Begin typing your search above and press return to search.

లక్నో బౌలర్లను దంచికొట్టిన సాల్ట్... కేకేఆర్ కు సూపర్ విక్టరీ!

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2024 లో భాగంగా ఈడెన్ గార్డెన్స్‌ వేదికగా కోల్ కతా - లక్నో ల మధ్య మ్యాచ్ రసవత్తరంగా సాగింది.

By:  Tupaki Desk   |   14 April 2024 5:30 PM GMT
లక్నో బౌలర్లను దంచికొట్టిన సాల్ట్... కేకేఆర్  కు సూపర్  విక్టరీ!
X

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2024 లో భాగంగా ఈడెన్ గార్డెన్స్‌ వేదికగా కోల్ కతా - లక్నో ల మధ్య మ్యాచ్ రసవత్తరంగా సాగింది. ఈ సమయంలో టాస్ గెలిచిన కేకేఆర్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్.. బౌలింగ్ ఎంచుకున్నాడు! ఈ మ్యాచ్ సందర్భంగా లక్నో కొత్త జెర్సీతో బరిలోకి దిగింది. దీంతో లక్నో బ్యాటర్ లు క్రీజ్ లోకి అడుగుపెట్టారు.

లక్నో ఇన్నింగ్స్ స్టార్ట్!:

కోల్‌ కతాతో మ్యాచ్‌ లో లక్నో బ్యాటింగ్ ప్రారంభించింది. ఈ సమయంలో కేఎల్ రాహుల్, డికాక్‌ లు క్రీజ్ లోకి అడుగుపెట్టారు. ఈ సమయంలో మిచెల్ స్టార్క్ వేసిన తొలి ఓవర్‌ లో డీకాక్ వరుసగా రెండు బౌండరీలు బాదడంతో 10 పరుగులు వచ్చాయి. దీంతో లక్నో తొలి ఓవర్ పూర్తయ్యే సరికి వికెట్లేమీ నష్టపోకుండా 10 పరుగులు సాధించింది.

లక్నో ఫస్ట్ వికెట్ డౌన్!:

వైభవ్‌ వేసిన 1.5వ ఓవర్ లో లక్నో మొదటి వికెట్‌ ను కోల్పోయింది. ఇందులో భాగంగా... ఓపెనర్ క్వింటన్ డికాక్ (10) ఔటయ్యాడు. దీంతో 2 ఓవర్లు ముగిసే సరికి లక్నో స్కోరు ఒక వికెట్ నష్టానికి 20 పరుగులకు చేరింది.

లక్నోకి మరో షాక్ తగిలింది!:

స్టార్క్ బౌలింగ్‌ లో 4.4వ ఓవర్ లో దీపక్ హుడా (8) ఔటయ్యాడు. దీంతో 39 పరుగుల వద్ద లక్నో రెండో వికెట్‌ ను కోల్పోయినట్లయ్యింది. దీంతో ఐదు ఓవర్లు ముగిసే సరికి లక్నో స్కోరు రెండు వికెట్ల నష్టానికి 39 పరుగులకు చేరింది.

కేఎల్ రాహుల్ దూకుడుకు ఆండ్రి రస్సెల్ అడ్డుకట్ట!:

రస్సెల్ వేసిన 11 ఓవర్ తొలిబంతికి సిక్స్ బాదిన రాహుల్.. రెండో బంతికి రమణ్‌ దీప్‌ అద్భుతమైన క్యాచ్‌ అందుకోవడంతో పెవిలియన్‌ కు చేరాడు. దీంతో 78 పరుగుల వద్ద లక్నో మూడో వికెట్‌ ను కోల్పోయినట్లయ్యింది. ఫలితంగా... 11 ఓవర్లు పూర్తయ్యే సరికి లక్నో స్కోరు మూడు వికెట్ల నష్టానికి 88 పరుగులకు చేరింది.

లక్నో నాలుగో వికెట్ డౌన్!:

లక్నోకి మరో షాక్ తగిలింది. ఇందులో భాగంగా... వరుణ్‌ చక్రవర్తి 11.4వ ఓవర్‌ లో మార్కస్ స్టాయినిస్‌ (10) ఔటయ్యాడు. దీంతో లక్నో స్కోరు 4 12 ఓవర్లకు 95 పరుగులకు చేరుకుంది.

100 పరుగులకు చేరిన లక్నో!:

వరుణ్‌ చక్రవర్తి వేసిన 14వ ఓవర్‌ లో సిక్స్ సహా 10 పరుగులు వచ్చాయి. దీంతో 14 ఓవర్లు పూర్తయ్యే సరికి 4 వికెట్లు కోల్పోయిన లక్నో 109 పరుగులు చేసింది.

లక్నో ఐదో వికెట్ కోల్పోయింది!:

నరైన్ వేసిన 14.4వ ఓవర్‌ లో ఆయుష్‌ బదోని (29) ఔటయ్యాడు. దీంతో 15 ఓవర్లు పూర్తయ్యే సరికి లక్నో 5 వికెట్లు కోల్పోయి 113 పరుగులు చేసింది.

దూకుడు పెంచిన నికోలస్‌ పూరన్:

రన్ రెట్ పడిపోతుండటంతో నికోలస్ పూరన్ దూకుడు పెంచాడు. ఇందులో భాగంగా వైభవ్ అరోరా వేసిన 18వ ఓవర్‌ లో రెండు సిక్స్‌ లు బాదాడు. ఇలా ఈ ఓవర్ లో మొత్తం 18 పరుగులు రావడంతో లక్నో స్కోరు 5 వికెట్ల నష్టానికి 144 పరుగులకు చేరింది.

