Begin typing your search above and press return to search.

ధోనీకి సెటైరా... మీడియాకు సమాధానమా?

By:  Tupaki Desk   |   24 July 2015 12:14 PM GMT
ధోనీకి సెటైరా... మీడియాకు సమాధానమా?
X
టెస్ట్ కెప్టెన్సీ నుండి తొలగిన తర్వాత ధోనీ పట్ల కొంతమంది బోర్డు సభ్యులే కానీ, సెలక్టర్లే కానీ, తోటి ఆటగాళ్లే కానీ... వారు మాటలాడేమాటల్లో అర్ధం స్పష్టంగా కనిపిస్తోందనే చెప్పాలి. టైం దొరికితే చాలు ధోనీపై సెటైర్లు వేసేవారు ఒకరైతే... మీడియాను అడ్డుపెట్టుకునో, లేక పరోక్షంగానో ధోనీని పూచకపుల్లలా తీసేసేవారు మరికొందరు! అయితే తాజాగా సందీప్ పాటిల్ చేసిన వ్యాఖ్యలు కూడా వీటిలో ఒక కోవకు చెందినవిగానే పరిగణించాలి! ప్రత్యక్షమా, పరోక్షమా అనే విషయం పక్కన పెడితే దిమాకున్న వాడికి ఇవి కచ్చితంగా ధోనీకి హెచ్చరికలు, సెటర్లు వంటివే అనే ఎక్కువమంది అభిప్రాయపడుతున్నారు!

విషయనికి వస్తే... శ్రీలంక పర్యటనకోసం జట్టు ఎంపిక జరిగింది! టెస్ట్ జట్టుకు కోహ్లీ ఎవరిని కోరితే వారిని ఎంపికచేశినట్లే అనిపిస్తుంది! అలా అని సెలక్ట్ చేయనివారనంతా కోహ్లీ వద్దనిచెప్పినట్లు కాదు! ఆ విషయం కాసేపు పక్కన పెడితే... టెస్ట్ జట్టుకోసం కోహ్లీకి ఇచ్చిన ప్రాధాన్యత వండే జట్టు ఎంపికలో ధోనీ అభిప్రాయాలకు విలువివ్వలేదని తెలుస్తోంది!! ధోనీ కెప్టెన్ గా ఉన్న ఐపీఎల్ మ్యాచుల్లోనూ, టెస్టుల్లోనూ, వన్ డేల్లోనూ, ట్20ల్లోనూ కచ్చితంగా జడేజా, రైనా లు ఉండి తీరతారు అనే మాటలు సోషల్ నెట్ వర్క్స్ లో బాగా వినిపిస్తుంటాయి! సరిగ్గా గమనిస్తే నిజం కూడా అదే! అయితే తాజాగా ఎంపిక చేసిన జట్టులో రైనా, జడేజాలకు టెస్ట్ జట్టులో స్థానం కల్పించలేదు! దీనిపై స్పందించిన సెలక్షన్ కమిటీ చైర్మన్ పాటిల్... ఈ మార్పులు చేర్పులూ సహజం, కెప్టెన్ కోరిక మేరకు కూడా జట్టులో మార్పులు ఉంటాయి. కెప్టెన్ కోరుకునే శైలి కలిగినవారిని ఎంపిక చేయడం మాబాధ్యత అని అన్నారు. అయితే దీనిలో మరో అర్ధం వెతికితే... ఇన్నాళ్లూ టేలెంట్ లేకపోయినా రైనా, జడేజాలను ధోనీ ఆడిస్తూ వచ్చాడని అర్ధం అవుతుందని పలువురు అభిప్రాయపడుతున్నారు!

పాటిల్ సెటైర్లకు ఉదాహరణగా మరో అంశాన్ని పరిశీలిస్తే... టెస్టుల్లో ధోనీ మంచి ఫలితాలు సాధించాడు, కొహ్లీ కూడా బాగానే ప్రారంభించాడు అతనికి మరింత సమయం ఇస్తే నిరూపించుకుంటాడు అన్నారు. అక్కడితో ఆగని పాటిల్... ఏదో జరగబోతోందని కంగారు పడటం, ఆందోళన చెందడం అనవసరం... సచిన్, గంగూళీ, లక్షణ్ లు రిటైరైతే ప్రత్యామ్నాయాలు దొరుకుతాయో లేదో అని కంగారు పడ్డాం... కానీ అద్భుతమైన క్రీడాకారులు దొరికారు అని ధోనీ రిటైర్మెంట్ పై పరోక్షంగా స్పందించాడు! అంటే... ఎవరు ఉన్నా లేకపోయినా పోయేదేమీ లేదు అని చాలా సులువుగా చెప్పేశాడు సంజయ్ అని నెటిజన్లు తెగ కామెంట్స్ పోస్ట్ చేసేస్తున్నారు! ఏది ఏమైనా ఒక వర్గం క్రికెట్ పెద్దలు మాత్రం ధోనీ పై కాస్త గుర్రుగా ఉన్నారని, మనకూ టైం వచ్చిందికదా అని వాయిస్ పెంచేవారు ఎక్కువవుతున్నారని తెలుస్తోంది!