ధోనీకి ఏమాత్రం తగ్గలేదు!

Sat Jul 25 2015 10:36:22 GMT+0530 (IST)

ఏనుగు చచ్చినా వెయ్యే బ్రతికున్నా వెయ్యే... ఈ కొటేషన్ ఈ పరిస్థితికి సరిపోతుందో లేదో తెలియదు కానీ... ధోనీ గురించి మాట్లాడుతున్నాం కదా ఏదైనా బరువైన ప్రారంభం చేయాలని వాడటం జరిగిందన్నమాట! విషయనికి వస్తే... భారత క్రికెట్ చరిత్రలో ధోనీ స్థానం ప్రత్యేకం... కొన్ని విషయాల్లో ప్రధమం కూడా! టీం ఇండియాకు అందని ద్రాక్షలా ఉన్న ఎన్నో విజయాలకు తనదైన చాణక్య కెప్టెన్సీతో సాధించి చూపించాడు! అయితే ఈ మధ్య టెస్ట్ కెప్టెన్సీ నుండి వైదొలగడం చెన్నై సూపర్ కింగ్స్ పై వేటుకు సంబందించిన వార్తలు మొదలైనవాటివల్ల ధోనీ ప్రాభవం తగ్గుతుందనే వార్తలు వస్తున్నాయి!

అయినా కూడా ధోనీ మార్కెట్ విలువ ఏమాత్రం తగ్గలేదు. మార్కెట్ లోనూ జనాల్లో నూ అదే క్రేజ్ అదే డిమాండ్! తాజాగా లండన్ స్కూల్ ఆఫ్ మార్కెటింగ్ విడుదల చేసిన ఒక జాబితా ఇందుకు తాజా ఉదాహరణగా చెప్పుకోవచ్చు! వాణిజ్య ఒప్పందాల పరణంగా అత్యధిక డిమాంద్ ఉన్న టాప్ - 10 స్పోర్ట్స్ పర్సన్ జాబితాలో మహేంధ్రసింగ్ ధోనీకి స్థానం దక్కింది! ఈ లిస్ట్ లో మహి 9వ స్థానంలో ఉన్నాడు! మరో విషేషం ఏమిటంటే... ప్రపంచ క్రీడా దిగ్గజాలైన క్రిస్టియానో రోనాల్డో షరపోవా ఉసెన్ బోల్డ్ లియెనెల్ మెస్సీ ఆండీ ముర్రే కంటే కూడా ధోనీ టాప్ లో ఉన్నాడు! అయితే ఈ జాబితాలో రోజర్ ఫెదరర్ అగ్రస్థానంలో ఉన్నాడు!

ఇదే సమయంలో ఒక ఫోర్బ్స్ మేగజైన విడుదల చేసిన... ఈ ఏడాది అత్యంత ధనిక క్రీడాకారుల జాబితాలో కూడా ధోనీ టాప్ 100 లో 31వ స్థానంలో నిలిచాడు! ఈ లిస్ట్ లో కూడా ధోనీ... జకోవిచ్ ఉసేన్ బోల్డ్ సచిన్ కంటే మెరుగైన స్థానంలో నిలిచాడు!