Begin typing your search above and press return to search.

కోల్ కతా వర్సెస్ లక్నో... రికార్డ్ చెరపాలని కేకేఆర్ ప్రయత్నం!

ఇక లక్నో పై ఇప్పటివరకు కేకేఆర్ అత్యధిక స్కోరు 208 పరుగులు కాగా..కేకేఆర్ పై లక్నో అత్యధిక స్కోరు 210!

By:  Tupaki Desk   |   14 April 2024 4:27 AM GMT
కోల్  కతా వర్సెస్  లక్నో... రికార్డ్  చెరపాలని కేకేఆర్  ప్రయత్నం!
X

ఇండియన్ ప్రీమియర్ లీగ్ - 2024 సీజన్లో 28వ మ్యాచ్ ఆదివారం కోల్‌ కతాలోని ఈడెన్ గార్డెన్స్‌ లో... కోల్‌ కతా నైట్ రైడర్స్ - లక్నో సూపర్ జెయింట్స్ మధ్య జరగనుంది. ఈ సిరీస్‌ లో కోల్‌ కతా నైట్ రైడర్స్ ఇప్పటివరకూ నాలుగు మ్యాచ్‌ లు ఆడి 6 పాయింట్లతో పట్టికలో రెండో స్థానంలో ఉండగా, లక్నో సూపర్ జెయింట్ ఈ సిరీస్‌ లో ఐదు మ్యాచ్‌ లు ఆడి 6 పాయింట్లతోనే పట్టికలో నాలుగో స్థానంలో ఉంది.

ఈ రెండు జట్లు తమ తమ చివరి మ్యాచ్ లలో ఓడిపోయి బరిలోకి దిగుతుండటంతో.. ఈ మ్యాచ్ మరింత రసవత్తరంగా ఉండొచ్చని అంటున్నారు. ఇందులో భాగంగా... చెన్నై సూపర్ కింగ్స్ తో కోల్ కతా నైట్ రైడర్స్ ఆడిన చివరి మ్యాచ్‌ లో.. చెన్నై ఏడు వికెట్ల తేడాతో కోల్‌ కతాపై విజయం సాధించగా.. ఢిల్లీ క్యాపిటల్స్ తో జరిగిన చివరి మ్యాచ్‌ లో... ఆరు వికెట్ల తేడాతో లక్నో ఓటమి పాలైంది.

కోల్ కతా జట్టు విషయానికొస్తే... సునీల్ నరైన్ 4 మ్యాచ్ లు ఆడి 161 పరుగులు చేయగా.. ఆడ్రూ రస్సెల్ 115, సాల్ట్ 102 పరుగులతో ఉన్నారు. ఇక బౌలింగ్ డిపార్ట్మెంట్ విషయానికొస్తే... వైభవ్ అరోరా రెండు మ్యాచ్ లు ఆడి 5 వికెట్లు తీయగా.. హర్షిత్ రాణా 3 మ్యాచ్ లలో 5 వికెట్లు సాధించాడు.

ఇక లక్నో టాపర్స్ విషయానికొస్తే... నికోలస్ పూరన్ ఆడిన ఐదు మ్యాచ్ లలోనూ 178 పరుగులు సాధించగా... కేఎల్ రాహుల్ 165, క్వింటన్ డీకాక్ 164 పరుగులు సాధించారు. బౌలింగ్ డిపార్ట్మెంట్ విషయానికొస్తే... యాష్ ఠాకూర్ 4 మ్యాచ్ లు ఆడి 7 వికెట్లు తీసుకోగా, స్పీడ్ స్టర్ మయాంక్ యాదవ్ 3 మ్యాచ్ లు ఆడి 6 వికెట్లు పడగొట్టాడు.

హెడ్ టు హెడ్ రిపోర్ట్స్:

కోల్‌ కతా, లక్నో ఇప్పటి వరకు 3 ఐపీఎల్ మ్యాచ్‌ లు ఆడగా... ఆ మూడు మ్యాచ్ లలోనూ లక్నోనే విజయం సాధించింది. ఈ నేపథ్యంలో కోల్ కతా.. లక్నోపై మొదటి విజయం కోసం వెతుకుతోంది.

ఇక లక్నో పై ఇప్పటివరకు కేకేఆర్ అత్యధిక స్కోరు 208 పరుగులు కాగా..కేకేఆర్ పై లక్నో అత్యధిక స్కోరు 210!

పిచ్ రిపోర్ట్:

ఈడెన్ గార్డెన్స్ బ్యాటర్స్ స్వర్గధామం అనే చెప్పాలి. ఈ సమయంలో... గత 20 మ్యాచ్‌ ల్లో ఈ వేదికపై సగటు తొలి ఇన్నింగ్స్ స్కోరు 176 పరుగులు. ఇక ఇక్కడ ఇప్పటి వరకు పేసర్లు 512 వికెట్లు, స్పిన్నర్లు 388 వికెట్లు తీశారు.