Begin typing your search above and press return to search.

వంద కోట్ల మంది ఫోన్లలో ఆ అప్లికేషన్‌ ఉంది!

By:  Tupaki Desk   |   11 Jun 2015 6:43 AM GMT
వంద కోట్ల మంది ఫోన్లలో ఆ అప్లికేషన్‌ ఉంది!
X
భవిష్యత్తులో మొబైల్‌ ద్వారా జనాలని తమ సైట్‌కు రప్పించుకోవడంపైనే దృష్టిపెడతామంటూ కొన్ని సంవత్సరాల కిందట ఫేస్‌బుక్‌ ఫౌండర్‌ మార్క్‌జుకర్‌బర్గ్‌ ప్రకటించాడు. చూస్తుంటే ఆయన సంస్థ ఈ విషయంలో ఇప్పుడు అనుకొన్న లక్ష్యాన్ని సాధించినట్టుగానే ఉంది. ఏకంగా వందకోట్ల మందికి అప్లికేషన్‌ ద్వారా చేరువైంది ఫేస్‌బుక్‌. ప్రపంచవ్యాప్తంగా వంద కోట్ల మంది ఫోన్లలో ఫేస్‌బుక్‌ మెసేంజర్‌ను ఇన్‌స్టాల్‌ చేసుకొన్నారని ఫేస్‌బుక్‌ ప్రకటించింది.

తాజాగా ఆ స్థాయికి తాము రీచ్‌ అయ్యామని ఆ సంస్థ ప్రకటించింది. అంటే మొబైల్‌ ద్వారా ఫేస్‌బుక్‌ను వినియోగిస్తున్న వారి సంఖ్య ఇది అనుకోవాలి. కేవలం కంప్యూటర్‌, వెబ్‌ మీద మాత్రమే కాకుండా.. వీరు ఫోన్‌ద్వారా కూడా ఫేస్‌బుక్‌ను ఆపరేట్‌ చేస్తున్నారు.

స్మార్ట్‌ఫోన్‌ల ద్వారా మెసేంజర్‌ను ఇన్‌స్టాల్‌ చేసుకోకున్నా ఫేస్‌బుక్‌లో సర్ఫ్‌ అయ్యే అవకాశం ఉంది. అయినా కూడా వందకోట్ల మంది మెసేంజర్‌ను ఇన్‌స్టాల్‌ చేసుకొన్నారంటే ఈ సోషల్‌నెట్‌వర్కింగ్‌ సైట్‌ మానియా ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. మొత్తానికి వందకోట్ల స్మార్ట్‌ఫోన్లలో కొలువైన అప్లికేషన్‌గా ఫేస్‌బుక్‌ మెసేంజర్‌ రికార్డు సృష్టించింది. ఫేస్‌బుక్‌ ఖాతాలో మరో ఘన విజయం నమోదైంది.