Begin typing your search above and press return to search.

ఆపిల్‌...మ‌రో దుమ్మురేపే నిర్ణ‌యం

By:  Tupaki Desk   |   14 July 2015 10:55 AM GMT
ఆపిల్‌...మ‌రో దుమ్మురేపే నిర్ణ‌యం
X
ఆపిల్ ఈ పేరు చాలు టెక్ ప్రియులు ఐప్యాడ్‌ల నుంచి మొద‌లుకొని ఐఫోన్‌ల వ‌ర‌కు అత్యద్భుత టెక్నాల‌జీ సంస్థ అని తేల్చిచెప్పేందుకు. ఆపిల్ ట్యాబ్‌లు, ఆపిల్ వాచ్‌లు, సెల్‌ఫోన్ల ద్వారా ఇప్ప‌టికే త‌న ముద్ర‌ను చాటుకున్న ఆపిల్ కంపెనీ మ‌రో మారు విప్ల‌వాత్మ‌క నిర్ణ‌యం తీసుకుంది. అయితే ఈసారి ప్రొడ‌క్ట్‌ను కాకుండా.... స‌ర్వీసును ప్ర‌వేశ‌పెట్టింది.

ఆపిల్ పే పేరుతో యూకేలోన‌గ‌దు సర్వీసుల సేవ‌ల‌ను అందుబాటులోకి తెచ్చింది. ఈ విధానంలో నగదు, క్రెడిట్, డెబిట్ కార్డుల ఊసే లేకుండా ఐఫోన్, యాపిల్ వాచ్, ఐప్యాడ్ లాంటి వాటితో బిల్లులు చెల్లిస్తారు. ఈ సర్వీసు ద్వారా సూపర్ మార్కెట్‌లోని వస్తువుల కొనుగోళ్ళతో సహా బస్సు, రైల్వే టికెట్లు సైతం బుక్ చేసుకోవచ్చు. ప్రస్తుతం ఈ ఆపిల్ పే ద్వారా రూ.2 వేల వరకు ఖర్చు చేసుకోవచ్చు. ఈ ఏడాది చివరి కల్లా దీనిని రూ.3 వేల వరకు పెంచనున్నారు.

ఆన్‌లైన్ పేమెంట్ల మార్కెట్ పెరుగుతుండ‌టం, ఆపిల్ ప్రొడ‌క్టుల‌ను మ‌రింతగా చేరువ చేసేందుకు ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు సంస్థ తెలిపింది. కొత్త స‌ర్వీసు త‌మ ఉత్ప‌త్తుల వ‌లే వినియోగ‌దారుల మ‌న‌సు చూర‌గొంటుంద‌ని ధీమా వ్య‌క్తం చేసింది.