Begin typing your search above and press return to search.

బూమ్రా బుల్లెట్లు, స్కై మెరుపులు... ముంబై గ్రేట్ విక్టరీ!

ఐపీఎల్ సీజన్ 17లో భాగంగా 25వ మ్యాచ్ బెంగళూరు - ముంబై మద్య అత్యంత రసవత్తరంగా జరిగింది

By:  Tupaki Desk   |   12 April 2024 3:43 AM GMT
బూమ్రా బుల్లెట్లు, స్కై మెరుపులు... ముంబై గ్రేట్ విక్టరీ!
X

ఐపీఎల్ సీజన్ 17లో భాగంగా 25వ మ్యాచ్ బెంగళూరు - ముంబై మద్య అత్యంత రసవత్తరంగా జరిగింది. ఇరుజట్లూ కచ్చితంగా గెలిచి తీరాల్సిన మ్యాచ్ గా పరిగణించబడ్డ ఈ గేం ఆంద్యంతం ఎలా జరిగిందనేది ఇప్పుడు చూద్దాం..! ఈ మ్యాచ్ లో ముంబయి కెప్టెన్ హార్దిక్ పాండ్య టాస్‌ గెలిచి ప్రత్యర్థి జట్టును బ్యాటింగ్‌ కు ఆహ్వానించాడు. దీంతో.. విరాట్ కొహ్లీ, డూప్లెసిస్ లు క్రీజ్ లోకి అడుగుపెట్టారు!

బెంగళూరు బ్యాటింగ్ స్టార్ట్!:

టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ దిగిన బెంగళూరు తరుపున విరాట్ కొహ్లీ, డూప్లెసిస్ లు ఓపెనర్లుగా క్రీజ్ లో అడుగుపెట్టారు. మహ్మద్‌ నబి వేసిన తొలి ఓవర్‌ లో 7 పరుగులు వచ్చాయి. అనంతరం.. గెరాల్డ్ కొయెట్జీ రెండో ఓవర్‌ లోనూ 7 పరుగులు వచ్చాయి. దీంతో.. రెండు ఓవర్లు ముగిసే సరికి ముంబై సోరు వికెట్లేమీ నష్టపోకుండా 14 పరుగులు చేసింది.

బెంగళూరు ఫస్ట్ వికెట్ డౌన్!:

బెంగళూరుకు ఆరంభంలోనే గట్టి షాక్‌ తగిలింది. బుమ్రా వేసిన 2.3 ఓవర్‌ లో సూపర్‌ ఫామ్‌ లో ఉన్న విరాట్ కోహ్లీ (3) ఔటయ్యాడు. దీంతో... 3 ఓవర్లకు బెంగళూరు స్కోరు ఒక వికెట్ నష్టానికి 18 పరుగులకు చేరింది.

బెంగళూరు రెండో వికెట్‌ డౌన్!:

మూడో ఓవర్ లో విరాట్ కొహ్లీ వికెట్ కోల్పోయిన బెంగళూరుకు నెక్స్ట్ ఓవర్ లోనే మరో దెబ్బ తగిలింది. ఇందులో భాగంగా... ఆకాశ్‌ మధ్వాల్ వేసిన 3.4 ఓవర్‌ లో వీల్ జాక్స్‌ (8) ఔటయ్యాడు. దీంతో 4 ఓవర్లకు బెంగళూరు స్కోరు రెండు వికెట్ల నష్టానికి 28 పరుగులకు చేరింది.

సగం ఓవర్లు పూర్తయ్యే సరికి పరిస్థితి ఇది!:

ఆరంభంలోనే రెండు కీలక వికెట్లు కోల్పోయినా... బెంగళూరు బ్యాటర్లు నిలకడాగానే ఆడారు. ఈ క్రమంలో... హార్దిక్ పాండ్య వేసిన పదో ఓవర్‌ లో 13 పరుగులు రాబట్టారు. ఫలితంగా... సగం ఓవర్లు పూర్తయ్యే సరికి ఆర్సీబీ స్కోరు 2 వికెట్ల నష్టానికి 89 పరుగులకు చేరింది.

