ఒక షియోమి టీవీలు తయారీ ఏపీలో కూడా!

Thu Jul 16 2015 12:45:45 GMT+0530 (IST)

ఇండియాలోకి ఎంటరవుతూనే అంతర్జాతీయ స్థాయిలో ప్రముఖ స్మార్ట్ ఫోన్ మేకర్ గానిలించింది చైనీ సంస్థ షియోమీ. ఎమ్ఐ త్రీ తో ఇండియన్ మార్కెట్లోకి అడుగుపెట్టి స్మార్ట్ ఫోన్ మార్కెట్ ను దున్నేస్తోంది ఈ సంస్థ. చైనా ఇండియాలో గొప్ప స్థాయి అమ్మకాలతో స్యామ్ సంగ్ యాపిల్ ల తర్వాత టాప్ మోస్ట్ స్మార్ట్ ఫోన్ మేకర్ గా ఈసంస్థ నిలుస్తోంది. ఇంకా అధునాతన స్మార్ట్ ఫోన్లతో ఇది తన మార్కెట్ ను విస్తరిస్తోంది.మరి ఇంతేకాదు.. షియోమీ  మరోరకంగా కూడా సత్తా చాటాలని భావిస్తోంది. కేవలం స్మార్ట్ ఫోన్లకే పరిమితం కాకుండా.. ఇతర గాడ్జెట్ లతో కూడా తన మార్కెట్ ను విస్తరించే పనిలో పడింది ఈ సంస్థ. షియోమీ వేరబుల్ ఫిట్ నెస్ ట్రాకర్ ఇప్పటికే భారత మార్కెట్ లోకి అందుబాటులోకి వచ్చింది. అలాగే త్వరలోనే షియోమీ బాక్స్ రాబోతోంది. సాధారణ టీవీని ఇది స్మార్ట్ టీవీగా మార్చేస్తుందట. ఇంకా ఈ కంపెనీకి చెందిన ఇతర గాడ్జెట్స్ కూడా ఈ ఏడాది చివరకే భారతమార్కెట్ లో అందుబాటులో ఉంటాయని తెలుస్తోంది.

అలాగే దేశీయంగా మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ లను నెలకొల్పనుందట షియోమీ. ఈ మేరకు ఈ సంస్థ భారత విభాగపు అధికారులు ప్రకటన చేశారు. బెంగళూరులోనూ చిత్తూరులోని శ్రీ సిటీ సెజ్ లోనూ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లను ఏర్పాటు చేయనున్నట్టుగా ప్రకటించారు. ఇక్కడ నుంచి భారీ ఎత్తున స్మార్ట్ ఫోన్లను రూపొందిస్తామని వివరించారు.