:30 సమయానికి రాజమండ్రి చేరుకుంటారు!

అలా కాకుండా రెండు రోజులు టూర్ వేయాలనుకునే వారు... మొదటి రోజు సాయంత్రం వరకూ బోటు షికారు చేసిన అనంతరం మిగిలిన సమయాని క్యాంప్ సైట్ లో గడపాలి. అక్కడ నాన్ వెజ్ బోజనం అందిస్తారు. అందమైన నిద్రను ఆహ్లాదకరమైన బోగిమంటలు గుడారాల నడుమ సాగించవచ్చు!

ఇక రెండో రోజు ఉదయం తెల్లారుజామున నడకమార్గంలో ఉదయం ఆరుగంటల ప్రాంతంలో గైడ్ సాయంతో అడవిలో నడుచుకుంటూ వెళ్లి... పాపికొండలమధ్య ఉన్న పామలేరు వాగులో స్నానం చేయొచ్చు! ఈ ప్కృతింధ్య చేసే స్నానం ఇచ్చే సంతోషం ప్రత్యేకంగా చెప్పుకోవాలి!

అనంటరం 9 గంటలకు బ్రేక్ ఫాస్ట్ చేసి గుడారాల మధ్య అందాలను చూడవచ్చు. మధ్యాహ్నం రకరాల వెజ్ - నాన్ వెజ్ కూరలతొ బోజనం చెయ్యొచ్చు! అనంతరం మధ్యాహ్నం 3 గంటలకు బోటు తిరిగి ప్రయాణమవుతుంది! సాయంత్రం యదావిదిగా బయలుదేరిన రేవులో బోటు ద్వారా దింపి... అక్కడి నుంది రోడ్డు మార్గం ద్వారా రాజమండ్రికి చేర్చుతారు! అలా కాకుండా తిరుగు ప్రాయాణంలో రాజమండ్రి కాకుండా భద్రాచలం వెల్లాలనుకున్న కూడా ఆ సదుపాయం కూడా ఉంది!