సెక్సీయెస్ట్ పెయిర్.. బ్రేకప్ అయిపోయింది

Sat Jul 25 2015 14:57:59 GMT+0530 (IST)

మగాళ్లు క్రికెట్ ఆడితే మహబాగా చూస్తారు కానీ.. ఆడాళ్లు ఆడితే పట్టించుకునే నాథుడే ఉండడు. ఫుట్ బాల్ హాకీ లాంటి ఆటల పరిస్థితి కూడా ఇంతే. ఐతే టెన్నిస్ లో మాత్రం మగాళ్ల ఆటతో పాటు ఆడాళ్ల ఆటనూ బాగానే ఆదరిస్తారు. మహిళా టెన్నిస్ ప్లేయర్లకు మంచి క్రేజే ఉంటుంది. ఇక్కడ ఇంకో ప్రత్యేకత ఏంటంటే.. ఒకే క్రీడకు చెందిన ఆడ మగా రొమాన్స్ చేసుకోవడం ఈ క్రీడలోనే కనిపిస్తుంటుంది. స్టెఫీ గ్రాఫ్ ఆండ్రీ అగస్సీ లాంటి పెళ్లయిన జంటలు కూడా టెన్నిస్ లో ఉన్నాయి. స్టెఫీ అగస్సీ తర్వాత ఆ స్థాయిలో క్రేజ్ తెచ్చుకున్న టెన్నిస్ జంట మరియా షరపోవా దిమిత్రోవ్ లదే. రష్యాకు చెందిన షరపోవా కెరీర్ ఆరంభం నుంచి ఎవరితోనో ఒకరితో రొమాన్స్ చేస్తూనే ఉంది. ఐతే ఆమె మాజీ ప్రేమికులెవ్వరూ టెన్నిస్ ప్లేయర్లు కాదు.ఐతే రెండేళ్ల కిందట బల్గేరియా ప్లేయర్ దిమిత్రోవ్ తో ప్రేమాయణం మొదలుపెట్టి అందరికీ షాకిచ్చింది మరియా. షరపోవా స్థాయికి దిమిత్రోవ్ తక్కువే అని చెప్పాలి. మాజీ నెంబర్ వన్ అయిన షరపోవా.. ప్రస్తుతం టెన్నిస్ లో అత్యంత ఆదరణ ఉన్న క్రీడాకారిణి అనడంలో సందేహం లేదు. ఐతే ర్యాంకింగ్స్ లో చాలా దిగువన ఉండే దిమిత్రోవ్ ఆమెను బాగానే పడేశాడు. ఐతే అందగాడు కాబట్టి అతడితో రొమాన్స్ కు ఎలాంటి అభ్యంతరం చెప్పలేదు షరపోవా. రెండేళ్లుగా ఈ జంట చాలా దేశాలు తిరిగింది. వారి రొమాన్స్ గత ఏడాది పీక్స్ కు వెళ్లిపోయి ఇద్దరూ ఎంగేజ్మెంట్ చేసుకుంటారని కూడా వార్తలొచ్చాయి. షరపోవా వ్యవహారం తెలిసినవాళ్లు దిమిత్రోవ్ ను ఆమె వదిలించుకోవడం ఖాయమన్నారు. ఇప్పుడు అదే జరిగింది. షరపోవా దిమిత్రోవ్ విడిపోయాడు. షరపోవాకు దూరమైన సంగతిని దిమిత్రోవే స్వయంగా వెల్లడించాడు. బ్రేకప్ సందర్భంగా ఆమెపై విమర్శలేమీ చేయకుండా ఆల్ ది బెస్ట్ చెప్పాడు. ఇద్దరం ఇక కెరీర్ పై దృష్టిపెడతామన్నాడు. విశేషం ఏంటంటే.. షరపోవాకు మైదానంలో దారుణమైన ఓటములు రుచి చూపించి..ఆమెను ఏడిపించిన అమెరికా నల్లకలువ సెరెనా విలియమ్స్ తో ఇంతకుముందు దిమిత్రోవ్ ప్రేమాయణం నడిపాడు. ఆమెను వదిలించుకున్నాకే షరపోవాను తగులుకున్నాడు. ఇప్పుడు షరపోవా అతణ్ని వదిలేసింది.