Begin typing your search above and press return to search.

రెండు నిమిషాల‌కోసారి చూస్తున్నార‌ట‌

By:  Tupaki Desk   |   30 July 2015 11:41 AM GMT
రెండు నిమిషాల‌కోసారి చూస్తున్నార‌ట‌
X
ఇవాల్టి రోజున స‌గ‌టు మ‌నిషి కోరుకునే మౌలిక స‌దుపాయాల్లో ఇంట‌ర్నెట్ ఒక‌టి. ప్ర‌పంచాన్ని అర‌చేతిలో ఉండే ఇంట‌ర్నెట్ చేతిలో ఉంచేందుకు విప‌రీతంగా త‌పిస్తున్నారు. ఈ కార‌ణంతోనే.. ప్ర‌పంచంలోని 300 కోట్ల మంది ఈ రోజున ఇంట‌ర్నెట్ ను వాడుతున్నారు.

ఇంత భారీగా ఇంట‌ర్నెట్ వినియోగిస్తున్న వారిలో ఎక్కువ మంది వినియోగిస్తున్న సెర్చ్ ఇంజిన్ ఎమిట‌ని చూస్తే.. గూగుల్ మొద‌టిస్థానంలో నిలుస్తుంది. గూగుల‌మ్మ చేతిలో ఉంటే.. చింత‌లేల అన్న‌ట్లుగా ప‌రిస్థితి ఉంది. విష‌యం ఏదైనా గూగుల‌మ్మలో వెతికితే ఇట్టే స‌మాచారం కుప్ప‌లు తెప్ప‌లుగా వ‌చ్చి ప‌డే ప‌రిస్థితి.

ఇదిలా ఉంటే.. గూగుల్ సంగ‌తి కాసేపు ప‌క్క‌న పెడితే.. ప్ర‌పంచాన్ని న‌డిపిస్తున్న సోష‌ల్ నెట్ వ‌ర్క్స్ లో అత్యంత ప్ర‌భావిత‌మైంది ఫేస్ బుక్‌. ప్ర‌పంచంలో ఇంట‌ర్నెట్ వినియోగించే వారిలో స‌గం మంది ఫేస్‌ బుక్‌ ను వినియోగిస్తునట్లు తాజాగా తేలింది. ఫేస్ బుక్ ఖాతాదారులు నెల‌లో ఒక‌సారి అయినా స‌రే దాన్ని ఓపెన్ చేస్తున్నార‌ట‌. ఇలా చేసే వారి వృద్ది రేటు జూన్ చివ‌ర‌కు 13 శాతం పెరిగిన‌ట్లు తేల్చారు.

అంతేకాదు.. ఫేస్ బుక్ వినియోగ‌దారుల్లో ప్ర‌తిరోజూ దాన్ని చూడందే రోజు గ‌డ‌వ‌నట్లుగా వ్య‌వ‌హ‌రించే వారు మొత్తం ఫేస్‌ బుక్ ఖాతాదారుల్లో 65 శాతం మంది ఉన్న‌ట్లు తేల్చారు. అంతేకాదు.. ఫేస్‌ బుక్‌ ను మొబైల్‌లో వినియోగించే వారి సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంద‌ట‌.

స్మార్ట్ ఫోన్లో ఫేస్‌ బుక్‌ ను వినియోగించే వినియోగ‌దారులైతే ప్ర‌తి రెండు నిమిషాల‌కు ఒక‌సారి ఫేస్‌ బుక్ అప్‌ డేట్ చూసుకుంటున్నార‌ని తేల్చారు. అంటే.. ఇంట్లోని కుటుంబ స‌భ్యుల‌తో కంటే కూడా.. ఫేస్‌ బుక్‌ తోనే అనుబంధం ఎక్కువ‌న్న మాట‌.