వచ్చేసింది: ఆడేసుకునేందుకు యాంగ్రీ బర్డ్స్ 2

Thu Jul 30 2015 21:22:53 GMT+0530 (IST)

చిన్నా పెద్దా అన్న తేడాను చెరిపేసి.. అన్నీ వయస్కుల వారిని ఇట్టే ఆకట్టుకునే వీడియో గేమ్ లలో యాంగ్రీ బర్డ్ ఒకటి. వీడియో గేమ్ ఆడని వారికి సైతం దీని పేరుసుపరిచితం. ఒక్కసారి ఆడితే.. మళ్లీ.. మళ్లీ ఆడాలనిపించేలా ఉండే ఈ గేమ్ ప్రపంచ వ్యాప్తంగా విశేష ఆదరణ పొందింది. తాజాగా యాంగ్రీ బర్డ్స్ కు కొనసాగింపుగా కొత్త సిరీస్‌ను విడుదల చేశారు.

ప్రస్తుతం ఆండ్రాయిడ్ వెర్షన్ ను మాత్రమే విడుదల చేసిన కంపెనీ త్వరలో మిగిలిన ఫ్లాట్ ఫాం మీద కూడా రానుంది. ఇప్పడున్న యాంగ్రీబర్డ్స్ కు మెరుగులు దిద్దటమే కాదు..కొత్త పాత్రల్ని.. సరికొత్త మోడళ్లతో యాంగ్రీ బర్డ్ 2ను సిద్ధం చేసినట్లుగా చెబుతున్నారు. ఈ గేమ్‌కు సంబంధించి టీజర్‌ను గురువారం విడుదల చేశారు. దీనికి విశేష ఆదరణ లభిస్తోంది. మరిక ఆలస్యం ఎందుకు.. యాంగ్రీబర్డ్ 2ను కూడా ఆడేయండి.