Begin typing your search above and press return to search.

సానియా తీరు మార్చుకోవాలేమో....

By:  Tupaki Desk   |   17 July 2015 8:44 AM GMT
సానియా తీరు మార్చుకోవాలేమో....
X
తెలంగాణ బ్రాండ్‌ అంబాసిడర్‌, హైదరాబాదీ టెన్నిస్‌ స్టార్‌ సానియా మీర్జా తన వరుస విజయాలతో కెరీర్ పీక్‌ స్టేజ్‌లో ఉంది. అయితే మన హైదరాబాదీ అని గర్వపడాల్సిన స‌మ‌యంలో తెలుగు మీడియా ప‌ట్ల సానియా తీరుతో ఆ వ‌ర్గాలు ఇబ్బందులు ప‌డుతున్నాయ‌ట‌.

ఎవరైనా స్టార్‌ తమకు సంబంధించిన వివ‌రాలు మీడియాకు తెలియచేయడానికి, ప్రెస్‌మీట్‌కు ముందుగా అన్ని ఛానల్స్‌కు ఆహ్వానం పంపిస్తారు. కానీ, సెలబ్రీటి అయిన సానియా త‌న‌కు అవన్నీ పట్టవన్న‌ట్లు ఉంటారు. అసలు తెలుగు మీడియాకు ఎలాంటి స‌మాచారం ఇవ్వరని, తెలుగు మీడియా వైపు ఈ స్టార్‌ కన్నెత్తి కూడా చూడదని మీడియా వ‌ర్గాలు చెవులు కొరుక్కుంటున్నాయి. ఒక వేళ ఇంటర్య్వూ ఇచ్చినా...ఆ రిపోర్టర్‌ తన చెల్లికి క్లోజ్ ఫ్రెండ్ అయి ఉంటేనే ఆ అవకాశమిస్తుంటార‌ని అంటున్నారు.

మ‌రోవైపు ఇంటర్వ్యూ అవ‌కాశం ద‌క్కిన ప‌రిస్థితి మ‌రింత భిన్నంగా ఉంద‌ట‌. ఇంగ్లీషులో క్వశ్చన్‌ అడిగితే హిందీలో, హిందీలో అడిగితే ఇంగ్లీషులో సమాధానం చెప్పి ముప్పు తిప్పలు పెడుతుందని జ‌ర్న‌లిస్టులు వాపోతున్నారు. ప్రెస్‌ మీట్‌లో క్వశ్యన్స్‌ అడగడానికి ఛాన్స్‌ ఇవ్వరని, ఒకటి రెండింటికి సమాధానం చెప్పి ఫైనల్‌ అని కన్‌క్లూజన్‌ లేకుండా సానియా క్లోజ్‌ చేస్తుంటార‌ని జ‌ర్న‌లిస్టులు స‌ణుక్కుంటున్నారు.

సానియా సోద‌రి ఆనం మీర్జా రీసెంట్‌గా ఓ నేషనల్‌ ఛానల్‌లో ఇంటెన్‌షిప్ చేశారు. అందువల్ల ఆమె ఎక్కడున్నా ఆ ఛానల్‌కు మాత్రమే ఎక్స్‌క్లూజివ్‌ ఇంటర్వ్యూ ఇస్తున్నార‌ని స‌మాచారం. సానియా లండన్‌లో వింబుల్డన్‌ గెలిచిన తరువాత ఆ ఛానల్‌తో మాత్రమే తన ఆనందాన్ని పంచుకుంది. తెలుగు మీడియాపై చిన్న చూపు చూస్తూ.. పూర్తిగా దూరం పెడుతున్న తీరు గ‌మ‌నించుకోవాల‌ని మీడియా వ‌ర్గాలు భావిస్తున్నాయి.