దూకుడు మీదున్న నికోలస్ పూరన్ ఔటయ్యాడు!:

స్టార్క్‌ వేసిన 20వ ఓవర్ మొదటిబంతికి ఆఫ్‌ సైడ్‌ బంతిని ఆడబోయి కీపర్‌ కు క్యాచ్‌ ఇచ్చి ఔటయ్యాడు పూరన్. అప్పటికి అతడి వ్యక్తిగత స్కోరు 32 బంతుల్లో 2 ఫోర్లు, 4 సిక్స్ ల సాయంతో 45! లక్నో ఇన్నింగ్స్ లో ఇదే టాప్ స్కోరు!

లక్నో బ్యాంటింగ్ ముగిసింది... కోల్‌ కతా లక్ష్యం 162!

కోల్‌ కతాతో మ్యాచ్‌ లో లక్నో ఏడు వికెట్ల నష్టానికి 161 పరుగులు చేసింది. నికోలస్ పూరన్ (45) కీలక సమయంలో పరుగులు రాబట్టాడు. అంతకుముందు కెప్టెన్ కేఎల్ రాహుల్ (39) రాణించాడు.

ఇక కోల్‌ కతా బౌలర్లలో మిచెల్ స్టార్క్ (3/28) అద్భుతంగా బౌలింగ్ వేశాడు. వైభవ్ అరోరా, వరుణ్‌ చక్రవర్తి, ఆండ్రి రస్సెల్, సునీల్ నరైన్ తలో వికెట్ తీసుకున్నారు.

కేకేఆర్ బ్యాటింగ్ స్టార్ట్!:

లక్నో నిర్దేశించిన 162 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు కోల్‌ కతా బరిలోకి దిగింది. ఈ సందర్భంగా షమార్ జోసెఫ్ వేసిన తొలి ఓవర్ లో 22 పరుగులు సమర్పించుకున్నాడు.

కోల్ కతా ఫస్ట్ వికెట్ డౌన్!:

మోసిన్‌ ఖాన్ వేసిన రెండో ఓవర్‌ మూడో బంతికి సునీల్ నరైన్ (6) ఔటయ్యాడు. దీంతో 2 ఓవర్లకు కేకేఆర్ స్కోరు ఒక వికెట్ నష్టానికి 28 పరుగులకు చేరింది.

కోల్‌ కతా రెండో వికెట్ డౌన్‌!:

కృనాల్‌ పాండ్య వేసిన మూడో ఓవర్ లో తొలి మూడు బంతులను బౌండరీలకు తరలించాడు ఫిల్‌ సాల్ట్‌. దీంతో ఈ ఓవర్‌ లో 14 పరుగులు వచ్చాయి. అనంతరం నాలుగో ఓవర్‌ తొలి బంతికే కోల్‌ కతా రెండో వికెట్‌ కోల్పోయింది. ఇందులో భాగంగా.. మోసిన్‌ ఖాన్‌ వేసిన ఈ ఓవర్ లో రఘువంశీ (7) ఔటయ్యాడు.

దీంతో 4 ఓవర్లు పూర్తయ్యే సరికి కేకేఆర్ స్కోరు 2 వికెట్ల నష్టానికి 49 పరుగులకు చేరింది.

కేకేఆర్ దూకుడు... 10 ఓవర్లకు పరిస్థితి ఇది!:

కోల్‌ కతా బ్యాటర్లు దూకుడుగా ఆడుతున్నారు. ఈ క్రమంలో అర్షద్‌ ఖాన్‌ వేసిన ఎనిమిదో ఓవర్‌ లో 12 పరుగులు రాగా, రవి బిష్ణోయ్ వేసిన తొమ్మిదో ఓవర్‌ లో ఎనిమిది పరుగులు వచ్చాయి. అనంతరం అర్షద్‌ ఖాన్‌ వేసిన 10 ఓవర్‌ లో వరుసగా రెండు ఫోర్లు బాదిన ఫిల్ సాల్ట్ 26 బంతుల్లో అర్ధ శతకం పూర్తి చేసుకున్నాడు.

దీంతో కోల్ కతా స్కోరు 10 ఓవర్లు పూర్తయ్యే సరికి రెండు వికెట్ల నష్టానికి 101 పరుగులకు చేరింది.

దూకుడు పెంచిన బ్యాటర్లు... కోల్‌ కతా ఘన విజయం!

లక్నో తో జరిగిన మ్యాచ్‌ లో కోల్‌ కతా 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన లక్నో ఏడు వికెట్ల నష్టానికి 161 పరుగులు చేయగా.. ఈ లక్ష్యాన్ని రెండు వికెట్లు కోల్పోయి 15.4 ఓవర్లలో సునాయసంగా ఛేదించింది కేకేఆర్.

కోల్ కతా బ్యాటర్స్ లో ఫిల్ సాల్ట్ (89*: 47 బంతుల్లో 14 ఫోర్లు, 3 సిక్స్‌ లు) వీర బాదుడు బాదగా.. శ్రేయస్ అయ్యర్ (38*: 38 బంతుల్లో 6 ఫోర్లు) రాణించాడు.