Begin typing your search above and press return to search.

ఆ లింక్‌ ఓపెన్‌ చేస్తే ఫేస్‌''బుక్‌'' అయినట్లే..!

By:  Tupaki Desk   |   11 Jun 2015 8:43 AM GMT
ఆ లింక్‌ ఓపెన్‌ చేస్తే ఫేస్‌బుక్‌ అయినట్లే..!
X
మరో దారుణమైన వైరస్‌ మీ ఫేస్‌బుక్‌ అకౌంట్లను కబళించేందుకు సిద్ధంగా ఉంది. ఏ మాత్రం నిర్లక్ష్యంగా ఉన్నా.. అజాగ్రత్తగా ఉన్నా మీ ప్రొఫెల్‌ మొత్తం బూతు బమ్మలతో నిండిపోయి.. మీకు అయిన వారి దగ్గర.. పరిచయసుతల వద్ద తలెత్తుకోని పరిస్థితి ఏర్పడే ప్రమాదం పొంచి ఉంది.

ఈ వీడియోను అర్జెంట్‌గా చూడండి.. ఇది మీదే సుమా అనే ట్యాగ్‌లో ఫేస్‌బుక్‌లో ఒక మెసేజ్‌ వస్తుంది. అరే.. మనకు సంబంధించిన వీడియో ఏదో తయారు చేశారన్న మాట.. భలే.. భలే అని దాన్ని క్లిక్‌ చేస్తే అడ్డంగా బుక్‌ అయినట్లే. ఎందుకుంటే..ఆ పేరు మీద వచ్చే మేసేజ్‌ మిమ్మల్ని బుట్టలో వేసుకునేందుకు.. తప్పు దారి పట్టించేందుకేనన్న విషయం మర్చిపోకూడదు.

ఈ మెసేజ్‌ను క్లిక్‌ చేసిన వెంటనే.. మీ ప్రొఫైల్‌ పిక్‌తో పాటు.. మీ ఫేస్‌బుక్‌ పేజీలో మొత్తం అసహ్యకరమైన ఫోటోలతో నింపేస్తుంది. అందుకే.. మీ ఫేస్‌బుక్‌ అకౌంట్‌ తెరిచినప్పుడు. మీకు చెందిన ఈ వీడియోను అర్జెంట్‌గా చూడండంటూ వచ్చే మెసేజ్‌ని అస్సలు టచ్‌ చేయొద్దని సూచిస్తున్నారు. సో.. బీకేర్‌ఫుల్‌.