కొత్త ఫీచర్; మాయమయ్యే మొయిల్

Tue Jul 28 2015 12:14:01 GMT+0530 (IST)

ఉత్తరాలు రాసే రోజులు ఎప్పుడో పోయాయి. మొయిల్స్ పంపుకోవటం కామన్ అయిపోయింది. అయితే.. ఉత్తరానికి.. మొయిల్ కు ఉన్న ఉమ్మడి లక్షణాల్లో.. పోస్టు డబ్బాలో పడిన ఉత్తరం.. సెంట్ నొక్కిన తర్వాత వెళ్లే రెండు మొయిల్ ఒక్కటే. రెండింటిని వెనక్కి తీసుకునే ఛాన్స్ లేదు.

డిజిటల్ యుగంలో ఏదైనా సాధ్యమయ్యేలా ఉండేలే కానీ.. అసాధ్యమన్నది ఉండకూడదు కదా. మొయిల్ పంపిన తర్వాత.. పొరపాటున పంపిన మొయిల్ అయితే.. దాన్ని డిలీట్ చేయటం ఎలా అన్నది ఎంతోకాలంగా ఎంతో మందిని తొలిచేస్తున్న సందేహం. తాజాగా ఆ సమస్యకు పరిష్కారం కనుగొనటమే కాదు.. పొరపాటున పంపే మొయిల్స్ విషయంలో జరిగే డ్యామేజ్ ని చాలావరకు కంట్రోల్ చేసే ఒక కొత్త ఫీచర్ అందుబాటులోకి రానుంది.

ఈ ఫీచర్ ని సింఫుల్ గా చెప్పాలంటే.. పంపేసిన మొయిల్ సైతం మాయం కావటమే. అదెలా సాధ్యమంటే.. కాస్త విషయంలోకి వెళ్లాల్సిందే. తాజాగా ఈ ఫీచర్ ను జీమొయిల్ లోకి తీసుకురానున్నారు.

అదెలానంటే.. డిలీషియస్ సైన్స్ అనే సంస్థ రూపొందించిన డీమొయిల్ ను జీ మొయిల్ కి అనుసంధానం చేస్తున్నారు. అయితే.. దీన్ని గూగుల్ క్రోమ్ ఎక్స్ టెన్షన్ ను ఇన్ స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది. ఒకసారి ఆ పని పూర్తి అయిన తర్వాత.. మొయిల్ పంపే ముందు.. డీ మొయిల్ ఆన్.. ఆఫ్ అనే ఛాయిస్ ఉంటుంది. డీ మొయిల్ ను కానీ యాక్టివేట్ చేసి ఆన్ బటన్ ను నొక్కితే.. ఎన్ని గంటలు.. ఎన్ని రోజులన్నది అడుగుతుంది. సమయాన్ని ఎంపిక చేసుకున్నాక.. పంపిన మొయిల్.. సదరు సమయం వరకు మాత్రమే మొయిల్ వారి దగ్గర ఉంటుంది.

డీమొయిల్ లో పేర్కొన్న సమయం త్వరాత.. అవతల వారి ఇన్ బాక్స్ నుంచి అటోమేటిక్ గా డిలీట్ అయిపోతుంది. అంతేకాదు.. ఈ విధానంలో మరో ఫీచర్ ఉంది. మనం పంపిన మొయిల్ డిలీట్ అయిపోతుందన్న ఉద్దేశ్యంతో దాన్ని ఫార్వర్డ్ చేస్తే? అన్న సందేహానికి డీ మొయిల్ సరైన సమాధానమే చెబుతుంది. డీ మొయిల్ ఆప్షన్ ను ఎంచుకున్న మొయిల్ ను ఫార్వర్డ్ చేయకుండా నియంత్రించే సౌకర్యం దీని సొంతం. ఈ ఫీచర్ ఏదో బాగుంది కదూ