Begin typing your search above and press return to search.

అక్రమ సంబందాలన్నీ బయటపడ్డాయి!

By:  Tupaki Desk   |   24 July 2015 12:02 PM GMT
అక్రమ సంబందాలన్నీ బయటపడ్డాయి!
X
"నేను ఆయన కోసమని షాపింగ్ చేయడానికి వెళితే... అక్కడ ఆయన మరో యువతితో కులుకుతాడా? దీనికి ప్రతీకారంగా నేనుకూడా ఈ రోజు రాత్రి ఒక యువకుడితో గడుపుతాను"...

నేను ఛీటింగ్ చేశాను, క్షమించమని వేడుకున్నాను అయినా కూడా నా ప్రేయసి నన్ను క్షమించలేదు, నన్ను కాదని వెళ్లిపోయింది"...

"నేను నా గర్ల్ ఫ్రెండ్ ని ఛీటింగ్ చేసాను కానీ దొరకలేదు, అయితే నా ప్రేయసి మాత్రం వేరేవారితో రాసక్రీడలు సాగిస్తూ దొరికిపోయింది"...

"నా ప్రేయసిని నేను కోల్పోయాను, పిల్లకు కూడా మొహం చూపించలేకపోతున్నాను"...
"ఎవరికీ తెలియదని అక్రమసంబందాలు కొనసాగించాను, ఇప్పుడు పిల్లలకు కూడా తెలిసిపోవడంతో చాలా సిగ్గుగా ఉంది"...

"చాలా తప్పు జరిగిపోయింది, సమాజంలో మెహం ఎత్తుకుని తిరగలేకపోతున్నాను"...

ఏమిటి కబుర్లు అనుకుంటున్నారా... న్యూయార్క్ లో అక్రమసంబంధాలు ప్రపంచానికి, సహచరులకు తెలిసిపోవడంతో వెళ్లువెత్తిన వారి వారి అభిప్రాయాలు! అక్రమసంబందాలు అతిగా ఉంటున్నాయి ఈ సమాజంలో అని చెప్పడానికి కూడా ఈ సంఘటన అతిపెద్ద తాజా ఉదాహరణ!

విషయంలోకి వస్తే... ఆశ్లే మాడిసన్ అనే ఒక ఆన్ లైన్ డేటింగ్ సంస్థ కేవలం వివాహేతర సంబందాలకోసమే వెలిసింది! ఈ వెబ్ సైట్ ద్వారా వివాహేతరసంబందాలు కుప్పలు తెప్పలుగా ఏర్పడటం మొదలయ్యాయి. అయితే తాజాగా ఈ వెబ్ సైట్ హ్యాకింగ్ కి గురైంది! ఆ హ్యాకర్స్ కాస్త... ఈ సైట్ లో రిజిస్టర్ అయిన జంటలు, మెంబర్స్ డిటైల్స్ అన్నీ విడుదల చేశారు. ఇంకేముంది దొరకనంత కాలం దొరల్లా, దొంగ ప్రేమ నటిస్తూ తిరిగిన వారి బాగోతాలు కాస్త బట్టబయలయ్యాయి! దీంతో అమెరికాలో బాగా ఫేమస్ అయిన "విష్పర్" అనే యాప్ ద్వారా ఎవరి బాదను, ఎవరి కథను వారు చెప్పుకుని కుయ్యో మొర్రో అంటున్నారు!

ఇటువంటి ఆన్ లైన్ డేటింగ్ సైట్లను అర్జెంటుగా మూసెయ్యకపోతే తమ దాడులు ఇలానే కొనసాగుతాయని హ్యాకర్లు హెచ్చరిస్తున్నారు. ఇది అన్ని డేటింగ్ సైట్లకు వర్తిస్తుందని హెచ్చరికలు జారీ చేస్తున్నారు.