Begin typing your search above and press return to search.

రైలు టిక్కెట్టును మొబైల్‌తో కొనేయొచ్చు

By:  Tupaki Desk   |   22 April 2015 6:11 AM GMT
రైలు టిక్కెట్టును మొబైల్‌తో కొనేయొచ్చు
X
ట్రైన్‌ రిజర్వేషన్‌ కోసం ఐఆర్‌సీటీసీ మొబైల్‌ యాప్‌ ఉన్న విషయం తెలిసిందే. దీంతో.. రిజర్వ్‌ సీట్లను బుక్‌ చేసుకునే వీలుంది. తాజాగా.. అన్‌రిజర్వ్‌ టిక్కెట్టు కోసం మొబైల్‌ ద్వారా కొనుక్కునే అవకాశం రైల్వే శాఖ ఇస్తోంది. ఇప్పటికే ముంబయి సబర్బన్‌ సెక్టార్‌లో ప్రయోగాత్మకంగా పరిశీలించారు. ఈ ప్రయోగం విజయవంతం కావటంతో.. దీన్ని దేశవ్యాప్తంగా అమలు చేయాలని భావిస్తున్నారు.

అండ్రాయిడ్‌ అప్లికేషన్‌ ఉన్న మొబైల్‌ఫోన్‌తో గూగుల్‌ ప్లేస్టోర్‌కి వెళ్లి రైల్వే యాప్‌ని డౌన్‌లోడ్‌ చేసుకోవాలి. ఐఆర్‌టీసీ ఈ వాలెట్‌లో పేరు.. వివరాల్ని రిజిష్టర్‌ చేసుకున్న తర్వాత.. అందులో కొంత నగదును జమ చేసుకోవచ్చు. దీన్ని రైల్వే స్టేషన్‌కువెళ్లి కానీ.. డెబిట్‌.. క్రెడిడ్‌ కార్డుల ద్వారా టాపప్‌ చేసుకునే వీలుంది.

అనంతరం.. ఏ స్టేషన్‌ నుంచి ఏ స్టేషన్‌ వరకు ప్రయాణించాలో వివరాలునమోదు చేసుకొని టిక్కెట్టు పొందే వీలుంది. ఇక.. టిక్కెట్టు చేతికి రానప్పటికీ.. ఫోన్‌లో ఉండే ఈ టికెట్‌ను చూపిస్తే సరిపోతుంది. ఆన్‌ రిజర్వ్‌ టిక్కెట్లు తీసుకోవటానికి రైల్వే స్టేషన్లలో పెద్ద పెద్ద క్యూలలో వెయిట్‌ చేస్తూ.. టికెట్‌ కోసం టెన్షన్‌ పడాల్సిన అవసరం లేదు. ఎంచక్కా రైల్వే స్టేషన్‌కు వెళ్లటానికి ముందో.. లేదంటే.. వెళ్లే సమయంలో అయినా టిక్కెట్టు బుక్‌ చేసుకునే వీలుంది. ఈ విధానాన్ని బుధవారం (ఏప్రిల్‌ 22) నుంచి ప్రారంభిస్తున్నారు.