రజత్ పటిదార్‌ ఆఫ్ సెంచర్ & ఔట్!:

గెరాల్డ్ కొయెట్జీ వేసిన 12 ఓవర్‌ లో మొదటి రెండు బంతులకు వరుసగా సిక్సర్లు బాదడంతో రజత్ పటిదార్‌ (50: 26 బంతుల్లో) అర్ధ శతకం పూర్తి చేసుకున్నాడు. అయితే... ఆ తర్వాత బంతికే ఔటయ్యాడు. దీంతో... 12 ఓవర్లు పూర్తయ్యే సరికి ఆర్సీబీ స్కోరు 3 వికెట్ల నష్టానికి 107 పరుగులకు చేరింది.

మ్యాక్స్‌ వెల్ వన్స్ అగైన్!:

ఈ సీజన్‌ లో ఒక్క భారీ ఇన్నింగ్స్‌ కూడా ఆడని మ్యాక్స్‌ వెల్ (0) ఈ మ్యాచ్‌ లో కూడా నిరాశపర్చాడు. ఇందులో భాగంగా... శ్రేయస్ గోపాల్ వేసిన 12.2 ఓవర్‌ కు ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు. దీంతో... 13 ఓవర్లకు ఆర్సీబీ స్కోరు 4 వికెట్ల నష్టానికి 111!

డుప్లెసిస్ హాఫ్ సెంచరీ!:

షెఫర్డ్ వేసిన 14 ఓవర్‌ లో డుప్లెసిస్‌ 33 బంతుల్లో అర్ధ శతకం పూర్తి చేసుకున్నాడు. దీంతో 14 ఓవర్లకు స్కోరు స్కోరు 4 వికెట్ల నష్టానికి 121కి చేరింది.

బుమ్రా వరుసగా రెండు వికెట్లు డౌన్!:

బుమ్రా వేసిన 17 ఓవర్‌ లో నాలుగో బంతికి డుప్లెసిస్‌ (61) ఔటయ్యాడు. అదే ఓవర్ నెక్స్ట్ బంతికే మహిపాల్ లామ్రోర్ (0) ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు. దీంతో 17 ఓవర్లకు స్కోరు 154 కి చేరుకుంది.

ఐదు వికెట్లు పడగొట్టిన బుమ్రా!:

ఈ మ్యాచ్ లో ఫుల్ దూకుడుమీదున్న బుమ్రా... 19 ఓవర్‌ లో వరుసగా సౌరభ్ చౌహన్ (9), విజయ్‌ కుమార్‌ వైశాఖ్ (0) ను ఔట్ చేశాడు. దీంతో... 4 ఓవర్లు బౌల్ చేసి 21 పరుగులిచ్చిన బుమ్రా 5 వికెట్లు తీశాడు! ఫలితంగా... 19 ఓవర్లకు బెంగళూరు స్కోరు 8 వికెట్ల నష్టానికి 177 పరుగులు చేసింది.

డీకే మెరుపులు.. ముంబయి టార్గెట్ 197!:

ముంబయితో జరుగుతున్న మ్యాచ్‌ లో బెంగళూరు భారీ స్కోరు సాధించింది. ఇందులో భాగంగా... నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 196 పరుగులు చేసింది. ఆర్సీబీ బ్యాటర్స్ లో డుప్లెసిస్ (61: 40 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్స్‌ లు), రజత్ పటిదార్ (50: 26 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్స్‌ లు) దూకుడుగా ఆడి అర్ధ శతకాలు సాధించగా... చివర్లో దినేశ్ కార్తీక్ (53*"; 23 బంతుల్లో 5 ఫోర్లు, 4 సిక్స్‌ లు) మెరుపులు మెరిపించాడు!

లక్ష్యఛేదనకు దిగిన ముంబయి!

బెంగళూరు నిర్దేశించిన 197 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు ముంబయి బరిలోకి దిగింది. ఈ సందర్భంగా రోహిత్ శర్మ, ఇషాన్ కిషన్ లు క్రీజ్ లోకి అడుగుపెట్టారు. రీస్ టాప్లీ వేసిన మొదటి ఓవర్ లో 2 పరుగులు మాత్రమే వచ్చాయి. అనంతరం సిరాజ్‌ వేసిన రెండో ఓవర్‌ లో ఏడు పరుగులు రాగా.. రీస్‌ టాప్లీ వేసిన మూడో ఓవర్‌ లో 14 పరుగులు వచ్చాయి.

