టార్గెట్ తమీం... 75శాతం కోసేశారు!

Thu Jul 23 2015 18:03:06 GMT+0530 (IST)

ఈమధ్య కాలంలో బంగ్లాదేశ్ క్రికెట్ టీం... ఫుల్ జోష్ మీదుంది! మొన్నటికి మొన్న టీం ఇండియాకి షాక్ ఇచ్చిన బంగ్లా బుడ్డోల్లు తాజాగా జరిగిన వండే సిరీస్ లో 2-1 తో దక్షిణాఫ్రికా కు చుక్కలు చూపించారు. ఇదే క్రమంలో తాజాగా జరుగుతున్న టెస్ట్ మ్యాచ్ లో కూడా సఫారీలను సునాయాసంగా ఎదుర్కొంటున్నారు. ఈ క్రమంలో "దక్షిణాఫ్రికా క్రికెటర్లు చాలా ప్రొఫెషనల్ గా వ్యవహరిస్తారు" అని ఉన్న పేరును కాస్త చెరిపేసుకోవడానికి శతవిధాలా ప్రయత్నిస్తున్నారు!

తాజాగా దక్షిణాఫ్రికా క్రికెటర్లు సహనం కోల్పోయి ప్రవర్తిస్తున్నారు. బంగ్లాదేశ్ తో జరుగుతున్న తొలి టెస్ట్ మ్యాచ్ లో బంగ్లా ఓపెనర్ తమీం ఇక్బాల్ మంచి ఫెర్మార్మెన్స్ ఇస్తూ సఫారీల సహనాన్ని పరీక్షిస్తునాడు. ఈక్రమంలో దక్షిణాఫ్రికా వికెట్ కీపర్ క్వింటాన్ డికాక్ కావాలని ఇక్బాల్ ను భుజంతో గుద్దాడు! ఈ విషయాన్ని సీరియస్ గా పరిగణించిన మ్యాచ్ రిఫరీ క్రిస్ బ్రాడ్... క్వింటన్ మ్యాచ్ లో 75శాతం ఫీజు కోత విధించారు! ఇటువంటి ప్రవర్తన ఏమాత్రం మంచిదికాదని క్రిస్ కాస్త సీరియస్ గానే సఫారీలకు సూచించారు. ఈ మ్యాచ్ లో తమీం 57 పరుగులు చేశాడు!

కాగా... ఈమధ్య ముగుసిన వండే సిరీస్ లో కూడా ఇదే ఆటగాడిని రోసౌ భుజంతో గుద్దడంతో 50శాతం ఫైన్ విదించిన విషయం తెలిసిందే! ఈ పనులు చూస్తున్న సాదారణ క్రికెట్ అభిమాని... దక్షిణాఫ్రికాకు ఓటమి భయం వల్ల ఇటువంటి ప్రవర్తన చేస్తున్నారని అంటున్నారు!