మైక్రోసాఫ్ట్ కూడా చారిత్రక తప్పిదం చేసిందా?

Thu Jul 16 2015 09:53:34 GMT+0530 (IST)

కంప్యూటర్ టెక్నాలజీ విషయంలో ప్రపంచానికే దారి చూపించిన మైక్రోసాఫ్ట్ కంపెనీ ఇప్పుడు ఒక విషయం మీద విపరీతంగా వేదన చెందుతోంది. ప్రపంచం మొత్తాన్ని ప్రభావితం చేసే ఒక అంశాన్ని గుర్తించటంలో మైక్రోసాఫ్ట్ చారిత్రక తప్పిదం చేసినట్లుగా వాపోతోంది.

కంప్యూటర్లను జనసామ్యానికి దగ్గరక తీసుకెళ్లి.. తాను తప్ప మరో ప్రత్యమ్నాయం లేదన్నట్లుగా చేసిన మైక్రోసాఫ్ట్ చేసిన చారిత్రక తప్పిదం ఏమిటంటే.. మొబైల్ విప్లవాన్ని సరైన సమయంలో గుర్తించలేకపోవట అని చెబుతోంది. భవిష్యత్తు అంతా పర్సనల్ కంప్యూటర్లది మాత్రమేనని అనుకున్న మైక్రోసాఫ్ట్ మధ్యలో వచ్చిన మొబైల్ ఫోన్ల ఉధృతిని గుర్తించటంలో ఘోరంగా విఫలమైనట్లుగా ఆ కంపెనీ సీఈవో సత్య నాదెళ్ల వ్యాఖ్యలు చేశారు.

పర్సనల్ కంప్యూటర్ల మీదనే తమ దృష్టి తప్పించి.. మొబైల్ మీద దృష్టి సారించలేదని.. ప్రపంచంలో ప్రతి ఒక్క ఇంట్లో పర్సనల్ కంప్యూటర్ అన్న అంశంపై ఫోకస్ పెట్టిన మైక్రోసాఫ్ట్.. మొబైల్ విషయంలో వస్తున్న మార్పుల్పి.. పసిగట్టటంలో విఫలమైందని చెప్పక తప్పదు. ఈ సందర్భంగా ఆయన మరో ఆసక్తికరమైన వ్యాఖ్య చేశారు. భవిష్యత్తుమొత్తం మొబైల్ ఫోన్లే రాజ్యం ఏలుతాయని భావిస్తే.. అది కూడా చారిత్రక తప్పిదమే అవుతుందని చెబుతున్న సత్యనాదెళ్ల.. అలా ఎందుకన్న విషయంపై మాత్రం స్పష్టత ఇవ్వకపోవటం గమనార్హం.