Begin typing your search above and press return to search.

ఎల్జీ కంపెనీ వాల్ పేపర్ టీవీ!

By:  Tupaki Desk   |   8 Jun 2015 10:34 AM GMT
ఎల్జీ కంపెనీ వాల్ పేపర్ టీవీ!
X
గతంలో టీవీ అంటే కనీసం రెండడుగుల పొడవు, మూడడుగుల అడుగుల వెడల్పు ఉండేది. తర్వాతి కాలంలో కొద్ది కొద్ది గా మందం తగ్గుతూ తగ్గుతూ... ప్లాస్మా వరకూ వచ్చింది! అయినా కూడా మందం ఎక్కువైపోతుంది అని అనుకున్నారో లేక టెక్నాలజీ అభివృద్ధిలో తమ పాత్ర చూపించాలని అనుకున్నారో కానీ... కేవలం 0.97 మిల్లీ మీటర్లు మందం మాత్రమే ఉన్న ఒక కొత్త టీవీని విడుదల చేసింది ఎల్‌జీ!

డిస్‌ప్లే టెక్నాలజీ కొత్త అధ్యయన్ని సృష్టించడానికన్నట్లు... దక్షిణ కొరియా ఎలక్ట్రానిక్ గృహోపకరణాల కంపెనీ ఎల్‌జీ (LG) గోడకు అంటించుకునే విధంగా సూపర్ స్లిమ్ మోడల్ ఓఎల్ఈడి ప్యానల్‌ను తయారు చేసింది! ఈ డిటాచబుల్ ఓఎల్ఈడి ప్యానల్ కేవలం 0.97 మిల్లీమీటర్ల మందంతోనూ, 55 అంగులాల వెడల్పు తోనూ ఉంటుంది! దీని బరువు కూడా కేవలం 1.9 కిలో గ్రాములు! అంటే కనీసం రెండు కిలోలు కూడా లేని A3 పేపర్ చుట్టినట్లు, చార్ట్ పేపర్ తీసుకెళ్లినట్లు తీసుకెళ్లిపోవచ్చన్నమాట!

అందమైన చిత్రాలను స్టిక్కర్ల సాయంతో గోడకు అంటించుకున్నట్లు... మ్యాగ్నటిక్ మ్యాట్ సహాయంతో ఈ ప్యానల్‌ను కూడా చాలా సలువుగా గోడకు అతికించెయ్యొచ్చు! ముఖ్యంగా అవుడ్ డోర్ అడ్వర్టైజింగ్ విభాగంలో కీలక పాత్ర పోషించేలా ఈ ఓఎల్ఈడి ప్యానల్స్ ను తయారుచేసారు! ఈ ప్యానల్ ప్రస్తుతానికి 55, 66, 77 అంగుళాల సైజులలో లభ్యమవుతుంది! త్వరలోనే 99 అంగుళాల వేరియంట్ లో కూడా ఈ ప్యానల్స్ ని విడుదల చేయనున్నారు! వీటి ప్రారంభ ధర $9000 గా నిర్ణయించారు!