ఇదే క్రమంలో ఆకాశ్‌ దీప్‌ వేసిన నాలుగో ఓవర్ లో 9 పరుగులు రాగా.. సిరాజ్ వేసిన ఐదో ఓవర్ ను ముంబై బ్యాటర్లు బంతాడేసుకున్నారు. ఇందులో భాగంగా... మొదటి నాలుగు బంతులను 6, 4, 6, 1 గా ఇషాన్ కిషన్ బాదగా... ఐదో బంతికి సిక్స్ కొట్టాడు రోహిత్ శర్మ. ఫలితంగా... ఈ ఓవర్‌ లో మొత్తం 23 పరుగులు వచ్చాయి.

దీంతో మొదటి ఐదు ఓవర్లు పూర్తయ్యే సరికి ముంబై స్లోరు వికెట్లేమీ నష్టపోకుండా 55 పరుగులకు చేరింది.

అర్ధశతకం చేసిన ఇషాన్‌ కిషన్‌!:

23 బంతుల్లో ఇషాన్‌ కిషన్‌ (55) హాఫ్ సెంచరీ పూర్తిచేసుకున్నాడు. మ్యాక్స్ వెల్ వేసిన ఆరో ఓవర్ లో 17 పరుగులు రాబట్టాడు. దీంతో పవర్ ప్లే ముగిసే సరికి ముంబై స్కోరు వికెట్లేమీ నష్టపోకుండా... 72కు చేరింది.

ముంబై ఫస్ట్ వికెట్ డౌన్!:

ఆకాశ్ దీప్ వేసిన 9 ఓవర్ 5వ బంతికి ఫుల్ దూకుడుమీదున్న ఇషాంత్ కిషన్ ఔటయ్యాడు. అప్పటికి అతడి వ్యక్తిగత స్కోరు... 34 బంతుల్లో 7 ఫోర్లు, 5 సిక్స్ ల సాయంతో 69 పరుగులు కాగా... 9 ఓవర్లు పూరయ్యేసరికి ముంబై స్కోరు ఒక వికెట్ నష్టానికి 103 పరుగులకు చేరింది.

ముంబై రెండో వికెట్ డౌన్:

వీల్ జాక్స్‌ వేసిన 12 ఓవర్‌ లో తొలి బంతికి బౌండరీ బాదిన రోహిత్ శర్మ తర్వాతి బంతికి ఔటయ్యాడు. దీంతో ముంబై స్కోరు 12 ఓవర్లు ముగిసే సరికి రెండు వికెట్ల నష్టానికి 151 పరుగులకు చేరింది.

17 బంతుల్లోనే సూర్యకుమార్‌ హాఫ్‌ సెంచరీ!:

సూర్యకుమార్‌ యాదవ్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. ఇందులో భాగంగా... రీస్ టాప్లీ వేసిన 13 ఓవర్‌ లో తొలి బంతికి ఫోర్, మూడో బంతి నుంచి వరుసగా 6, 4, 4 బాదేసి 17 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. దీంతో 13 ఓవర్లు పూర్తయ్యేసరికి ముంబై స్కోరు 2 వికెట్ల నష్టానికి 169 పరుగులకు చేరింది.

ముంబయి మూడో వికెట్ డౌన్!:

క్రీజ్ లోకి వచ్చింది మొదలు బాదుడే బాదుడు అన్నట్లుగా సాగిన సూర్య కుమార్ యాదవ్ ఇన్నింగ్స్ కు తెరపడింది. విజయ్‌ కుమార్‌ వేసిన 14 ఓవర్‌ లో మూడో బంతికి సూర్యకుమార్ యాదవ్ ఔటయ్యాడు. అప్పటికి అతడి వ్యక్తిగత స్కోరు... 19 బంతుల్లో 5 ఫోర్లు, 4 సిక్స్ ల సాయంతో 52 పరుగులు.

దీంతో 14 ఓవర్లకు ముంబై స్కోరు 3 వికెట్ల నష్టానికి 181 కి చేరింది.

చెలరేగిన బ్యాటర్లు.. ముంబై ఘన విజయం!:

బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌ లో ముంబై బ్యాటర్లు చెలరేగారు. దీంతో బెంగళూరు నిర్దేశించిన 197 పరుగుల లక్ష్యాన్ని ముంబై 15.3 ఓవర్లలోనే ఛేదించింది.