ఆ టెస్ట్ కోసం ఉత్తుత్తి సిటీని సృష్టించారు

Wed Jul 22 2015 10:02:25 GMT+0530 (IST)

భారీ చిత్రాలకు పెద్ద పెద్ద సెట్లు వేయటం కామనే. కానీ.. ఒక పరీక్ష కోసం ఒక నగరాన్ని నిర్మించేశారు. సినిమా సెట్ మాదిరికాకుండా.. ఏకంగా నగరాన్నే నిర్మించేశారు. అది అషామాషీ టెస్ట్ కాకపోవటతో భారీ ఖర్చుతో నగరాన్ని నిర్మించేసిన వైనమిది.

ఇప్పటివరకూ అందుబాటులో ఉన్న కార్లకు భిన్నమైన.. డైవర్లు లేని కారు తయారీపై జోరుగా ప్రయోగాలు జరుగుతున్న నేపథ్యంలో తాజాగా.. అలాంటి ప్రయోగాల్లో భాగంగా కొత్త పరీక్షను చేపట్టారు.

ఇందుకోసం ఒక నగరాన్ని నిర్మించాలని భావించారు. అచ్చు నగరంలో ఉండే మాదిరి ఉత్తుత్తి సిటీని 32 ఎకరాల్లో ఏర్పాటు చేశారు. మిషిగన్ యూనివర్సిటీ రూపొందించిన ఈ ఉత్తుత్తి నగరానికి ఎమ్ సిటీ అని నామకరణం చేశారు. ఈ నగరం కోసం ఏకంగా రూ.63.5కోట్లు ఖర్చు చేశారు.ఈ నగరంలో రెస్టారెంట్ల మొదలు.. స్ట్రీట్ లైట్లు.. రోడ్లు.. ఇరువైపుల నడక మార్గం ఉన్న రోడ్లు.. ట్రాఫిక్ సిగ్నల్స్.. దుకాణాలు.. ఆపీసులు.. ఇళ్లు.. ఇలా అన్నింటిని నిర్మించేశారు. ఇప్పుడీ ఉత్తుత్తి నగరంలో డ్రైవర్ రహిత కారుని పరీక్షిస్తారు. అందులో సక్సెస్ అయితే.. డ్రైవర్ రహిత కార్ల తయారీకి సంబంధించి మరో అడుగు ముందుకు పడినట్లే.